ప్రభాస్ పై నమ్మకం సరే, కానీ పెండింగ్ చూస్తే చాలా ఉందే
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కులను తీసుకొని తీవ్రంగా నష్టపోయారు.
The Raja Saab Prabhas film update out
ప్రభాస్ నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్ పై ఇప్పటిదాకా ఓ రేంజి అంచనాలు అయితే లేవు. వచ్చే ఏడాది సమ్మర్ హాలిడేస్ కు ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు తీసుకురావటానికి ప్లాన్ చేసారు. మారుతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గురించి ప్రొడ్యూసర్ టీజీ విశ్వప్రసాద్ ఎక్కడికెళ్లినా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తున్నాడు. తాజాగా స్వాగ్ మూవీ ప్రమోషన్లలో భాగంగా మీడియాతో మాట్లాడిన అతడు.. తమ నష్టాలను పూడ్చే సినిమా రాజా సాబే అని చెప్పి సినిమాని ఓ రేంజిలో లేపారు. అయితే రాజాసాబ్ అసలు పరిస్దితి ఏంటి..ఎంతదాకా వచ్చింది.
The Raja Saab Prabhas film update out
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ తమ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ద్వారా ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ తెలుగు హక్కులను తీసుకొని తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు అదే ప్రభాస్ తమని ఒడ్డున పడేస్తారు అంటున్నారు. విశ్వప్రసాద్ మాట్లాడుతూ..."ఈ మధ్య వచ్చింది ఊహించనిదే. అంతకుముందు మనమే బాలేదన్నారు. దానికి ముందు మరో సినిమా కూడా ఫ్లాపయింది. కానీ రాజా సాబ్ ఏప్రిల్లో వస్తోంది. మాకు ఇప్పటి వరకూ వచ్చిన నష్టాలను అది కవర్ చేస్తుంది" అని ఆయన అన్నారు.
ఇక రాజాసాబ్ చిత్రం షూటింగ్ వివరాల్లోకి వెళితే..ఈ సినిమా పెండింగ్ వర్క్ దాదాపు ఫిఫ్టి పర్శంట్ దాకా ఉందని సమాచారం. ఫౌజీ వంటి చిత్రాల మధ్యలో గ్యాప్ ఉన్నప్పుడు ప్రభాస్ వచ్చి ఈ సినిమా పూర్తి చేస్తారని సమాచారం. ఈ విషయం ప్రభాస్ ముందే నిర్మాతలకు చెప్పే ఎగ్రిమెంట్ చేసారట. ఈ హర్రర్ కామెడీ చిత్రాన్ని మిగతా సినిమాల మధ్య గ్యాప్ లోనే చేస్తానని అన్నారు. అదే చేస్తున్నారు. కాబట్టి ప్రభాస్ పై ప్రెజర్ పెట్టే పరిస్దితి లేదు.
అలాగే ఇప్పుడు ప్రభాస్ ఉన్న టైట్ షెడ్యుల్ ని బట్టి రెండు,మూడు నెలల తర్వాత మాత్రమే ది రాజా సాబ్ సినిమాకు డేట్స్ కేటాయిస్తారు. ప్రభాస్ వచ్చేసరికి మొత్తం సెట్స్ రెడీ చేసుకుని ,షూటింగ్ ఏ మాత్రం ఆలస్యం కాకుండా ఇచ్చిన డేట్స్ లో పూర్తి చేయాలని మారుతి ప్లాన్ చేసుకున్నారట. ఒక్కసారి సెట్స్ కు వస్తే పనులు అన్ని స్పీడుగా పూర్తి అవుతాయని భావిస్తున్నారట.
ప్రభాస్ తో చేయటం అనేది మారుతి చిరకాలం కల. కాబట్టి ఎంతకాలం అయినా వెయిట్ చేసి పెద్ద హిట్ ఇవ్వాలని భావిస్తున్నారట. అదే జరిగితే మారుతి నెక్ట్స్ లెవిల్ డైరక్టర్ అవుతారనంటలో సందేహం లేదు. పీపుల్స్ మీడియా కూడా అదే భావిస్తోంది.
prabhas
రవితేజతో ధమాకా తర్వాత ఈ బ్యానర్ లో సరైన హిట్ ఇప్పటివరకు పడలేదు. బ్రో, ఈగల్, మనమే, రామబాణం, మిస్టర్ బచ్చన్ ఇలా వచ్చిన ప్రతీ సినిమా వచ్చినట్లు బోల్తా కొడుతూనే ఉంది. దీంతో ఆ సంస్థకు నష్టాలు తప్పడం లేదు. రీసెంట్ గా ఎన్నో ఎక్సపెక్టేషన్స్ తో ఈ బ్యానర్ నుంచి వచ్చిన రవితేజ తాజా చిత్రం మిస్టర్ బచ్చన్ డిజాస్టర్ అవ్వటంతో అది బాగా రిజస్టర్ అయ్యింది. ఈ సినిమాతో భారీగా నష్టపోయింది పీపుల్ మీడియా. పీపుల్ మీడియా సక్సెస్ రేటు 40 శాతం కూడా లేదు.
దాంతో ఇప్పుడు ఎలాగైనా మంచి సక్సెస్ తెచ్చుకుని సక్సెస్ ఫుల్ బ్యానర్ అనిపించుకోవాల్సిన సిట్యువేషన్ క్రియేట్ అయ్యింది. అందుకు ప్రభాస్ ఇప్పుడు ఆశాకిరణంలా కనపడుతున్నారు.