MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ ..శివుడు కాదు ...మరి..? తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

‘క‌న్న‌ప్ప‌’లో ప్ర‌భాస్ ..శివుడు కాదు ...మరి..? తెలిస్తే.. ఆశ్చర్యపోతారు

శివుడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నాడు. మరో ప్రక్క అనుష్క సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఆమె పార్వతిదేవి పాత్రలో కనిపిస్తుందని..

3 Min read
Author : Surya Prakash
Published : Apr 15 2024, 10:45 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Prabhas

Prabhas


  ప్రభాస్ వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో ఫుల్ బిజీగా ఉన్న ఈ సమయంలో ఓ చిన్న పాత్రను చేయటానికి కమిటయ్యాడు.  మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తోన్న 'కన్నప్ప'లో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నాడు.. గతంలో తన పెదనాన్న కృష్ణంరాజు హీరోగా  'భక్త కన్నప్ప' సినిమాలో నటించారు. ఆయన కూడా ప్రభాస్‌తో కన్నప్ప సినిమాను రీమేక్ చేయాలనున్నారు. అయితే అనుకోని విధంగా  ఆ ప్రాజెక్ట్ మంచు విష్ణు చేతిలోకి వెళ్లింది. ఆయన ఈ సినిమాలో ఓ కీలకమైన పాత్రకు ఇంపార్టెంట్ ఉండటం.. ఆ క్యారెక్టర్‌ కోసం ప్రభాస్‌ను సంప్రదించడం జరిగింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

మంచు మోహన్ బాబు తో స్నేహంతో పాటు అటు పెదనాన్న కోరికను మన్నించినట్టు అవుతుందని ఎంతో బిజీగా ఉన్నా కన్నప్ప  ప్రాజెక్ట్‌లో క్యారక్టర్  చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు ప్రభాస్. హిందీ దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా దాదాపు కంప్లీట్ కానీకొచ్చింది. ఇక ప్రభాస్..   ఓ వారం రోజులు పాటు డేట్స్ అడ్జస్ట్ చేసినట్టు సమాచారం. అయితే ఆయన చేసేది ఏ పాత్ర అనేది సస్పెన్స్ గా మారింది

38


మొదట అందరూ ఆ పాత్ర మరేదో కాదు'కన్నప్ప' సినిమాలో మహా శివుడి వేషం వేస్తున్నాడు ప్రభాస్ అని వార్తలు వచ్చాయి. కానీ అది నిజం కాదు అని తెలిసింది.  ప్ర‌భాస్ ఈ సినిమాలో ఏ పాత్ర‌లో క‌నిపిస్తాడ‌న్న సందేహం అంద‌రిలోనూ ఉంది.  మీడియా వర్గాల నుంచి అందుతున్న లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం ఈ సినిమాలో ప్ర‌భాస్ నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌బోతున్నాడ‌ట‌. వాస్తవానికి శివుడి పాత్ర చేయాల‌ని మంచు విష్ణు ఒత్తిడి చేశాడ‌ని, ప్ర‌భాస్ ఆ భారం మోయ‌ద‌ల‌చుకోలేద‌ని, సున్నితంగా ఆ ఆఫ‌ర్ తిర‌స్క‌రించాడ‌ని చెప్పుకుంటున్నారు.

48
Prabhas

Prabhas

ఈ క్రమంలో ఆఖరిగా నందీశ్వ‌రుడిగా క‌నిపించ‌డానికి ఒప్పుకొన్నాడ‌ని  ఫిల్మ్ నగర్ వర్గాల టాక్‌. శివుడి పాత్ర‌లో బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ క‌నిపించ‌నున్నాడు. మరో ప్రక్క అనుష్క సైతం ఈ సినిమాలో ఓ కీలక పాత్ర చేస్తోంది. ఆమె పార్వతిదేవి పాత్రలో కనిపిస్తుందని చెప్పుకుంటున్నారు. అయితే అందులో ఏ మేరకు నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. 
 

58


గతంలో మంచు విష్ణు హీరోగా నటించిన 'దేనికైనా రెడీ'లో ప్రభాస్ వాయిస్ ఓవర్ చెప్పిన సంగతి తెలిసిందే కదా. కన్నప్పలో నటించేందుకు ప్రభాస్ ఎలాంటి పారితోషకం తీసుకోవడం లేదనేది సమాచారం.   ఈ చిత్రంలో న‌య‌న‌తార‌, మోహ‌న్ లాల్‌, శివ‌రాజ్ కుమార్‌. మంచు మోహ‌న్ బాబు, బ్ర‌హ్మ‌నందం కీల‌క పాత్ర‌లు పోషిస్తున్న సంగ‌తి తెలిసిందే. న్యూజీలాండ్ లో ఓ కీల‌క షెడ్యూల్ పూర్తి చేసుకొంది. ‘క‌ల్కి’ షూటింగ్ హ‌డావుడి పూర్త‌యిన వెంట‌నే ప్ర‌భాస్ ‘క‌న్న‌ప్ప‌’కు కాల్షీట్లు కేటాయిస్తాడ‌ని టాక్‌.

68


కన్నప్ప సినిమాకు మహాభారత టీవీ సీరియల్ ఫేమ్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించనున్నారు. దీంతో అంచనాలు మరింత తారాస్థాయికి చేరిపోయాయి.మోహన్ బాబు, మంచు విష్ణు కలిసి సంయుక్తంగా కన్నప్ప సినిమాను నిర్మిస్తున్నారు. మహాకవి ధూర్జటి రాసిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని భక్త కన్నప్ప చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని మూవీని తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ షూటింగ్‍ మొత్తం న్యూజిలాండ్‍లో చిత్రీకరించనున్నట్లు ఇదివరకే ప్రకటించారు. సినిమాలో ముందుగా హీరోయిన్‍గా అనుకున్న నుపుర్ సనన్ షెడ్యూల్స్ కారణంగా తప్పుకున్న విషయం తెలిసిందే.

78
Prabhas

Prabhas


 యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అంతేకాకుండా ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో ఎలా కనిపించనున్నాడో ఏఐ ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. టెక్నాలజీ సాయంతో శివుడి రూపంలో ప్రభాస్ పోస్టర్లను డిజైన్ చేసి నెట్టింట షేర్ చేస్తున్నారు డార్లింగ్ ఫ్యాన్స్. ఇక ఈ ఫోటోస్ చూసిన నెటిజన్స్ శివుడి రూపంలో ప్రభాస్ లుక్ సూపర్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే శివుడు పాత్ర కాదని తెలియటంలో షాక్ అవుతున్నారు. 

88


ఇప్పటికే మహా శివరాత్రి సందర్భంగా కన్నప్ప ఫస్ట్ లుక్ విడుదల చేస్తే మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు ప్రభాస్.. కల్కి, కన్నప్పలతో పాటు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్', సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్‌' మూవీలతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ పీరియాడిక్ వార్ డ్రామాలో నటిస్తున్నాడు. అటు సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో భారీ యాక్షన్ చిత్రం చేయనున్నాడు.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jr NTR: ఎన్టీఆర్ కి పొగరు ఎక్కువేమో అనుకున్న నటుడు, తారక్ తో ఒక్క సినిమా చేశాక అతను ఏమన్నాడంటే?
Recommended image2
Rajinikanth Controversy: నేను ఏం మాట్లాడినా సమస్యే.. ట్రోల్స్‌పై రజినీకాంత్ ఫైర్
Recommended image3
NTR: చిరంజీవి, కృష్ణ, బాలయ్య అందరూ ఫెయిల్.. ఎన్టీఆర్ రికార్డుని బద్దలు కొట్టి పడేసిన ఒకే ఒక్క హీరో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved