- Home
- Entertainment
- ప్రభాస్ 'కల్కి 2898 AD' ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, ఈ రేంజ్ లో ఉంటే థియేటర్లు అల్లకల్లోలమే..
ప్రభాస్ 'కల్కి 2898 AD' ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, ఈ రేంజ్ లో ఉంటే థియేటర్లు అల్లకల్లోలమే..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం చిత్రం ఇక మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రివ్యూ ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేసే విధంగా సూపర్ పాజిటివ్ గా ఉంది.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి చిత్రం చిత్రం ఇక మరికొన్ని రోజుల్లోనే థియేటర్స్ లో సందడి చేయబోతోంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన పాన్ ఇండియా చిత్రాలు అంతగా వర్కౌట్ కాలేదు. సలార్ పర్వాలేదనిపించింది. ఇప్పుడు కల్కి 2898 AD పై కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి.
ఇండియన్ సినిమా చరిత్రలోనే కల్కి ఒక ప్రత్యేక చిత్రం అని చెప్పొచ్చు. సరిగ్గా హాలీవుడ్ స్టాండర్డ్స్ ని మ్యాచ్ చేస్తూ భారీ బడ్జెట్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఆయన కుమార్తెలు ఈ చిత్రాన్ని నిర్మించారు. డైరెక్టర్ నాగ్ అశ్విన్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భారత పురాణాలకి సంబంధించిన అంశాలకి సైన్స్ ఫిక్షన్ జోడిస్తూ ఈ కథ సిద్ధం చేశారు.
నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. మహాభారత యుద్ధంతో గత యుగం ముగిసింది. కొత్త చరిత్ర మొదలయింది. మహాభారతానికి కల్కి చిత్రం సీక్వెల్ లాగా ఉంటుంది. కలియుగంలో ఆ తరహా యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో నుంచి ఈ కథ పుట్టినట్లు నాగ్ అశ్విన్ వివరించారు. హిందూ పురాణాల్లోని అంశాలతో హాలీవుడ్ వాళ్ళు స్టార్ వార్స్, మార్వెల్ చిత్రాలు, స్పైడర్ మ్యాన్ లాంటి చిత్రాలు చేస్తున్నారు.
మనం ఎందుకు చేయకూడదు అనే ఆలోచనలో ఈ చిత్రాన్ని ప్రారంభించినట్లు నాగ్ అశ్విన్ తెలిపారు. రిలీజ్ కి మరికొన్ని రోజుల సమయమే ఉండడంతో కల్కి చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ నుంచి కల్కి ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. రివ్యూ ప్రభాస్ అభిమానులు ఎగిరి గంతేసే విధంగా సూపర్ పాజిటివ్ గా ఉంది.
ముందుగా సెన్సార్ డీటెయిల్స్ చూస్తే.. ఈ చిత్రానికి యు/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. దాదాపు మూడుగంటల నిడివి ఫిక్స్ చేశారు. సరిగ్గా చెప్పాలంటే 2.58 గంటల నిడివితో కల్కి చిత్రం ఉండబోతోంది. ఇక సెన్సార్ రివ్యూ విషయానికి వస్తే విజువల్ నెవర్ బిఫోర్ అనిపించే విధంగా ఉన్నాయట. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆ భారీ విజువల్స్ సంభ్రమాశ్చర్యాలకు గురుచేస్తాయని అంటున్నారు. కల్కి సెన్సార్ కార్యక్రమాలు ముంబైలో ముగిసినట్లు తెలుస్తోంది. సెన్సార్ సభ్యులు సినిమా చూడాగానే స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారట. అంత అద్భుతంగా సినిమా ఆకట్టుకున్నట్లు తెలుస్తోంది.
కథలో ఎమోషన్స్ పర్ఫెక్ట్ గా కుదిరినట్లు చెబుతున్నారు. అదే విధంగా ఎంటర్టైన్మెంట్ ఎంత ఉండాలో అంత ఉంటూ ఆకట్టుకుంటోందట. ఓవరాల్ గా సెన్సార్ సభ్యుల నుంచి కల్కి చిత్రానికి సూపర్ పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సినిమా ఈ రేంజ్ లో ఉంటే థియేటర్స్ లో అల్లకల్లోలం గ్యారెంటీ అని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.