5 సినిమాలు 2700 కోట్లు, ప్రభాస్ 5 ఏళ్లలో సాధించిన సంచలనాలు
ప్రభాస్ మోస్ట్ అవైటెడ్ సినిమా 'ది రాజా సాబ్' ట్రైలర్ రిలీజైంది. ఈ ట్రైలర్ ఫ్యాన్స్ ఉర్రూతలూగిస్తోంది. సోషల్ మీడియాలో ట్రైలర్ దుమ్మురేపుతోంది. ఇక ఈ ఐదేళ్లలోప్రభాస్ సాధించిన అద్భుతాలు ఏంటో తెలుసా?

రాజా సాబ్ కోసం ఎదురుచూపులు
చాలా కాలంగా ఫ్యాన్స్ ప్రభాస్ సినిమా 'ది రాజా సాబ్' కోసం ఎదురుచూస్తున్నారు. సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యాక క్రేజ్ మరింత పెరిగింది. ఈ సందర్భంగా 2019-2024 మధ్య రిలీజైన ఆయన గత 5 సినిమాల పెర్ఫార్మెన్స్, కలెక్షన్ల గురించి చూద్దాం .
సాహో తో మొదలైంది
బాహుబలి తరువాత భారీ అంచనాలమధ్య రిలీజ్ అయిన ప్రభాస్ సినిమా సాహో. 2019లో వచ్చిన ఈ ప్రభాస్ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేశాడు. శ్రద్ధా కపూర్, చంకీ పాండే, జాకీ ష్రాఫ్, అరుణ్ విజయ్, నీల్ నితిన్ ముఖేష్ ఉన్న ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు. ఇది 439 కోట్ల బిజినెస్ చేసింది. భారీ విజయం కాకపోయినా.. పర్వాలేదు అనిపించింది.
రొమాంటిక్ ఫాంటసీ డ్రామా
ప్రభాస్ తన ఇమేజ్ కు పూర్తి భిన్నంగా నటించిన సినిమా 'రాధే శ్యామ్'. 2022లో వచ్చిన ఈ పీరియడ్ రొమాంటిక్ ఫాంటసీ డ్రామా సినిమాకి రాధా కృష్ణ కుమార్ డైరెక్టర్. పూజా హెగ్డే, భాగ్యశ్రీ, సత్యరాజ్, కృష్ణంరాజు, కునాల్ రాయ్ కపూర్, జయరాం, జగపతి బాబు ఉన్న ఈ సినిమా బడ్జెట్ 350 కోట్లు. ఇది 214 కోట్ల వ్యాపారం చేసింది. ఈసినిమా డిజాస్టర్ అయి చెప్పవచ్చు.
ఆదిపురుష్ కూడా..
2023లో వచ్చిన ప్రభాస్ సినిమా 'ఆదిపురుష్'కి ఓం రౌత్ డైరెక్టర్. సైఫ్ అలీ ఖాన్, కృతి సనన్, సన్నీ సింగ్, దేవదత్త నాగే ఉన్న ఈ సినిమా బడ్జెట్ 700 కోట్లు. ఇది 392.70 కోట్ల కలెక్షన్ సాధించింది. క్వాలిటీ విషయంలో విమర్శలు ఫేస్ చేసిన ఆదిపురుష్ సినిమా లాభాలు తీసుకురాలేకపోయింది. డిజాస్టర్ గా నిలిచింది.
సలార్ సక్సెస్
వరుసగా ప్లాప్ సినిమాలతో సావాసం చేస్తోన్న ప్రభాస్ కు 'సలార్' సినిమాతో ఊరట లభించింది. 2023లో రిలీజ్ అయిన ఈసినిమాను ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్, శ్రుతి హాసన్, జగపతి బాబు, బాబీ సింహా, శ్రియా రెడ్డి, రామచంద్ర రాజు, టీనూ ఆనంద్ ప్రధాన పాత్రల్లో ఉన్నారు. 270 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 620 కోట్ల బిజినెస్ చేసింది.
దుమ్మురేపిన కల్కీ
ప్రభాస్ కు బాహుబలి తరువాత ఆరేంజ్ సినిమా అంటే కల్కీ అనే చెప్పాలి. చాలా కాలం తరువాత యంగ్ రెబల్ స్టార్ 1000 కోట్ల కలెక్షన్స్ దాటి కాలర్ ఎగరేశాడు. 2024లో వచ్చిన 'కల్కి 2898 ఏడీ'కి నాగ్ అశ్విన్ డైరెక్టర్. ఇందులో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్, దీపికా పదుకొణె, దిశా పటానీ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా బడ్జెట్ 600 కోట్లు కాగా.. ఇది 1100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.