MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Severe Cyclone Threat
Katrina Kaif Trolls
The Paradise Flood Alert
Flash Flood Alert
Bigg Boss Telugu 10
Dal Cooking Tips
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Srikanth Daughter Medha Meka
  • Home
  • Entertainment
  • Prasad Behara: ఇంట్లో పనిమనిషి చేతుల్లో కూడా మోసపోయా.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

Prasad Behara: ఇంట్లో పనిమనిషి చేతుల్లో కూడా మోసపోయా.. ప్రసాద్ బెహరా మాటలకు కన్నీళ్లు ఆగవు

Prasad Behara: ప్రసాద్ బెహరా తన జీవితంలో ఎదురైన చేదు అనుభవాలను, నమ్మకద్రోహాన్ని తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడాడు. పనిమనిషి మోసం, వ్యక్తిగత అనుభవాలు తనను ఎలా మార్చేశాయో, డబ్బును ఎలా ఖర్చు చేయాలో నేర్పించాయని పేర్కొన్నాడు. 

2 Min read
Author : Pavithra D
Published : Oct 17 2025, 09:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ప్రసాద్ బెహరా బాధలు..
Image Credit : Prasad Behara Instagram

ప్రసాద్ బెహరా బాధలు..

యూట్యూబ్ స్టార్ ప్రసాద్ బెహరా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తాను ఎదురుకున్న కష్టాలను చెప్పాడు. తన జీవితంలో ఎదురైన పలు సంఘటనలను వివరించాడు. ఒకప్పుడు తాను మానవ సంబంధాలకు అత్యంత విలువనిచ్చి, ఇతరులను త్వరగా నమ్మే వ్యక్తిగా ఉన్నానని.. కానీ జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు తన దృక్పథాన్ని పూర్తిగా మార్చేశాయని అతడు తెలిపాడు. ముఖ్యంగా, తన ఇంట్లో పనిచేసిన ఒక మహిళ గురించి అతడు ఇలా చెప్పాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
విడాకుల తర్వాత ఒంటరితనం
Image Credit : Prasad Behara Instagram

విడాకుల తర్వాత ఒంటరితనం

తన విడాకుల తర్వాత ఒంటరితనాన్ని అనుభవిస్తున్న సమయంలో ఆ మహిళను ఇంట్లో పనికి పెట్టుకున్నానని ప్రసాద్ బెహరా తెలిపాడు. ఆమె అడిగిన రూ. 3 వేలకు బదులుగా రూ. 6 వేల జీతాన్ని ఇచ్చానన్నారు. అంతేకాకుండా ప్రతి వారం ఒక కిలో మటన్, ఆమె కుటుంబంలోని నలుగురికీ సినిమా టిక్కెట్లు, నెలవారీగా బియ్యం, ఇతర సరుకులు కొనిచ్చానని చెప్పాడు. ఇవి కాకుండా ఆమెకు పని తక్కువ ఇచ్చి.. కబుర్లు చెబుతూ ఆమె కుటుంబానికి తోడుగా ఉన్నానని ప్రసాద్ బెహరా పేర్కొన్నాడు. ఎవరూ లేరని ఒంటరిగా ఫీల్ అవుతున్న తాను.. ఆమె చెప్పే సోదంతా వింటూ ఉండేవాడినని తెలిపాడు.

