MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • నాగార్జునకి, `అన్నమయ్య`కి సింక్‌ కుదరడం లేదు.. ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. రాఘవేంద్రరావుకి మతిపోయిందిగా..

నాగార్జునకి, `అన్నమయ్య`కి సింక్‌ కుదరడం లేదు.. ప్రభాస్‌ షాకింగ్‌ కామెంట్స్.. రాఘవేంద్రరావుకి మతిపోయిందిగా..

ప్రభాస్‌.. నాగార్జున, `అన్నమయ్య` సినిమా గురించి ఆశ్చర్యకరమైన విషయాలను పంచుకున్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నాడు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Apr 14 2024, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

ప్రభాస్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా ఇమేజ్‌ని దాటుకుని గ్లోబల్‌ స్టార్‌గా ఎదిగేందుకు రెడీగా ఉన్నాడు. ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాల్లో `కల్కి2898ఏడీ` ఒక్కటి హిట్‌ అయితే ఆయన రేంజ్‌ మారిపోతుంది. నెక్ట్స్ లెవల్‌కి వెళ్తుంది. ఆయన తెలుగు పరిశ్రమకి ఇక దొరకడు అనేంతగా మారిపోతాడని చెప్పొచ్చు. అలాంటి భారీ ప్రాజెక్ట్స్ ల్లో ఆయన భాగమవుతున్నాడు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

ప్రభాస్‌.. ఇతర సినిమాల గురించి, ఇతర యాక్టర్స్ గురించి పెద్దగా మాట్లాడడు. తన పని తాను చేసుకుంటూ వెళ్తాడు. ఆయన స్పీచ్‌లు కూడా షార్ట్ గా ఉంటాయి. ఇతర హీరోలపై గౌరవాన్ని ప్రేమని చూపుతారు. ఎవరికి గురించి తప్పుగా, తక్కువగా మాట్లాడరు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్‌గా మారాయి. 
 

37

ప్రభాస్‌.. నాగార్జున, అన్నమయ్య సినిమాల గురించి రియాక్ట్ అయ్యారు. ఓ ఇంటర్వ్యూలో రాఘవేంద్రరావుతో తనకు ఎదురైన అనుభవాన్ని షేర్‌ చేసుకున్నారు ప్రభాస్‌. నాగార్జునకి, అన్నమయ్యకి సింక్‌ కుదరడం లేదన్నాడు. మరి ఇంతకి ఏం జరిగింది, ఆయన ఏం చెప్పాడంటే.. `అన్నమయ్య` సినిమా రిలీజ్‌ అయి పెద్ద హిట్‌ అయ్యింది. అప్పటి వరకు ప్రభాస్ సినిమా చూడలేదట. నాగార్జున ఏంటి అన్నమయ్య సినిమా చేయడమేంటి, మనసులో సింక్‌ కుదరడం లేదట. ఏదో ఉంటుందిలే అనుకుని తన ముస్లీం ఫ్రెండ్‌తో కలిసి సినిమాకి వెళ్లారట. అది చూసి షాక్‌, మైండ్‌ బ్లోయిన్‌, అరెస్ట్ అయిపోయారట. 

47

ఆ సినిమా చూసిన తన ముస్లీం ఫ్రెండ్‌ కి మతిపోయిందట. సినిమా చూసి వచ్చి ఏదేదో వాగుతున్నాడట. నేను మళ్లీ ఈ సినిమా చూడాలి, నాకు పిచ్చెక్కిపోయింది అంటూ ఎగ్జైట్‌ అవుతున్నాడట. అరేయ్‌ ఎవరు తీశార్రా ఇది అంటే `రాఘవేంద్రరావు అని ఉన్నారులే పెద్ద డైరెక్టర్‌, మా నాన్నకి ఫ్రెండ్‌ అనిచెప్పాడట ప్రభాస్‌. `అతనికి ఏం నచ్చిందనుకుంటున్నారు.. వెంకటేశ్వరస్వామి ఓపెనింగ్‌లు, వెంకటేశ్వరస్వామి రావడం వంటి సీన్లు బాగా నచ్చాయి. అందుకే మళ్లీ మళ్లీ చూడాలంటూ` ప్రభాస్‌ తన మెమరీస్‌ని షేర్‌ చేసుకున్నారు. 
 

57

ప్రభాస్‌ చెప్పిన విషయానికి రాఘవేంద్రరావు మతిపోయింది. అంతేకాదు పక్కన ఉన్న రాజమౌళి కూడా ఆశ్చర్యంగా చూడటం విశేషం. ఇది `బాహుబలి` సినిమా ప్రమోషన్స్ టై్‌మ్‌లో చేసిన ఇంటర్వ్యూ. రాఘవేంద్రరావు వ్యాఖ్యాతగా వ్యవహరించగా, దీనికి ప్రభాస్‌, రాజమౌళి గెస్ట్ లుగా వచ్చారు. ఈ సందర్భంగా అన్నమయ్య సినిమా అనుభవాన్ని పంచుకున్నాడు ప్రభాస్‌. ప్రస్తుతం ఇప్పుడో ఏడెనిమిదేళ్ల క్రితం చేసిన ఈ ఇంటర్వ్యూ క్లిప్‌ ఇప్పుడు వైరల్‌ అవుతూ ఫ్యాన్స్ ని తెగ ఆకట్టుకుంటుంది.
 

67

నాగార్జున.. అన్నమయ్యగా నటించిన భక్తిరస చిత్రం `అన్నమయ్య`. కె రాఘవేంద్రరావు దీనికి దర్శకత్వం వహించారు. సుమన్‌ వెంకటేశ్వరుడిగా కనిపించారు. రమ్యకృష్ణ ఆయన నాగార్జునకి జోడీగా కనిపించగా, భానుప్రియ పద్మావతి దేవిగా, మోహన్‌బాబు సాలువ నరసింహా రాయులుగా కనిపించారు.
 

77

1997 మే 22న ఈ సినిమా విడుదలై పెద్ద విజయం సాధించింది. మన్మథుడిగా, రొమాంటిక్‌ హీరోగా కనిపించిన నాగార్జున అన్నమయ్యగా తనలోని మరో యాంగిల్‌ చూపించి మెస్మరైజ్‌ చేశారు. దీంతో జనం నిరాజనాలు పలికారు.  

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi Collection: బాక్సాఫీస్ వద్ద రవితేజ ప్రభంజనం.. 9 రోజుల్లో ఇరుముడి ఎంత వసూలు చేసిందంటే?
Recommended image2
Krishna: 23 ఏళ్ల వయస్సులో కృష్ణకి తల్లిగా, ఏఎన్నార్ కి నానమ్మగా నటించిన యంగ్ హీరోయిన్ ఎవరో తెలుసా?
Recommended image3
Mind Bending Thriller: ప్రతి 10 నిమిషాలకు ఒక ట్విస్ట్.. ఈ సినిమా చూస్తే మీ మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే! ఎక్కడ చూడొచ్చంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved