కాలేజీలో ప్రకాష్ రాజ్ కి నిరసన సెగ.. గోమూత్రంతో షాకిచ్చిన విద్యార్థులు, గొడవ ఎందుకంటే
విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు. సౌత్ సహా అనేక భాషల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి నెగిటివ్ రోల్స్ తో పాటు, కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు.
విలక్షణ నటుడిగా ప్రకాష్ రాజ్ ఇండియా మొత్తం పాపులర్ అయ్యారు. సౌత్ సహా అనేక భాషల్లో తన నటనతో ప్రశంసలు అందుకున్నాడు. దశాబ్దాల కాలం నుంచి నెగిటివ్ రోల్స్ తో పాటు, కీలక పాత్రల్లో నటిస్తూ అలరిస్తున్నారు. అయితే ప్రకాష్ రాజ్ తరచుగా చేసే రాజకీయ వ్యాఖ్యలు ఆయన్ని చిక్కుల్లోకి నెడుతుంటాయి. అయినప్పటికీ ప్రకాష్ రాజ్ వెనుదిరగకుండా మోడీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం చూస్తూనే ఉన్నాం.
అయితే ప్రకాష్ రాజ్ పై కూడా అదే స్థాయిలో విమర్శలు, ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. తాజాగా ఊహించని విధంగా ప్రకాష్ రాజ్ కి సంబంధించిన సంఘటన వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో శివమొగ్గ జిల్లాలోని సర్ ఎంవి ఆర్ట్స్ అండ్ కామర్స్ కాలేజీలో ప్రకాష్ రాజ్ కి విద్యార్థుల నుంచి నిరసన సెగ తగిలింది. సాధారణంగా హిందూ సంఘాలు, బిజెపి నేతలు ప్రకాష్ రాజ్ పై విమర్శలు చేస్తున్నారు. కానీ విద్యార్థులకు ప్రకాష్ రాజ్ పై కోపం ఏంటి అనుకుంటున్నారా.. అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.
ఆ కాలేజీలో ప్రకాష్ రాజ్ ముఖ్య అతిథిగా 'డైలాగ్ ఆన్ థియేటర్, సినిమా అండ్ సొసైటీ' అనే కార్యక్రమం నిర్వహించారు. కానీ ఈ కార్యక్రమానికి కాలేజీ విద్యార్థులని అనుమతించలేదు. స్టూడెంట్స్ ఆడిటోరియంలోకి ఎంటర్ కాకుండా పొలిసు బందోబస్తు నిర్వహించారు. దీనితో స్టూడెంట్స్ కోపం కట్టలు తెంచుకుంది. విద్యార్థులు రంగంలోకి దిగి ఆందోళన చేపట్టారు. వీరికి బిజెపి నేతలు మద్దతుగా నిలిచినట్లు తెలుస్తోంది.
విద్యార్థులని అందుమతించని కార్యక్రమం కాలేజీలో ఎందుకు నిర్వహించారు.. ప్రైవేట్ కార్యక్రమం అయితే ఇంకెక్కడైనా చేసుకోవచ్చు కదా.. కాలేజీలో ఎందుకు అంటూ సూట్డెంట్స్ ప్రశ్నించారు. అయితే విద్యార్థుల నిరసనకు స్పందించకుండా ప్రకాష్ రాజ్ ఆ ఈవెంట్ లో ప్రసంగించి వెళ్లిపోయారు.
ప్రకాష్ రాజ్ ఆడిటోరియం నుంచి వెళ్ళిపోయాక ఆయన కూర్చున్న, ప్రసంగించిన ప్రాంతాన్ని కొందరు విద్యార్థులు గోమూత్రంతో శుద్ధి చేయడం షాకింగ్ గా మారింది. గోమూత్రాన్ని నీటిలో కలిపి విద్యార్థులు ఆడిటోరియం ని శుద్ధి చేశారు. ఇందులో ఏబీవీపీ విద్యార్థి సంఘం నాయకులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది.
తన కార్యక్రమం ముగిసిన తర్వాత ప్రకాష్ రాజ్ మీడియాతో మాట్లాడుతూ.. మనం మానవత్వాన్ని తుంగలో తొక్కే వారిపట్ల ప్రేమగా ఉంటున్నాం అంటూ పరోక్షంగా మోడీపై విమర్శలు చేశారు. దేశాల్లో మోడీ ప్రణాళికలన్నీ విఫలం అవుతున్నాయని ప్రకాష్ రాజ్ అన్నారు. మోడీ పాలన త్వరలో ముగుస్తుంది అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.