- Home
- Entertainment
- KGF 2: రాజమౌళికి సవాల్ విసిరిన ప్రశాంత్ నీల్... బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ కూడా దిగదుడుపేనా!
KGF 2: రాజమౌళికి సవాల్ విసిరిన ప్రశాంత్ నీల్... బాహుబలి, ఆర్ ఆర్ ఆర్ కూడా దిగదుడుపేనా!
దేశం మెచ్చిన దర్శకుడిగా ఎదిగారు రాజమౌళి. ఓటమి ఎరుగని దర్శకధీరుడు జక్కన్న రికార్డుల కింగ్, బాక్సాఫీస్ బాద్షా. ఆయన మూవీ వస్తుందంటే పాత రికార్డులు గల్లంతే... అలాంటి రాజమౌళికి ప్రశాంత్ నీల్ రూపంలో సవాల్ ఎదురవుతుంది.

RRR Movie- KGF Chapter 2
కెజిఎఫ్ చాప్టర్ 2(KGF Chapter 2) యూనానిమస్ హిట్. ఈ మూవీ బాగోలేదన్న ప్రేక్షకుడే లేడు. ఫస్ట్ షో నుండే కెజిఎఫ్ 2 చిత్రం హిట్ టాక్ సొంతం చేసుకుంది. అదే సమయంలో బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేస్తుంది. కెజిఎఫ్ చాప్టర్ 2 హిందీ వర్షన్ రాజమౌళి బాహుబలి 2 రికార్డు గల్లంతు చేసింది. టాప్ బాలీవుడ్ ఫస్ట్ డే గ్రాసర్ గా రికార్డులకు ఎక్కింది. లాంగ్ రన్ లో కెజిఎఫ్ 2 బాహుబలి రికార్డ్స్ బద్దలు కొడుతుందా లేదా అనేది పక్కన పెడితే ఓపెనింగ్ రికార్డు తన పేరున లిఖించుకుంది
ఇక తెలుగులో కూడా కెజిఎఫ్ జోరు మాములుగా లేదు. టాలీవుడ్ స్టార్ హీరోల ఓపెనింగ్ రికార్డ్స్ బ్రేక్ చేసిన యష్ ఆర్ ఆర్ ఆర్ తర్వాత స్థానం దక్కించుకున్నాడు. శుక్రవారం నుండి ఆదివారం వరకు కెజిఎఫ్ 2 వసూళ్లు ఊహించడానికి కూడా అంతు చిక్కడం లేదు. వీకెండ్ ముగిసే నాటికి ఈ మూవీ భారీ మొత్తంలో వసూలు చేయనుంది. దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టేకింగ్ చూసిన సినీ ప్రియులు మెస్మరైజ్ అవుతున్నారు. ఓ హీరోకి ఆయన ఇచ్చిన ఎలివేషన్స్ ప్రేక్షకులను సీట్స్ లో కుర్చోనివ్వడం లేదు.
దేశంలోనే గొప్ప దర్శకుడిగా చలామణి అవుతున్న రాజమౌళి (Rajamouli)కి కెజిఎఫ్ చాప్టర్ 2 తో ప్రశాంత్ నీల్ సవాల్ విసిరారు. అతి తక్కువ బడ్జెట్ తో అంత గొప్ప చిత్రం తీయొచ్చని నిరూపించారు. రూ. 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆర్ ఆర్ ఆర్ (RRR Movie) వేయి కోట్లు రాబట్టినా లాభాల లెక్కలో ఎక్కడో ఉంది. పుష్ప, ఆర్ ఆర్ ఆర్ వంటి పాన్ ఇండియా హిట్స్ ఇచ్చిన ప్రాఫిట్స్ కంటే బాలకృష్ణ అఖండ భారీ లాభాలు పంచింది. కాబట్టి ఆర్ ఆర్ ఆర్ మూవీ విజయం డిస్ట్రిబ్యూటర్స్ ని ఏమంత సంతోష పరచలేదు.
Prashanth Neel
అదే సమయంలో కెజిఎఫ్ 2 నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ లాభాలు పంచనుంది. రూ. 150 కోట్ల బడ్జెట్ లోపే కెజిఎఫ్ చాప్టర్ 2 తెరకెక్కింది. వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ. 400 వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఫస్ట్ డే కెజిఎఫ్ 2 చిత్రానికి వచ్చిన వసూళ్ల లెక్కలు చూస్తే... రికార్డు కలెక్షన్స్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్స్ మంచి లాభాలు అందుకోనున్నారు.
ఇక తెలుగు ప్రేక్షకులే కెజిఎఫ్ 2 చిత్రం ముందు ఆర్ ఆర్ ఆర్ నథింగ్ అంటున్నారు. కెజిఎఫ్ సిరీస్ ఇండియాలోనే బెస్ట్ గా అభివర్ణిస్తున్నారు. ఇండియాస్ టాప్ డైరెక్టర్ ప్రశంసలు అందుకుంటున్న రాజమౌళికి ప్రశాంత్ నీల్ ఆర్ ఆర్ ఆర్ మూవీతో సవాల్ విసిరారు. దీంతో ఆయనకు ప్రశాంత్ నీల్ బెంచ్ మార్క్ సెట్ చేశారు. మహేష్ మూవీతో రాజమౌళి ప్రశాంత్ కంటే గొప్ప దర్శకుడినని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.