35
పనిమనిషి చేతుల్లో మోసపోయా
Image Credit : Prasad Behara Instagram

పనిమనిషి చేతుల్లో మోసపోయా

ఇంత ఉదారంగా వ్యవహరించినప్పటికీ, ఆ మహిళ తన నమ్మకాన్ని వమ్ము చేసిందని ప్రసాద్ బెహరా బాధను వ్యక్తం చేశాడు. తన నాలుగు విలువైన వాచీలను.. వాటిలో ఒకటి రూ. 90 వేల ఆపిల్ వాచ్‌ కాగా.. వాటిని ఆమె దొంగిలించిందని చెప్పాడు. చిన్న తప్పిదం వల్ల ఆమె ఈ దొంగతనం అంశంలో దొరికిపోయిందని.. ఆ వాచీలను కేవలం 400 రూపాయలకు ఆమె అమ్మేసిందని తెలిసి తీవ్ర ఆవేదనకు గురయ్యానని తెలిపాడు. ఇలా దొంగతనం చేసినందుకు ఆ మహిళలో ఎలాంటి పశ్చాత్తాపం లేకపోవడం.. తన కుటుంబ సభ్యులు తిరిగి ఆమెను పనిలోకి తీసుకోవాలని కోరినా.. ఆమెను తీసుకోలేదని ప్రసాద్ బెహరా తెలిపాడు.

45
జీవితంలో మరికొన్ని చేదు అనుభవాలు
Image Credit : Prasad Behara Instagram

జీవితంలో మరికొన్ని చేదు అనుభవాలు

ఈ సంఘటనతో పాటు, జీవితంలో ఎదురైన మరికొన్ని చేదు అనుభవాల వల్ల మనుషులపై నమ్మకం కోల్పోయానని ప్రసాద్ బెహరా వివరించాడు. ఒకప్పుడు ఎవరైనా ఆకలిగా ఉన్నట్లయితే.. వెంటనే అతడిని తన ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడినని.. ఆ తర్వాత వాళ్లతోనే దెబ్బలు తగిలించుకున్నానని జ్ఞాపకం చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరైనా ప్రేమగా పలకరించినా నమ్మలేకపోతున్నానని తెలిపాడు.

55
 నచ్చిన రీతిలో ఖర్చు చేస్తా
Image Credit : Prasad Behara Instagram

నచ్చిన రీతిలో ఖర్చు చేస్తా

ఇక పొదుపు విషయంలో తాను ఇన్సూరెన్స్ తప్పితే.. పెద్దగా ఏ పొదుపు చేయట్లేదని తెలిపాడు. నచ్చినవి కొనుక్కోవడానికి వెనుకాడనని.. షాపులకు వెళ్లకుండా జెప్టో వంటి యాప్‌ల ద్వారా ఆర్డర్ చేసుకుంటూ తనకు నచ్చిన రీతిలో ఖర్చు చేస్తానని చెప్పాడు. తనకు ఒక చెల్లి ఉందని.. ఆమె భర్త లెక్చరర్‌గా పనిచేస్తున్నారని.. వారికి పెద్దగా ఆర్థిక సమస్యలు లేవని ప్రసాద్ బెహరా తెలిపాడు. తనకున్న సమస్యలను, ఒత్తిళ్లను నవ్వుతూ ఎదుర్కొంటున్నానని, హాస్యం తన జీవితంలో ఒక భాగమని అతడు తెలిపాడు.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Katrina Kaif Trolling: కత్రినా ట్రోల్ అవుతుంటే సల్మాన్ ఫైర్ అయ్యాడు.. మరి భర్త విక్కీ కౌశల్ ఎందుకు సైలెంట్?
Recommended image2
The Paradise Review: నాని జాతకం మారబోతోందా? స్టార్ హీరోల లిస్ట్ లో చేరినట్టేనా? ది పారడైజ్ మూవీ ఫస్ట్ రివ్యూ..
Recommended image3
వర్షిణి కోసం దేబ్జానీకి అన్యాయం చేసిన ముఖేష్, చేపల మార్కెట్ లా తయారైన బిగ్ బాస్ హౌస్..
Related Stories
Recommended image1
Actress: 8 సినిమాలు చేస్తే అందులో మూడే హిట్స్.. అందం ఉన్నా అదృష్టం లేని ఈ చిన్నది ఎవరంటే.?
Recommended image2
Actress: 8 నెలల వయసులోనే ఎంట్రీ.. పేరు మార్చుకుని ఇండస్ట్రీని ఏలుతోంది.. ఈ హీరోయిన్‌ ఎవరంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved