- Home
- Entertainment
- PAN India Stars: ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు... పాన్ ఇండియా స్టార్స్ గా బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు
PAN India Stars: ఇండియన్ బాక్సాఫీస్ బద్దలు... పాన్ ఇండియా స్టార్స్ గా బాలీవుడ్ లో పాగా వేసిన సౌత్ హీరోలు
సౌత్ ఇండియా స్టార్స్ కి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశాడు రాజమౌళి. స్టార్ డమ్ అంటే పాన్ ఇండియా ఇమేజ్ తెచ్చుకోవడమే అన్నట్లు పరిస్థితి తయారైంది. సౌత్ చిత్రాలకు నార్త్ లో భారీ ఆదరణ దక్కుతుండగా సౌత్ హీరోలు బాలీవుడ్ లో పాగా వేయడానికి ఉవ్విళ్లూరుతున్నారు. అయితే ఇప్పటికే కొందరు స్టార్స్ అడుగు అక్కడ పడింది.

Rajinikanth
పాన్ ఇండియా స్టార్ హోదా తెచ్చుకుంటే మార్కెట్ పది రెట్లు పెరుగుతుంది. అదే స్థాయిలో రెమ్యూనరేషన్ కూడా పెరుగుతుంది. దానికి ప్రభాస్ నిదర్శనం. ప్రభాస్ తో మూవీ అంటే రూ. 500 కోట్ల బడ్జెట్ కావాలి. ఇక ప్రభాస్ రూ. 100 నుండి 150 కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నాడు. గత మూడు దశాబ్దాలుగా బాలీవుడ్ లో సక్సెస్ కావాలని సౌత్ హీరోలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్క రజినీకాంత్ మాత్రమే సక్సెస్ అయ్యారు. చిరంజీవి, నాగార్జున లాంటి హీరోలు ప్రయత్నించినా పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేదు. కాగా ప్రస్తుతం ఆరుగురు సూపర్ స్టార్స్ బాలీవుడ్ లో తమ మార్క్ క్రియేట్ చేశారు. రజనీకాంత్ (Rajinikanth)కి ఎప్పటి నుండో బాలీవుడ్ లో మార్కెట్ ఉంది. ఆయన అమితాబ్ తో పాటు కొందరు స్టార్ హీరోలతో హిందీ మల్టీస్టారర్స్ చేశారు. సోలో హీరోగా కూడా భారీ విజయాలు ఆయన దక్కించుకున్నారు. రోబో, 2.0 చిత్రాలు వసూళ్ల వర్షం కురిపించాయి.
Prabhas
రజినీకాంత్ తర్వాత బాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్న హీరో ప్రభాస్(Prabhas). బాహుబలి సిరీస్ తో ఆయన ఇండియన్ బాక్సాఫీస్ రికార్డ్స్ తిరగరాశారు. బాహుబలి, బాహుబలి 2తో పాటు సాహో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించాయి. ఆయన రీసెంట్ మూవీ రాధే శ్యామ్ మాత్రమే అక్కడ విఫలం చెందింది. ప్రభాస్ బాహుబలి రికార్డ్స్ చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇక ప్రభాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ మొత్తం భారీ పాన్ ఇండియా చిత్రాలే.
Yash
2018లో విడుదలై కె జి ఎఫ్ మూవీ ఓ సంచలనం. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ పాన్ ఇండియా మూవీ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ ని షేక్ చేసింది. దర్శకుడు ప్రశాంత్ నీల్ మేకింగ్ కి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కెజిఎఫ్ (KGF)మూవీతో కన్నడ హీరో యష్ పాన్ ఇండియా హీరోగా అవతరించారు. అన్ని భాషల్లో ఆయనకు అభిమానులు ఏర్పడ్డారు. కె జి ఎఫ్ పార్ట్ 2 ఏప్రిల్ 14న విడుదల కానుంది.
Allu Arjun
పుష్ప (Pushpa)మూవీతో అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోల లిస్ట్ లో చేరారు. దర్శకుడు సుకుమార్ తెరకెక్కించిన పుష్ప హిందీలో అనూహ్య విజయం సాధించింది. స్లోగా మొదలైన పుష్ప చిత్రం వర్డ్ ఆఫ్ మౌత్ సహాయంతో చిన్నగా పుంజుకొని రూ. 100 కోట్లు వసూళ్లు రాబట్టింది. టాలీవుడ్ నుండి ప్రభాస్ తర్వాత అల్లు అర్జున్(Allu Arjun) హిందీ బెల్టులో సత్తా చాటారు.
Ntr
పాన్ ఇండియా స్టార్స్ లిస్ట్ లో కొత్తగా చేరిన స్టార్ ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్. బాహుబలి రికార్డ్స్ కూడా బ్రేక్ చేసుకుంటూ పోతున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ తో ఎన్టీఆర్, రామ్ చరణ్(Ram Charan) నార్త్ లో ఇమేజ్ రాబట్టారు.
Ram charan
ఆర్ ఆర్ ఆర్ (RRR Movie)హిందీ వర్షన్ ప్రారంభం గొప్పగా లేకుండా మెల్లగా పుంజుకుంటుంది. వంద కోట్ల వసూళ్ల దిశగా అడుగులు వేస్తుంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటన గురించి అక్కడ మీడియా, క్రిటిక్స్ ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి ఈ ఆరుగురు సౌత్ హీరో పాన్ ఇండియా స్టార్స్ గుర్తింపు తెచ్చుకున్నారు.