Kalki 2898 AD: మరోసారి ప్రభాస్ దండయాత్ర.. ఒక్క చోటే 75 కోట్ల డీల్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సలార్ చిత్రం అలవోకగా 700 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో కాకున్నా ప్రభాస్ రేంజ్ ఏంటో తెలియజేసిన చిత్రం సలార్.
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సలార్ చిత్రంతో తిరిగి ఫామ్ లోకి వచ్చాడు. సలార్ చిత్రం అలవోకగా 700 కోట్ల వరకు వసూళ్లు రాబట్టింది. బాహుబలి తర్వాత ఆ స్థాయిలో కాకున్నా ప్రభాస్ రేంజ్ ఏంటో తెలియజేసిన చిత్రం సలార్. ఈ సమ్మర్ లో ప్రభాస్ నుంచి మరో సునామీ వేవ్ రాబోతోంది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న కల్కి 2898 ఎడి చిత్రం మే 9న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభాస్ గ్లోబల్ స్థాయి ఖ్యాతిని టార్గెట్ చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నాగ్ అశ్విన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
కమల్ హాసన్, దీపికా పదుకొనె, అమితాబ్ బచ్చన్, దిశా పటాని లాంటి అగ్ర నటులంతా ఈ చిత్రంలో నటిస్తున్నారు. క్రమంగా ప్రభాస్ ఫ్యాన్స్ ఫోకస్ కల్కి పై పడుతోంది. అదే విధంగా మేకర్స్ కూడా లోలోపల కల్కి ప్రీ రిలీజ్ బిజినెస్ పూర్తి చేసే పనిలో ఉన్నారు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ లో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది.
ఇంత భారీ చిత్రం.. పైగా ప్రభాస్ హీరో ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఆకాశాన్ని తాకడం ఖాయం. కానీ అంచనాలని మించేలా ఇండస్ట్రీ వర్గాలు కుదుపునకు గురయ్యేలా మైండ్ బ్లోయింగ్ బిజినెస్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
తాజా సమాచారం మేరకు ఈ చిత్రం కల్కి మేకర్స్ ప్రీ రిలీజ్ బిజినెస్ మొదలు పెట్టారట. ఒక్క నైజాం ఏరియాలో మాత్రమే మేకర్స్ 75 కోట్ల డీల్ ఫినిష్ చేసినట్లు తెలుస్తోంది. నైజాం ఏరియాలో 75 కోట్లకు కల్కి చిత్రాన్ని ఎవరు కొన్నారు అనే వివరాలు బయటకి రాలేదు. కానీ ఈ నంబర్ చూసి ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురవుతోంది.
అంతటితో అయిపోలేదు. తెలుగురాష్ట్రాల్లో మొత్తం 200 కోట్లు డిమాండ్ చేస్తున్నారట. దీనిని బట్టి కల్కి చిత్రంపై వైజయంతి సంస్థ ఎంత నమ్మకంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి కూడా దాదాపు ఇదే స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏది ఏమైనా బిజినెస్ రికవరీ భారం మొత్తం ప్రభాస్ పైనే ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.