- Home
- Entertainment
- పవన్ నటించిన ఆ సినిమా ప్రకాష్ రాజ్ కి అసలు ఇష్టం లేదట, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్..మహేష్ మూవీపై కూడా
పవన్ నటించిన ఆ సినిమా ప్రకాష్ రాజ్ కి అసలు ఇష్టం లేదట, కారణం తెలిస్తే మైండ్ బ్లాక్..మహేష్ మూవీపై కూడా
సౌత్ లో విలక్షణమైన విలనిజం చూపించే నటుల్లో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు. ప్రకాష్ రాజ్ ఎన్నో నంది అవార్డులు, నేషనల్ అవార్డులు ప్రకాష్ రాజ్ సొంతం అయ్యాయి.

సౌత్ లో విలక్షణమైన విలనిజం చూపించే నటుల్లో ప్రకాష్ రాజ్ ముందు వరుసలో ఉంటారు. ప్రకాష్ రాజ్ ఎన్నో నంది అవార్డులు, నేషనల్ అవార్డులు ప్రకాష్ రాజ్ సొంతం అయ్యాయి. పూరి జగన్నాధ్, కృష్ణ వంశీ లాంటి దర్శకులకు ప్రకాష్ రాజ్ ఫేవరిట్ యాక్టర్.
పవన్, రవితేజ, చిరంజీవి, మహేష్, ప్రభాస్ ఇలా అందరి స్టార్ హీరోలతో ప్రకాష్ రాజ్ నటించారు. ప్రకాష్ రాజ్ చెప్పే డైలాగ్స్ అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. తన డైలాగ్ డెలివరీ విషయంలో ప్రకాష్ రాజ్.. పవన్ కళ్యాణ్, మహేష్ బాబుతో నటించిన చిత్రాలని ఓ ఇంటర్వ్యూలో గుర్తు చేసుకున్నారు.
తన డైలాగ్స్ విషయంలో మహేష్ బాబుతో నటించిన ఒక్కడు చిత్రం ది బెస్ట్ అంటూ ప్రకాష్ రాజ్ ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా ఒక విలన్ హీరోయిన్ పై అంత పిచ్చి ప్రేమ ప్రదర్శించడం తాను ఎక్కడా చూడలేదని.. ఒక్కడు చిత్రం మొత్తం నాతో పాటు, భూమిక, మహేష్ బాబు పాత్రల చుట్టూనే ఉంటుందని అన్నారు. తాను సంక్రాంతి ముగ్గయితే అందులో గొబ్బెమ్మని రా నేను అటూ చెప్పే డైలాగులు అద్భుతం అని ప్రకాష్ రాజ్ గుర్తు చేసుకున్నారు.
గుణశేఖర్, పరుచూరి బ్రదర్స్ కలసి నా పాత్రని మెమొరబుల్ గా తీర్చిదిద్దారు. హీరోయిన్ కోసం నేను అంతలా నటించానా అని సినిమాలో చూసుకుంటే తనకే ఆశ్చర్యం వేసిందని ప్రకాష్ రాజ్ అన్నారు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ చిత్రం గురించి కూడా ప్రకాష్ రాజ్ షాకింగ్ కామెంట్స్ చేశారు.
పవన్ కళ్యాణ్ సుస్వాగతం చిత్రంలో డైలాగులు తనకి ఏమాత్రం నచ్చలేదని ప్రకాష్ రాజ్ తెలిపారు. డైరెక్టర్ భీమినేని శ్రీనివాసరావు గారు నేను మోనార్క్ ని నన్నెవరూ మోసం చేయలేరు అని డైలాగ్ చెప్పమన్నారు. ఇదేం డైలాగ్ అండీ ఇంత చెండాలంగా డైలాగ్ ఉంటుందా.. మార్చండి సర్ అని అడిగా. కానీ ఆయన ఒప్పుకోలేదు. డైరెక్టర్ పట్టు పడితే చేయాలి కదా అని చేశా.
కానీ సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. నేను చెప్పిన డైలాగ్ తెగ వైరల్ అయిపోయింది. జనాల్లో ఎక్కడ చూసినా అదే డైలాగ్ వినిపిస్తోంది. దీనితో నేను స్వయంగా భీమినేని గారికి సారీ చెప్పా. మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నానని చెప్పా. ఇప్పుడు సుస్వాగతం సినిమా చూస్తే నా పాత్ర నాకే చాలా గమ్మత్తుగా అనిపిస్తుంది అని ప్రకాష్ రాజ్ అన్నారు.