- Home
- Entertainment
- Pragya Jaiswal Glamour Photos : లెహంగా, దుప్పట్టలో బాలకృష్ణ హీరోయిన్ ప్రాగ్యాజైస్వాల్ స్టన్నింగ్ లుక్స్..
Pragya Jaiswal Glamour Photos : లెహంగా, దుప్పట్టలో బాలకృష్ణ హీరోయిన్ ప్రాగ్యాజైస్వాల్ స్టన్నింగ్ లుక్స్..
‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ట్రెడిషినల్ అవుట్ ఫిట్ లో ఆకర్షిస్తోంది. ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రాగ్య లేటెస్ట్ ఫొటోషూట్ లో పాల్గొంది. వాటికి సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది.

బ్లాక్ బస్టర్ మూవీ ‘అఖండ’ హీరోయిన్ ప్రాగ్యా జైస్వాల్ (Pragya Jaiswal) ఇటీవల మహాశివరాత్రి సందర్భంగా సద్గురు జగదీష్ వాసుదేవ్ ను కలిసింది. ఆయన ఆశీర్వాదం తీసుకున్న ప్రాగ్యా ఎంతో సంతోష పడింది. తాజాగా మరో కార్యక్రమంలో పాల్గొంది.
మహిళా దినోత్సవం సందర్భంగా ఓ కార్యక్రమంలో ప్రత్యేక అతిథిగా పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన అభిమానులతో పంచుకుంది. లేటెస్ట్ ఫొటోలతో పాటు ఓ వీడియో క్లిప్ ను కూడా షేర్ చేసింది. వీడియోను వివరిస్తూ ఒక నోట్ రాసింది.
‘విభిన్న రంగాల్లోని మహిళా సాధకుల మధ్య కాస్య్టూమ్ డిజైనర్, ఫ్యాషన్ స్టైలిస్ట్ నీతా లుల్లా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది. మహిళలతో కలిసి వాక్ చేయడం సంతోషంగా ఉంది. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించి, మమ్మల్ని అభినందిచినందుకు డాక్టర్ విజయానంద్ రెడ్డికి ధన్యవాదాలు..
క్యాన్సర్ పట్ల మీ నిర్విరామ కృషి నిజంగా అభినందనీయం.. మీకు మరింత శక్తి సామర్థ్యాలు చేకూరాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందమైన మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ ప్రపంచాన్ని మరింత మెరుగైన ప్రదేశంగా మార్చుకొండి’ అంటూ వీడియో పంచుకుంటూ రాసుకొచ్చింది.
అలాగే, తను పోస్ట్ చేసిన ఫొటోల్లో చాలా అట్రాక్టివ్ గా ఉంది ప్రాగ్యాజైస్వాల్.. కిల్లింగ్ లుక్స్.. అట్రాక్టివ్ గ్లామర్ తో మతిపోగొడుతోంది. ఫొటోలో షేర్ చేస్తూ.. ‘మీ జీవితంలోకి రెక్కలు కట్టుకొని ఎగరిపోండి’ అని తెలిపింది ప్రస్తుతం ప్రాగ్యా ఫొటోలకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. లైక్ లు, కామెంట్లతో ఆమె అందాన్ని పొగుడుతున్నారు.
కేరీర్ విషయానికి వస్తే.. తెలుగులో టాప్ హీరోయిన్ స్థాయికి చేరుకుంటోంది ప్రాగ్యా.. అఖండతో తన కేరీర్ మరింత స్పీడ్ అయిందని చెప్పొచ్చు. అటు హిందీలోనూ అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. 2104లోనే ‘టిటూ ఎంబీఏ’ చిత్రంతో నార్త్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రాగ్యా.. ఇటీవల సల్మాన్ ఖాన్ తో ‘మే చలా’ మ్యూజిక్ వీడియో సాంగ్ లో నటించింది. అఖండ హిట్ తర్వాత.. ఈ సాంగ్ కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.