MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Radhe Shyam Pre release: రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు.. ఫోటోస్ చూడాల్సిందే

Radhe Shyam Pre release: రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్, పూజా హెగ్డే, కృష్ణంరాజు.. ఫోటోస్ చూడాల్సిందే

హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 23 2021, 11:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
112

అభిమానులంతా ముద్దుగా డార్లింగ్ అని పిలుచుకునే యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. బాహుబలి చిత్రంతో ప్రభాస్ దేశవ్యాప్తంగా క్రేజ్ సొంతం చేసుకున్నాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో నిరాశపరిచింది.

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
212

దీనితో తన అభిమానులని ఫుల్ ఖుషి చేసేందుకు ప్రభాస్ ఈ సంక్రాంతికి రాధే శ్యామ్ చిత్రంతో రాబోతున్నాడు. దేశవ్యాప్తంగా ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో రాధే శ్యామ్ ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి.   

312

హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో గ్రాండ్ గా రాధే శ్యామ్ ప్రీరిలీజ్ వేడుక నిర్వహించారు. ప్రీరిలీజ్ ఈవెంట్ లోనే ఈ చిత్ర ట్రైలర్ కూడా లాంచ్ చేశారు. యువీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్ లో తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. రాధాకృష్ణ దర్శకుడు. 

412

ప్రభాస్, పూజ హెగ్డే తొలిసారి కలసి నటిస్తున్న చిత్రం ఇది.  రాధే శ్యామ్ ట్రైలర్ రొమాంటిక్ గా మొదలై ఎమోషనల్ గా ముగుస్తుంది. విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ కథ ఎలా ముగిసింది.. ఎలాంటి పరిణామాలకు దారితీసింది అనేది ఈ చిత్ర కథగా అర్థం అవుతోంది.

512

విక్రమాదిత్య, ప్రేరణ ప్రేమ వల్ల విపరీత పరిణామాలు చోటుచేసుకోబోతున్నాయని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. మొత్తంగా రాధే శ్యామ్ ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచేసింది.   

612

ప్రీరిలీజ్ ఈవెంట్ లో యువ హీరో నవీన్ పోలిశెట్టి యాంకరింగ్ తో అదరగొట్టాడు. అల్లరి చేస్తూ.. ప్రభాస్, పూజా హెగ్డే లతో ఫన్నీగా మాట్లాడుతూ నవీన్ చేసిన సందడి ఆకట్టుకుంది. ఇక మరో యాంకర్ గా రష్మీ వ్యవహరించింది. 

712

 ప్రీరిలీజ్ ఈవెంట్ లో ప్రభాస్ మాట్లాడుతూ పెదనాన్న లుక్ చూశారుగా చిన్నసైజు దేవుడిలా ఉన్నారు. ఈ చిత్రం కోసం కోవిడ్ టైంలో చాలా కష్టపడ్డాం. చాలా సార్లు షూటింగ్ ఆపి మళ్ళీ మొదలు పెట్టాల్సి వచ్చింది.   

812

ఇక పూజా హెగ్డే మాట్లాడుతూ ఈ చిత్రంలో కొత్త ప్రభాస్, కొత్త పూజా హెగ్డేలని చూస్తారు అని చెప్పింది. పూజా హెగ్డే బ్లూ శారీలో అందంగా కనిపిస్తూ ప్రీ రిలీజ్ వేడుకలో గ్లామర్ మెరుపులు మెరిపించింది. కృష్ణం రాజు వేదికపై కాసేపు పూజా హెగ్డేతో సరదాగా ముచ్చటించారు. ఆమెతో డాన్స్ కి కృష్ణం రాజు సై అన్నారు. 

912

ప్రీరిలీజ్ వేడుకలో ప్రభాస్, కృష్ణం రాజు ఇద్దరూ అభిమానుల చేత ట్రయిలర్ లాంచ్ చేయించారు. ఈ చిత్రంలో ప్రభాస్ హస్త సాముద్రిక నిపుణుడిగా కనిపించబోతున్నాడు. 

1012

ప్రీ రిలీజ్ వేడుకకు 'ఆదిపురుష్' డైరెక్టర్ ఓం రౌత్ అతిథిగా హాజరయ్యారు. అలాగే సందీప్ రెడ్డి వంగా, నాగ్ అశ్విన్, దిల్ రాజు లాంటి వారంతా హాజరయ్యారు. 

 

1112

రాధే శ్యామ్ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. యువి క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

 

1212

మొత్తంగా రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ వేడుక ప్రభాస్ అభిమానుల కోలాహలం మధ్య వైభవంగా జరిగింది. ఇక జనవరి 14న థియేటర్స్ లో సందడి చేయడమే మిగిలి ఉంది. Also Read: Radhe Shyam Trailer: ది గ్రేట్ విక్రమాదిత్య.. పామిస్ట్రీ లో ఐన్ స్టీన్ అతడు, ప్రళయం సృష్టించే ప్రేమ కథ

Also Read: Radhe Shyam Pre Release event: నవీన్ పోలిశెట్టి అదిరిపోయే ఎంట్రీ.. రచ్చ రచ్చ చేసిన జాతిరత్నం

About the Author

SG
Sreeharsha Gopagani
కృష్ణంరాజు
ప్రభాస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Mahesh Babu: మహేష్ బాబుతో సినిమా.. ఎగిరి గంతేసిన హీరోయిన్ ఎవరో తెలుసా? సూపర్ స్టార్ లక్కీ బ్యూటీ
Recommended image2
Srinidhi Shetty: తన వయసు కంటే పెద్ద పాత్రలో కేజీఎఫ్ హీరోయిన్.. ఆదర్శ కుటుంబం లో శ్రీనిధి శెట్టి పాత్ర ఏంటో తెలుసా?
Recommended image3
Naga Chaitanya: నాగచైతన్య సీక్రెట్ డైట్ ప్లాన్.. రోజూ బ్రేక్ ఫాస్ట్, లంచ్ లో ఏం తింటాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved