MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • ప్రభాస్, హను రాఘవపూడి మూవీ స్టోరీ ఇదేనా.. ఆ రూమర్ నిజమైతే గూస్ బంప్స్ గ్యారెంటీ

ప్రభాస్, హను రాఘవపూడి మూవీ స్టోరీ ఇదేనా.. ఆ రూమర్ నిజమైతే గూస్ బంప్స్ గ్యారెంటీ

కల్కి 2898 ఎడి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 1000 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కల్కి ఇంతటి ఘన విజయం సాధించడంతో ప్రభాస్ తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి.

2 Min read
Author : Tirumala Dornala
| Updated : Jul 25 2024, 06:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
Prabhas

Prabhas

కల్కి 2898 ఎడి చిత్రం పాన్ ఇండియా స్థాయిలో బ్లాక్ బస్టర్ హిట్ సాధించి 1000 కోట్లకి పైగా వసూళ్లతో దూసుకుపోతోంది. కల్కి ఇంతటి ఘన విజయం సాధించడంతో ప్రభాస్ తదుపరి చిత్రాలపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్ లో తెరకెక్కే చిత్రం గురించి ఇప్పుడే బజ్ మొదలైపోయింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఎందుకంటే సీతారామం చిత్రంతో హను రాఘవపూడి మ్యాజిక్ చేసి చూపించారు. ఇక ప్రభాస్ లాంటి పాన్ ఇండియా హీరోని పెట్టుకుని ఇంకెత అద్భుతం చేస్తాడో అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది. 

36

ఈ చిత్రానికి హను రాఘవపూడి ఫౌజి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు అని.. అలాగే పాకిస్తానీ నటిని హీరోయిన్ గా ఎంపిక చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. కథ గురించి సంచలన రూమర్ వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రభాస్ హను రాఘవపూడి మూవీ కథ గురించి జోరుగా ఈ రూమర్ ప్రచారం లో ఉంది. 

46

ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు బ్రిటిష్ నేపథ్యంలో ఉంటుంది అని హను రాఘవపూడి ఆల్రెడీ సమాచారం ఇచ్చారు. యుద్ధం నేపథ్యంలో సన్నివేశాలు కూడా ఉంటాయట.ఈ చిత్రంలో ప్రభాస్ సైనికుడిగా కనిపించబోతున్నారు. ప్రభాస్ బ్రాహ్మణ యువకుడిగా సైనికుడిగా కనిపిస్తాడని రూమర్స్ వస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇండియన్ ఆర్మీ బ్రిటిష్ తరుపున పోరాటం చేసింది. 

56

కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాత్రం ప్రత్యేకంగా ఆజాద్ హింద్ ఫౌజ్ ని స్థాపించారు. బ్రిటిష్ కి వ్యతిరేకంగా కొత్త ఆర్మీని సిద్ధం చేశారు. ఆ ఆర్మీలో ప్రభాస్ సైనికుడిగా ఉంటాడట. ఈ చిత్రంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని చూపిస్తారని.. ఆయన్ని చూపించే సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించేలా ఉంటాయని టాక్. 

66

ప్రభాస్ సైనికుడిగా ఉంటూ ఒక యువతి ప్రేమలో పడడంతో పరిస్థితులు ఎమోషనల్ గా మారతాయట. దీని చుట్టూ అద్భుతమైన కథతో హను రాఘవపూడి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ కథ నిజమైతే గూస్ బంప్స్ తెప్పించే చిత్రం ప్రభాస్ నుంచి రాబోతున్నట్లే. అయితే ఇది సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం మాత్రమే. మరి హను రాఘవపూడి ప్లానింగ్ ఏంటో వేచి చూడాలి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ప్రభాస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Srikanth: స్టార్ హీరో ఆఫర్లన్నీ కొట్టేసిన శ్రీకాంత్.. మాస్ హీరో కామ్‌గా ఉండటానికి కారణమేంటో తెలుసా?
Recommended image2
ANR: పెళ్లై పిల్లలున్న హీరోయిన్‌తో ఏఎన్నార్ ఆన్ స్క్రీన్ రొమాన్స్... 275 రోజులు ఆడి రికార్డు సృష్టించిన సినిమా ఏదో తెలుసా?
Recommended image3
Ashika Ranganath: ఫ్లోరల్ ప్రింట్ చీరలో ఆషికా రంగనాథ్‌ మతిపోయే పోజులు.. హైలైట్‌ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved