MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ప్రభాస్ సలార్ ఫస్ట్ రివ్యూ... గూస్ బంప్స్ గ్యారంటీ, బాక్సాఫీస్ బద్దలు!

ప్రభాస్ సలార్ ఫస్ట్ రివ్యూ... గూస్ బంప్స్ గ్యారంటీ, బాక్సాఫీస్ బద్దలు!

ప్రభాస్ ఫ్యాన్స్ కి ఇది కిక్ ఇచ్చే న్యూస్. సలార్ మూవీపై ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. మూవీ రషెస్ చూసిన క్రిటిక్ గూస్ బంప్స్ వచ్చాయి. మూవీ బాక్సాఫీస్ బద్దలు చేయడం ఖాయమని అభిప్రాయపడ్డారు.  

2 Min read
Author : Sambi Reddy
Published : Dec 01 2022, 09:08 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రభాస్ కి ఒక సాలిడ్ హిట్ కావాలి. ఆయన గత రెండు చిత్రాలు నిరాశపరిచాయి. సాహో కొంతలో కొంత పర్లేదు అనిపించింది. నెగిటివ్ టాక్ తో కూడా రూ. 450 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. హిందీలో హిట్ అందుకుంది. రాధే శ్యామ్ మాత్రం ప్రభాస్ ని మొత్తంగా ముంచేసింది. కెరీర్ ఆల్ టైం డిజాస్టర్ గా నిలిచింది. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
27

రాధే శ్యామ్ ప్రభాస్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాలేదు. కథ కథనాల్లో కూడా బలం లేకపోవడంతో ప్రేక్షకులు పెదవి విరిచారు. మరోవైపు ఆదిపురుష్ మూవీపై కూడా ఆశలు పోయాయి. దారుణమైన టీజర్ చూశాక... అభిమానులు కూడా అంగీకరించలేకపోయారు. వందల కోట్ల బడ్జెట్ తో మీరు తీసిన సినిమా ఇదేనా అని దర్శకుడు ఓమ్ రౌత్ పై విరుచుకుపడ్డారు.

37


సంక్రాంతికి రావాల్సిన ఆదిపురుష్ ని వాయిదా వేశారు. విఎఫ్ఎక్స్ వర్క్ నాసిరకంగా ఉందన్న విమర్శల నేపథ్యంలో మెరుగులు దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. వీలైనంత వరకు డ్యామేజ్ కంట్రోల్ చేయాలని చూస్తున్నారు. పలు రిపేర్స్ కి గురవుతున్న ఆదిపురుష్ విజయంపై అందరిలో నమ్మకాలు సడలాయి. 

47

దీంతో ప్రభాస్ కి హిట్ ఇవ్వాల్సిన బాధ్యత ప్రశాంత్ నీల్ మీద పడింది. అభిమానుల అంచనాలు సలార్ తో ప్రశాంత్ నీల్ అందుకోవాల్సి ఉంది. కెజిఎఫ్ తరహాలో ప్రభాస్ కి కూడా ఒక రికార్డు బ్రేకింగ్ హిట్ ఇవ్వాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. ప్రశాంత్ నీల్ టాలెంట్ పై పూర్తి నమ్మకమున్న ఫ్యాన్స్.. తమ కోరిక సలార్ తో నెరవేరుతుందని భావిస్తున్నారు.

57


కాగా అభిమానుల అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సలార్ ఉంటుందన్న సమాచారం అందుతుంది. ఫిల్మ్ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు సలార్ మూవీపై ఫస్ట్ రివ్యూ ఇచ్ఛేశాడు. ఆయన కామెంట్స్ ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపేలా ఉన్నాయి. 

67


30 సెకండ్స్ నిడివి కలిగిన సలార్ రషెష్ చూశాను. చెప్పడానికి మాటల్లేవు. గూస్ బంప్స్ వచ్చేశాయి. 2023 లో ప్రభాస్ బౌన్స్ బ్యాక్ అవుతున్నారు, అంటూ ఉమర్ సంధు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ వైరల్ అవుతుంది. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సలార్ విజయం పట్ల ఉమర్ సంధు ట్వీట్ మరింత నమ్మకాన్ని కలిగించింది. 

77


కెజిఎఫ్ మేకర్స్ సలార్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. జగపతిబాబు, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక రోల్స్ చేస్తున్నారు. 2023 సమ్మర్ కానుకగా సలార్ విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ప్రభాస్
ప్రశాంత్ నీల్

Latest Videos
Recommended Stories
Recommended image1
Karthika Deepam 2 Today Episode: జ్యోకు మాటిచ్చిన దీప- తాళి కట్టమంటే కడతావా అని ప్రశ్నించిన శ్రీధర్
Recommended image2
Dooradarshini Review: దూరదర్శని మూవీ రివ్యూ.. వింటేజ్‌ విలేజ్‌ లవ్‌ స్టోరీ ఎలా ఉందంటే?
Recommended image3
Prabhas: కృష్ణంరాజు ముఖం చూసి ప్రభాస్ ని వదిలేయమంది నా భార్య, చాలా హర్ట్ అయ్యా.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved