Prabhas Project k : ప్రభాస్ తో వన్స్ మోర్ అనిపించిన నాగ్ అశ్విన్..?
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ఇప్పుడు తిరుగు లేని ఇమేజ్ తో దూసుకుపోతున్నాడు. పాన్ వరల్డ్ స్థాయిలో పేరు తెచ్చుకున్న ప్రభాస్.. ఇండియన్ స్టార్ హీరోల లిస్ట్ లో ముందు వరసలో ఉన్నాడు.
ప్రభాస్(Prabhas) తో సినిమా అంటే ఇప్పుడు వందల కోట్ల బడ్జెట్ ఉండాలి.. ఆయన రేంజ్ కు తగ్గట్టు కథ ఉండాలి. ప్రభాస్ సినిమా వేల కోట్ల బిజినెస్ అవుతుంది కాబట్టి.. ఆయనపై ధైర్యంగా ఇన్ వెస్ట్ చస్తుంటారు స్టార్ ప్రొడ్యూసర్లు. ఇక ఇప్పటికే వరుసగా ఐదు సినిమా పైనే లైన్ లో పెట్టాడు ప్రభాస్(Prabhas). మరికొన్ని కథలను పెండింగ్ లో ఉంచాడు.
ప్రస్తుతం ప్రభాస్(Prabhas) రాధేశ్యామ్ మూవీ రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమాతో పాటు సలర్.. ఆదిపురుష్ లాంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాలు కూడా సెట్స్ ఎక్కించాడు యూనివర్సల్ స్టార్. ఈ ఏడాది లోనే ఈ రెండు సినిమాలు కూడా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. రిలీజ్ టార్గెట్ గా ఈరెండు సినిమాలు షూటింగ్ కొనసాగుతుంది. కెజియఫ్(Kgf) ఫేమ్ ప్రశాంత్ నీల్ సలార్(Salar) తెరకెక్కిస్తుంటే.. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ ఆదిపురుష్ ను రూపొందిస్తున్నారు.
ఈసినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy)తో రీసెంట్ గా స్పిరిట్ మూవీని ప్రకటించాడు ప్రభాస్(Prabhas). అటు మారుతీతో కూడా ఓ సినిమా లైన్ లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇలా వరుస సినిమాలు చేసుకుంటూ పోతున్న యంగ్ రెబల్ స్టార్ లిస్ట్ లో నాగ్ అశ్విన్ (Nag Ashwine) ప్రాజెక్ట్ కే మూవీ స్పెషల్ అని చెప్పాలి.
నిజానికి ఈ సినిమాలన్నింటకంటే ముందు నాగ్ అశ్విన్ తో పాన్ వరల్డ్ మూవీని ప్రకటించాడు ప్రభాస్(Prabhas). కాని ఈసినిమా షూటింగ్ బాగా లేట్ అయ్యింది. లాస్ట్ ఇయర్ ఎలాగు స్టార్ట్ చేసి.. కొంచెం షూటింగ్ అయిపోయిందనిపించుకున్నారు. దీపికాపదుకోనే, అమితాబ్ లాంటి స్టార్స్ తో.. డిఫరెంట్ గా సినిమాను ప్లాన్ చేస్తున్నాడు నాగ్ అశ్వీన్. ఇక ప్రభాస్(Prabhas) తో నాగ్ అశ్వీన్ మరో సినిమా ఉంటుంది అన్న ప్రచారం జోరుగా సాగుతుంది.
ప్రాజెక్ట్ కే తరువాత నాగ్ అశ్విన్ మరో సినిమా కూడా ప్రభాస్(Prabhas) తోనే ఉండనుందని ఇండస్ట్రీలో టాక్ గట్టిగా నడుస్తోంది. అంతే కాదు ఇది బాలీవుడ్ మూవీగా తెరకెక్కబోతున్నట్టు సమాచారం. ఈసినిమాను బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జొహార్ నిర్మిస్తారని తెలుస్తోంది.
ప్రభాస్(Prabhas) క్రేజ్ ను .. ఆయన మార్కెట్ ను అంచనా వేసిన కరణ్ జొహార్ .. ప్రభాస్ తో భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. అంతే కాదు ఈ ప్రాజెక్టును ఆయన నాగ అశ్విన్ కి అప్పగించడం జరిగిపోయిందని అంటున్నారు. అంతే కాదు ప్రాజెక్టు K కి సంబంధించిన హిందీ వెర్షన్ బాధ్యతలను తాను చూసుకుంటానని కరణ్ జొహార్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
బాహుబలి టైమ్ నుంచి టాలీవుడ్ మీద ఫోకస్ పెట్టాడు కరణ్ జోహార్. మన స్టార్స్ తో మంచి సంబంధాల కొనసాగిస్తూ.. ఇక్కడి స్టార్స్ ఇమేజ్ ను గట్టిగా క్యాల్యూక్లేట్ చేస్తున్నాడు. అందులో బాగంగానే విజయ్ దేవరకొండ , పూరీ కాంబో లైగర్ ను లోకల్ నుంచి పాన్ ఇండియాకు మార్చేశాడు కరణ్ జోహార్ .. ప్రభాస్(Prabhas) తో ప్రభంజనం సృస్టించడానికి రెడీ అవుతున్నాడు.