- Home
- Entertainment
- ప్యాంట్ విప్పేసి గార్డెన్‌లో పడుకున్న బాలయ్య భామ.. థండర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా.. సండే స్టఫ్
ప్యాంట్ విప్పేసి గార్డెన్‌లో పడుకున్న బాలయ్య భామ.. థండర్ థైస్‌తో పిచ్చెక్కిస్తున్న ప్రగ్యా.. సండే స్టఫ్
ప్రగ్యా జైశ్వాల్.. నటిగా నిరూపించుకుంది. హుందాతనంతో కూడిన పాత్రలు చేసి మెప్పించింది. తనలోని మంచి నటి ఉందని చాటి చెప్పింది. కానీ ఈ బ్యూటీకి అవకాశాలు రాకపోవడమే ఆశ్చర్యపరుస్తుంది.

ప్రగ్యా జైశ్వాల్.. `కంచె` సినిమాతో మెప్పించింది. హుందాతనంతో కూడిన నటనతో మెప్పించింది. అందరి చూపుని ఆకర్షించింది. దీంతో వరుసగా బ్యాక్ టూ బ్యాక్ మూడు నాలుగు సినిమా అవకాశాలను సొంతం చేసుకుంది. కానీ ఈ బ్యూటీకి రావాల్సిన పేరు సక్సెస్ రాలేదు. ఇటీవల `అఖండ`తో మంచి బూస్టప్ దొరికినా కాలం కలిసి రావడం లేదు ప్రగ్యాకి.
దీంతో ఇప్పుడు వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. విదేశీ అందాలను ఆస్వాదిస్తూ రిలాక్స్ అవుతుంది. తన అభిమానులకు అందాల విందు వడ్డిస్తుంది. అందులో భాగంగా తాజాగా అదిరిపోయే ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది ప్రగ్యా జైశ్వాల్. ఇందులో ఆమె గార్డెన్‌లో చైర్‌పై పడుకుని పోజులివ్వడం విశేషం.
అయితే ప్యాంట్ వేసుకోకుండా ప్రగ్యా జైశ్వాల్ హాట్ ట్రీట్ ఇచ్చింది. థండర్ థైస్ చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. ప్యాంట్ లేకుండా గార్డెన్‌లో పడుకుని పోజులివ్వడమే ఇప్పుడు ఆశ్చర్యపరుస్తుంది. మరోవైపు కూర్చొని తన థండర్ థైస్‌ని చూపిస్తూ పోజులివ్వడం మరో విశేషం. ఇది ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ నిస్తుంది. దీంతో దీనిపై నెటిజన్లు స్పందిస్తూ హాట్ కామెంట్లు పెడుతున్నారు. సండే స్టఫ్ అదిరిపోయిందంటున్నారు.
ఇక ప్రగ్యాజైశ్వాల్.. `మిర్చి లాంటి కుర్రాడు` చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఇందులో అభిజిత్‌తో కలిసి నటించింది. ఇది పెద్దగా ఆడలేదు. ఆ తర్వాత `కంచె` సినిమాలో వరుణ్ తేజ్‌కి జోడీగా నటించింది. సంపన్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా నటించింది. హుందాగా కనిపించి వాహ్ అనిపించింది. ఈ చిత్రంలో ప్రగ్యా నటన అందరిని మెప్పించింది.
Pragya Jaiswal
దీంతో ఈ బ్యూటీకి వరుసగా సినిమాలొచ్చాయి. `కంచె`తో వచ్చిన క్రేజ్‌తో వరుసగా ఒప్పుకుంది. నాగార్జునతో `ఓం నమో వెంకటేశాయ`, మంచు మనోజ్‌తో `గుంటూరోడు` చిత్రాల్లో నటించింది. దీంతోపాటు సాయిధరమ్ తేజ్, సందీప్ కిషన్ నటించిన కృష్ణవంశీ సినిమా `నక్షత్రం`లో మెప్పించింది. గ్లామర్‌తో అదరగొట్టింది. కానీ ఈసినిమాలన్నీ బోల్తా కొట్టాయి. అలాగే ఆ తర్వాత నటించిన `జయజానకి నాయక`, `ఆచారి అమెరికా యాత్ర` చిత్రాల్లో నటించగా, అన్నీ పరాజయం చెందాయి.
ప్రగ్యా జైశ్వాల్ కెరీర్ అయిపోయింది, కనుమరుగు కావడం ఖాయం అని అంతా ఫిక్స్ అయిన నేపథ్యంలో `అఖండ` ఆమెకి పెద్ద ఎనర్జీనిచ్చింది. ఈ సినిమా సంచలన విజయం సాధించింది. దీంతో ప్రగ్యాకి కూడా మంచి పేరొచ్చింది. ఇక తిరుగులేదని భావించారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఆ తర్వాత ఈ బ్యూటీకి ఒక్క ఆఫర్ కూడా రాకపోవడం బాధాకరం. దీంతో సినిమాలు లేక ఇలా వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. అదే సమయంలో గ్లామర్ ట్రీట్‌తో మేకర్స్ కి ఎరవేస్తుందీ హాట్ హీరోయిన్. మరి మేకర్స్ కనికరిస్తారా? అనేది చూడాలి.