- Home
- Entertainment
- `మా` బిల్డింగ్ కోసం ఈవెంట్‌కి రమ్మని పిలిస్తే, ప్రభాస్ చెప్పిన సమాధానానికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
`మా` బిల్డింగ్ కోసం ఈవెంట్‌కి రమ్మని పిలిస్తే, ప్రభాస్ చెప్పిన సమాధానానికి ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
ప్రభాస్ ఏం చేసినా పెద్దగానే ఉంటుంది. చేసే సాయంలోనూ ఆయనదే పెద్ద చేయి. అలాంటిది మా బిల్డింగ్ కోసం వెళ్లగా ఆయన చెప్పిన సమాధానం మైండ్ బ్లోయింగ్.

ప్రభాస్.. వ్యక్తిగా ఎంత గొప్ప మనసో అందరికి తెలిసిందే. ఆయన చేతికి ఎముకే లేదన్నట్టుగా సహాయం చేస్తారు. రాష్ట్రంలో, దేశంలో ఏ విపత్తు వచ్చినా, సెలబ్రిటీలు చేసే సాయంలో ఆయనదే పై చేయి ఉంటుంది. ప్రభాస్ ది రాజుల ఫ్యామిలీ కావడంతో చేసే సహాయం కూడా రాజులాగే ఉంటుందని ఆయన్ని అభిమానించే వాళ్లు అంటారు.
అయితే ఈ సహాయానికి సంబంధించిన ఓ సందర్భం వచ్చింది. అందుకు ప్రభాస్ చెప్పిన మాట విని సహాయం అడిగిన నటుడు శివాజీరాజాకి ఫ్యూజులు ఎగిరిపోయాయట. మరి ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, శివాజీ రాజా హీరోగా, నటుడిగా ఎన్నో సినిమాలు చేశారు. ఆయన రెండు టర్మ్ ల క్రితం `మా`కి అధ్యక్షుడిగా చేశాడు. ఆ సమయంలో `మా` బిల్డింగ్ కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్లు చేస్తున్నారు.
అమెరికాలో చిరంజీవితో ఓ ఈవెంట్ చేశారు. అది సక్సెస్ అయ్యింది. ఆ తర్వాత మహేష్ బాబు, నాగార్జున, మోహన్‌బాబు, జయసుధ వంటి వారితోనూ ఈవెంట్లకి ప్లాన్ చేశారు. మహేష్ బాబు కూడా ఓకే చెప్పాడట. కానీ నరేష్ చెడగొట్టినట్టు తెలిపారు శివాజీ రాజా. అది పెద్ద రచ్చ అయ్యిందట.
మరోవైపు ప్రభాస్‌తో ఓ ఈవెంట్‌ని ప్లాన్ చేశారు. ఆయన్ని ఆహ్వానించడానికి ఇంటికి వెళ్లారట. ఇలా ఈవెంట్ గురించి చెప్పగా, `నేను వస్తే ఎంత వస్తుంది` అని ప్రభాస్ అడిగారు. దానికి శివాజీ రాజా ఓ రెండు కోట్ల వరకు వస్తుందని చెప్పగా, ఆ రెండు కోట్లు నేను ఇచ్చేస్తాను అని ప్రభాస్ చెప్పారు. మీరు ఎందుకు అనవసరంగా ఇంత స్టెయిన్ ఫీలవుతారు. నేను ఇచ్చేస్తాను లేండి అన్నారట ప్రభాస్. ఆ దెబ్బకి శివాజీ రాజా వారి టీమ్ కి ఫ్యూజులు ఎగిరిపోయాయట.
ప్రభాస్ ది పెద్ద చేయి అనడానికి ఇదే నిదర్శనం. ఆయన సినిమా షూటింగ్‌లోనూ అందరికి భోజనాలు ఏర్పాటు చేయడం అలవాటు. తనతోటి నటీనటులకు ప్రత్యేకంగా ఇంటి నుంచి వంటకాలు ప్రిపేర్ చేయించి సెట్‌లో అందరితో కలిసి తింటారు. తన భోజనాల రుచి చూపిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు ప్రభాస్ భోజనాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. అది ఆయన ప్రత్యేకత.
ఇక టాలీవుడ్‌లో బిగ్ స్టార్‌గా రాణిస్తున్నారు ప్రభాస్. ప్రస్తుతానికి ఆయన్ని మించిన స్టార్ లేదు. `బాహుబలి`తో ఇండియన్ సినిమా రికార్డులు తిరగరాశారు. `సలార్`తో సింగిల్ హ్యాండ్‌తో తన సత్తాని చూపించాడు. ఇప్పుడు `కల్కి2898ఏడీ`తో సంచలనాలకు తెరలేపబోతున్నారు. ఈ మూవీ త్వరలోనే విడుదల కాబోతుంది. దీంతోపాటు `రాజా సాబ్` చిత్రం చేస్తున్నారు. త్వరలో `స్పిరిట్` మూవీని ప్రారంభించబోతున్నారు డార్లింగ్.