సినిమాలు మానేసి సాఫ్ట్ వేర్ జాబ్ చేసుకుంటున్న ప్రభాస్ హీరోయిన్ ఎవరో తెలుసా?
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొంత మంది హీరోయిన్లు సడెన్ గా మాయమైపోతున్నారు. ఒకదశలో ఎంతో క్రేజ్ సొంతం చేసుకున్నా తారలు, ఆ తర్వాత అనూహ్యంగా ప్రేక్షకుల కళ్లకు కనిపించకుండా పోతున్నారు. అలాంటి వారిలో ఓ హీరోయిన్ సినిమాలు మానేసి ఐటీ జాబ్ చేసుకుంటోంది.

టాలీవుడ్ లో చాలా తక్కువ సమయంలోనే టాప్ హీరోలతో వరుసగా సినిమాలు చేసింది ఓ హీరోయిన్. అల్లు అర్జున్, ప్రభాస్, రవితేజ లాంటి హీరోలకు జంటగా నటించి మెప్పించింది. పెద్ద పెద్ద హీరోలతో నటించినా కాని హీరోయిన్ గా నెంబర్ వన్ ప్లేస్ కు వెళ్లలేకపోయింది. ఒక దశలో సినిమా అవకాశాలు రాక ఇండస్ట్రీని వదిలి సైలెంట్ గా వెళ్లిపోయింది బ్యూటీ. ఇంతకీ ఎవరా హీరోయన్ ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా? ఆ హీరోయిన్ ఎవరో కాదు దీక్షా సేత్.
దీక్షా సేత్ 2010లో విడుదలైన 'వేదం' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రిచ్ గర్ల్ ఫ్రెండ్ పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన ఆమె, ఆ తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జోడిగా 'రెబల్' సినిమాలో నటించారు. గోపిచంద్ తో 'వాంటెడ్', రవితేజతో 'నిప్పు', 'మిరపకాయ్' వంటి చిత్రాల్లో నటించి వరుసగా అవకాశాలు అందుకుంది. ఆమె టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలుతుంది అనుకున్నారంతా. కాని కొద్దికాలానికే సీన్ రివర్స్ అయ్యింది.
తెలుగులో మంచి స్థానం సంపాదించినప్పటికీ, ఈమె కెరీర్‌కు అనూహ్యంగా బ్రేక్ పడింది. 2012లో 'ఊ కొడతారా.. ఉలిక్కిపడతారా' అనే సినిమాలో చివరిసారిగా కనిపించిన దీక్షాసేత్... ఆ తర్వాత తెలుగులో అవకాశాలు తగ్గిపోవడంతో బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. కానీ అక్కడ కూడా ఆశించిన స్థాయిలో ప్రాజెక్టులు లభించకపోవడంతో సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది యంగ్ హీరోయిన్. సాధారణంగా సినిమాలు మానేసిన హీరోయిన్లు వెంటనే పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ను హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. కాని ఈ హీరోయిన్ మాత్రం డిఫరెంట్ గా ఆలోచించింది.
ఫిల్మ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన దీక్షాసేత్ ప్రస్తుతం లండన్‌కి మకాం మార్చేసింది. అక్కడే ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. సినిమాల్లోని గ్లామర్ ప్రపంచాన్ని వదిలి, ఇలా ఒక ఉద్యోగస్తురాలిగా మారడం, సెలబ్రిటీ లైఫ్ ను వదిలేసుకుని సాధారణ జీవితం ఎంచుకోవడమంటే సాధారణ విషయం కాదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈమె యాక్టివ్ గానే ఉంటారు. అప్పుడప్పుడు తన ఫోటోలు పోస్ట్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటారు.
తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించిన దీక్షా సేత్ ఇప్పుడు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమై, లండన్‌లో ఐటీ ఉద్యోగంతో సెటిల్ అయ్యారు. అక్కడే సొంత ఇల్లు కూడా కొనుగోలు చేశారు. కెరీర్ పరంగా ఎదుగుదల అందుకున్నప్పటికీ, సినిమాల వైపు మళ్లీ రాలేకపోవడం ఆమె అభిమానులను నిరాశపరిచింది. ఈమె ప్రయాణం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది. ఒక్కోసారి మంచి ఫాంలో ఉన్నప్పటికీ, మారుతున్న పరిస్థితులను బట్టి కెరీర్ ను మార్చుకోవాలని దీక్షాను చూసి అంటున్నారు నెటిజన్లు.