- Home
- Entertainment
- నేటితో ప్రభాస్ 20 ఇయర్స్ ఇండస్ట్రీ.. కృష్ణంరాజు కామెంట్స్ వైరల్, అది జరిగే వరకు బతికుండి ఉంటే..
నేటితో ప్రభాస్ 20 ఇయర్స్ ఇండస్ట్రీ.. కృష్ణంరాజు కామెంట్స్ వైరల్, అది జరిగే వరకు బతికుండి ఉంటే..
ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ఎదగడానికి అవసరమైన ఫ్లాట్ ఫామ్ సెట్ చేసింది కృష్ణం రాజే. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయినట్లు అయింది.

రెబల్ స్టార్ కృష్ణంరాజు సెప్టెంబర్ 11న అనారోగ్యంతో మృతి చెందిన సంగతి తెలిసిందే. విషమ పరిస్థితిని దిగమింగుతూ ప్రభాస్ తన పెదనాన్నకి జరపాల్సిన కార్యక్రమాలన్నీ చూసుకుంటున్నారు. ఇండస్ట్రీలో ప్రభాస్ హీరోగా ఎదగడానికి అవసరమైన ఫ్లాట్ ఫామ్ సెట్ చేసింది కృష్ణం రాజే. కృష్ణంరాజు మృతితో ప్రభాస్ పెద్ద దిక్కు కోల్పోయినట్లు అయింది.
ప్రస్తుతం ప్రభాస్ తిరిగి తన సినిమాలపై ఫోకస్ పెట్టాడు. నేటితో ప్రభాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టి 20 ఏళ్ళు పూర్తవుతోంది. ప్రభాస్ నటించిన తొలి చిత్రం ఈశ్వర్ సరిగ్గా 20 ఏళ్ల క్రితం ఈరోజే విడుదలయింది. తొలి చిత్రంతోనే ప్రభాస్ నటనలో మంచి మార్కులు వేయించుకున్నాడు. 20 ఏళ్లలో ప్రభాస్ స్టార్ హీరోగా ఎదిగిన వైనం అద్భుతం అనే చెప్పాలి.
ఆరడుగుల కటౌట్ ని సిల్వర్ స్క్రీన్ పై చూస్తుంటే ఫ్యాన్స్ కి తెలియని సంతోషం. తన హ్యాండ్సమ్ లుక్ తో ప్రభాస్ మగువలకు కలల రాకుమారుడిలా మారాడు. ఇక బాహుబలి చిత్రంతో ప్రభాస్ ఖ్యాతి ఖండఖండాలు దాటింది. కొన్ని నెలల క్రితం.. ఈ ఏడాది కృష్ణంరాజు గారు ఈశ్వర్ చిత్రాన్ని గుర్తు చేసుకున్నారు. ఈశ్వర్ ప్రారంభోత్సవం జరిగి 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా కృష్ణం రాజు అప్పటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు.
Rip Krishnam Raju
ప్రభాస్ ఎదిగిన విధానం గుర్తు చేసుకుంటూ మురిసిపోయారు. ఈశ్వర్ ప్రారంభోత్సవం జరిగి 20 ఏళ్ళు పూర్తయింది. కానీ ఇప్పుడు ప్రభాస్ 20 దేశాల్లో హీరో అని కృష్ణం రాజు ఎంతో సంబరపడ్డారు. ఆ కార్యక్రమంలో కృష్ణం రాజు మాట్లాడుతూ.. మొన్ననే ఒక న్యూస్ విన్నా. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ చిత్రాన్ని హాలీవుడ్ లో కూడా ఇంగ్లీష్ లో రిలీజ్ చేయాలని డిమాండ్స్ వస్తున్నాయట.
నిజంగా అది జరిగితే ఎంత అద్భుతంగా ఉంటుందో అని కృష్ణం రాజు మురిసిపోయారు. కానీ ఆది పురుష్ చూడకుండానే కృష్ణం రాజు తుదిశ్వాస విడిచారు. ఒక వేళ బతికి ఉండి ఉంటే ప్రభాస్ ని శ్రీరాముడి గెటప్ లో చూసి కృష్ణం రాజు మురిసిపోయేవాడేమో.
ఈశ్వర్ రిలీజై 20 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ట్రెండింగ్ గా మారాడు. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె, మారుతి దర్శకత్వంలో ఒక చిత్రంలో నటిస్తున్నాడు. సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన ఆదిపురుష్ కొన్ని కారణాల వల్ల వచ్చే ఏడాది జూన్ కి వాయిదా పడింది.