- Home
- Entertainment
- Intinti Gruhalakshmi: ప్రేమ్‌ను అభినందించిన నందు.. తులసి ఆనందాన్ని చూసి రగిలిపోతున్న లాస్య!
Intinti Gruhalakshmi: ప్రేమ్‌ను అభినందించిన నందు.. తులసి ఆనందాన్ని చూసి రగిలిపోతున్న లాస్య!
Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారం అవుతున్న ఇంటింటి గృహలక్ష్మి (Intinti Gruhalakshmi) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మంచి కుటుంబ కథ నేపథ్యంలో కొనసాగుతుంది. ఇక ఈరోజు జులై 11 ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.

ఎపిసోడ్ ప్రారంభంలో.. ప్రేమ్ (Prem) తన పాటతో అందరినీ ఆకట్టుకొని మొదటి స్థానంలో నిలుస్తాడు. నందు (Nandhu) కూడా తన కొడుకు మంచి ప్రయోజకుడు అవుతాడు అన్న తన ఓటు కూడా ప్రేమ్ కు వేయటంతో లాస్య నందు పై తెగ ఫైర్ అవుతూ ఉంటుంది.
ఆ తర్వాత ప్రేమ్ వేదికపై తన తల్లి తులసి (Tulasi) ఎంతో గొప్పగా చెబుతాడు. ఇక తాను పడిన బాధల వెనక తన తల్లి ధైర్యంగా నిలబెట్టింది అని.. తన తండ్రి తనను పట్టించుకోలేదు అని అనడంతో నందు (Nandhu) అవమానంగా ఫీల్ అవుతాడు. ఇక పక్కనే ఉన్న లాస్య (Lasya) నందుకు అవమానం జరగటంతో తట్టుకోలేక పోతుంది. ఆ తర్వాత ప్రేమ్ తన గెలుపుకు తన భార్య శృతి కూడా ఉందని శృతి గురించి గొప్పగా చెబుతాడు.
ఇక తనకొచ్చిన ట్రోఫీని తన తల్లికి అందజేసేలా చేస్తాడు ప్రేమ్ (Prem). అది చూస్తున్న లాస్య (Lasya) కు బాగా మండిపోతూ ఉంటుంది. ఇక తులసి (Tulasi) కూడా వేదికపై నాలుగు మాటలు మాట్లాడగా అందులో నందుని ఉద్దేశించి కూడా రెండు మాటలు మాట్లాడుతుంది. దాంతో నందు కి మరింత అవమానం కలిగినట్లుగా అనిపిస్తుంది.
ఇక ఆ తర్వాత అందరూ ప్రేమ్ (Prem) ను అభినందిస్తూ ఉంటారు. అదే సమయంలో అక్కడికి నందు (Nandhu) వచ్చి కంగ్రాట్స్ అని చెప్పి గతంలో నిన్ను అన్న మాటలన్నీ వెనుకకు తీసుకో అని అంటాడు. దాంతో ప్రేమ్ మీరు అనే హక్కు ఉంటుంది అని.. కానీ అమ్మ విషయంలో మీరు అన్న మాట వెనుకకు తీసుకోలేను అని అంటాడు.
నందు (Nandhu)వెంటనే అమ్మగా మీ అమ్మ గెలిచింది అని.. నాన్నగా నేను ఓడిపోయాను అని అంటాడు. ఇక తులసి తన మనసులో అమ్మగా నేను గెలిచాను.. కానీ భార్యకు గెలవలేకపోయాను అని బాధపడుతుంది. మరోవైపు లాస్య (Lasya) ఇంట్లో తన కొడుకుతో పిజ్జా తింటూ ఉంటుంది.
పైగా బాగా చిరాకుగా కనిపిస్తుంది. అప్పుడే నందు (Nandhu) రావటంతో నందు పై బాగా ఫైర్ అవుతుంది. రావు అనుకున్నాను అని వెటకారంగా మాట్లాడుతుంది. తినడానికి వంట చేయలేదు అంటూ.. ఒక పిజ్జా పీస్ మిగిలింది అని అది ఇచ్చాక మళ్ళీ తన మాటలతో నందుని అది కూడా తినకుండా చేస్తుంది.
ఇక తులసి (Tulasi) ఇంట్లో తన పిల్లలుగా ఊహించుకున్న బొమ్మలతో ప్రేమ్ బొమ్మని తీసి తెగ మురిసిపోతుంది. ఇక అక్కడికి అనసూయ దంపతులు వచ్చి తన సంతోషాన్ని పంచుకుంటారు. అంతేకాకుండా అందరు మంచిగా ఉండాలి అని ఈ ఆషాడ మాసంలో బోనం చేయిస్తాను అని మొక్కాను అని అనసూయ (Anasuya) అంటుంది.
మరుసటి రోజు తులసి (Tulasi) తన కుటుంబ సభ్యులతో బోనాల పండుగలో హడావుడిగా కనిపిస్తుంది. అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. ఇక పక్కనే వసుధార (Vasudhara), సాక్షి రిషి ని దక్కించుకోవడం కోసం బోనం చేయటానికి వస్తారు. ఆ తర్వాత వారిని చూసి తులసి వారి దగ్గరికి వెళ్లి వారికి సహాయం చేస్తుంది.