ప్రదీప్ మాచిరాజు హీరోగా మరో సినిమా.. హీరోయిన్ ఎవరో తెలిస్తే మతిపోవాల్సిందే
స్టార్ యాంకర్ ప్రదీప్‌మాచిరాజు ఇప్పుడు మరోసారి హీరోగా అలరించబోతున్నాడు. ఆయన హీరోగా ఓ క్రేజీ బ్యూటీతో జోడీ కట్టబోతున్నాడు. ఆ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వచ్చాయి.

తెలుగులో మేల్ యాంకర్స్ లో స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్నాడు ప్రదీప్ మాచిరాజు. దాదాపు 14ఏళ్లుగా యాంకర్‌గా రాణిస్తున్నాడు. ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు యాంకర్‌గా మెప్పిస్తున్నారు. చాలా వరకు ఆయన ఈటీవీలో వచ్చే షోస్‌కి హోస్ట్ చేస్తున్నారు. దీంతోపాటు జీ తెలుగు, స్టార్ మాలోనూ అనేక షోస్‌కి యాంకర్‌గా చేశారు. అయితే `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా` షో ప్రదీప్‌కి మంచి గుర్తింపుని పాపులారిటీని తీసుకొచ్చారు.
సెలబ్రిటీలతో టాక్ షో `కొంచెం టచ్ లో ఉంటే చెబుతా` ప్రదీప్‌ని స్టార్ యాంకర్‌ని చేసింది. దీనితోపాటు ఈటీవీలో వచ్చే `ఢీ` షో సైతం ఆయనకు మరింత క్రేజ్, పాపులారిటీని తీసుకొచ్చింది. ఆ ఇమేజ్‌తో హీరోగా మారాడు ప్రదీప్. మూడేళ్ల క్రితం ఆయన హీరోగా పరిచయం అవుతూ `30 రోజుల్లో ప్రేమించడం ఎలా` సినిమాలో నటించాడు. ఫాంటసీ రొమాంటిక్ మూవీ ఇది. ఈ చిత్రం మంచి ఆదరణే పొందింది. హీరోగానూ ప్రదీప్ మెప్పించాడు.
ఆ తర్వాత ప్రదీప్ హీరోగా బిజీ అవుతాడని అంతా భావించారు. కానీ ఇప్పటి వరకు సినిమా ప్రకటించలేదు. మరోవైపు `ఢీ` షోకి యాంకర్‌గా కంటిన్యూ అయ్యాడు. `సరిగమప` కూడా హోస్ట్ చేశాడు. ఈ క్రమంలో ఇటీవల `ఢీ` కూడా మానేశాడు ప్రదీప్. హీరోగా రాబోతున్నాడా? మ్యారేజ్ చేసుకోబోతున్నాడా అనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ప్రదీప్ ఇప్పుడు మరో సినిమా చేయబోతున్నాడట.
యాంకర్ ప్రదీప్ హీరోగా మరో సినిమా రాబోతుందట. దానికి సంబంధించిన వర్క్ జరుగుతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ బయటకు వచ్చింది. ఇందులో ప్రదీప్‌కి జోడీగా నటించేది ఎవరో తేలిపోయింది. `ఢీ` షోతోనే పాపులర్ అయిన దీపికా పిల్లిని హీరోయిన్‌గా తీసుకుంటున్నారట. ఇద్దరు ఢీ యాంకర్లు కలిసి సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్‌లో ఉందని, త్వరలోనే అప్‌డేట్ రానుందని సమాచారం. దర్శకుడు, నిర్మాత, జోనర్ వివరాలు తెలియాల్సి ఉంది.
టిక్ టాక్‌తో పాపులర్ అయ్యింది దీపికా పిల్లి. దీంతో `ఢీ`లోకి వచ్చింది. రష్మితో కలిసి ఆమె డాన్సర్లకి సంబంధించిన టీమ్ లీడర్‌గా వ్యవహరించింది. కామెడీ స్టార్స్ వంటి పలు షోస్ కూడా యాంకర్‌గా చేసింది. సినిమాల్లోనూ మెరిసింది. సుడిగాలి సుధీర్‌తో `పండుగాడు వాంటెడ్` మూవీ చేసింది. ఆ తర్వాత దీపికాకి కూడా ఆఫర్లు లేవు. సోషల్ మీడియాలో ఫోటోలతో హల్‌చల్ చేసింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు ఎట్టకేలకు హీరోయిన్‌గా మెరవబోతుందని తెలుస్తుంది. దీనికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.