- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: శశికళకు తన ఇంటిని ఇచ్చేసిన తులసి.. దారుణంగా అవమానించిన భాగ్య!
Intinti Gruhalakshmi: శశికళకు తన ఇంటిని ఇచ్చేసిన తులసి.. దారుణంగా అవమానించిన భాగ్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక ఈ సీరియల్ ప్రతి ఒక్క విషయంలో ఒక ఇల్లాలు భరించే అనే కాన్సెప్ట్ తో ప్రసారమవుతుంది. ఇక ఈ రోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.

శశికళ (Shashikala) తన అప్పు తీర్చమని లేదంటే తన ఇల్లుని తనకు అమ్మాలని తులసిపై డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. ఇక తులసి ఇల్లుని అమ్మాలని నిర్ణయం తీసుకోవడంతో అంతలోనే భాగ్య (Bhagya) వచ్చి తన వాటా కూడా అడిగి మరింత షాక్ ఇచ్చింది.
ఇక లాస్య (Lasya) భాగ్య కు ఫోన్ చేసి.. తులసి మాటలకు లొంగవద్దు అని చెబుతుంది. ఇక భాగ్య (Bhagya) కూడా లొంగనని.. వాటా వచ్చేవరకు ఇంట్లో నుంచి కదిలేది లేదని అంటుంది. ఇక నేను చేయలేని పనిని చేసావ్ భాగ్య అంటూ పొంగిపోతుంది లాస్య.
ఇక తనకు కూడా ఆ ఇంట్లో పెద్ద కోడలిగా వాటా తీసుకునే హక్కు ఉంది అని అంటుంది. ఎలాగైనా కోర్టుకి వెళ్ళడం కరెక్ట్ అంటూ.. శశికళను (Shashikala) తట్టుకోలేమని.. యుద్ధం చేయాలి అని.. ఇళ్లును అమ్మనివ్వకుండా చేయాలి అని చెబుతుంది. ఆ మాటలకు భాగ్య (Bhagya) తగ్గేదేలే అని అంటుంది.
మరో వైపు నందు (Nandhu) భోజనం చేయడానికి సిద్ధమవ్వగా అక్కడ భోజనం లేకపోయేసరికి లాస్యను అడుగుతాడు. ఇక లాస్య (Lasya) వంట చేయలేదని.. ఆన్లైన్లో ఆర్డర్ చేసే మళ్లీ డబ్బులు వేస్ట్ అని అంటావని చేయలేదు అంటూ కాసేపు నందుతో మాటల యుద్ధం చేస్తుంది.
ఇక ప్రేమ్ (Prem) ఉద్యోగం కోసం బయటకు వెళ్తుండగా శృతి (Shruthi) కొన్ని విషయాలలో ధైర్యం ఇస్తుంది. లక్ష్యం సాధించే క్రమంలో ఆత్మాభిమానం అడ్డుపడితే దానితో రాజీపడి ముందుకు వెళ్లాలి.. అహం దెబ్బ తిన్నదని ఆగిపోకూడదు అంటూ తన మాటలతో ధైర్యం ఇస్తుంది.
లాస్య (Lasya) తులసికి ఫోన్ చేసి మళ్లీ మాటల యుద్ధం చేస్తుంది. ఇదంతా భాగ్య తను ఎక్కుపెట్టిన బాణం అంటూ.. ఈ యుద్ధంలో తమదే విజయమని అంటుంది. ఇక తులసి (Tulasi) కూడా లాస్య కు తన మాటలతో బుద్ధి చెప్పే ప్రయత్నం చేస్తుంది.
పైగా రేపే భాగ్య (Bhagya) ఇల్లు అమ్మకుండా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెస్తుంది అని.. శశికళ మొఖం చూపించకుండా పారిపోవడానికి బ్యాగ్ రెడీ చేసుకో అని లాస్య చెప్పటంతో తులసి కంగారు పడినట్లు కనిపిస్తుంది. ఇక ప్రేమ్ (Prem) ఓ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్లి అక్కడ పనిలో చేరుతాడు.
మరోవైపు భాగ్య (Bhagya) తన భర్తకి ఫోన్ చేసి జరుగుతున్న విషయాన్ని మొత్తం చెబుతుంది. అది విన్న తులసి భాగ్య కు సర్ది చెబుతుంది. కానీ భాగ్య అసలు వినకుండా తన మాటలతో తులసిని అవమానిస్తుంది. ఇక తరువాయి భాగంలో తులసి శశికళకు (Shashikala) తన ఇంటిని ఇచ్చేస్తూ బాగా ఎమోషనల్ అవుతుంది.