MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Entertainment
  • ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్టోరీ లీక్ ? ఆ సినిమా గుర్తు తెస్తోందేంటి

ప్రభాస్‌ 'స్పిరిట్‌' స్టోరీ లీక్ ? ఆ సినిమా గుర్తు తెస్తోందేంటి

Prabhas: ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వస్తున్న 'స్పిరిట్' సినిమా కథ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. అసలు కథ ఏంటో తెలుసుకోండి.

2 Min read
Author : Surya Prakash
Published : Mar 18 2025, 08:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu

Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu


Prabhas: ప్రభాస్‌(Prabhas) హీరోగా ‘అర్జున్‌ రెడ్డి, యానిమల్‌’ చిత్రాల ఫేమ్‌ సందీప్‌ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం ‘స్పిరిట్‌’. ఈ సినిమా ప్రీప్రోడక్షన్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ను మేలో ప్రారంభించాలని యూనిట్‌ ప్లాన్‌ చేస్తోందని సమాచారం.  ఈ క్రమంలో ‘స్పిరిట్‌’(Spirit) సినిమా సెట్స్‌కు వెళ్లే సమయం ఆసన్నమవటంతో చిత్రం గురించిన రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ చిత్రం కథ లీక్ అంటూ బాలీవుడ్ మీడియాలో ఓ కథనం ప్రచారం అవుతోంది. ఇంతకీ ఏమిటా కథ

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu

Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu


మొదటి నుంచి చెప్తున్నట్లుగానే  ఈ చిత్రంలో ప్రభాస్‌ తొలిసారిగా పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో నటించనున్నారు. అతను చాలా నిజాయితీ పరుడైన ఆఫీసర్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చి ఉంటాడు. అతనికో భార్య, ఓ నాలుగేళ్ల కొడుకు ఉంటారు.

అయితే అతను ఓ మిషన్ పనిమీద వెళ్లినప్పుడు పరిస్దితులు అన్ని రివర్స్ అవుతాయి. కుటుంబానికి థ్రెట్ గా మారతాయి. తన స్పిరిట్ నే దెబ్బతీసే  పరిస్దితులు వస్తాయి. వాటని అన్నిటిని ఎలా దాటి , విలన్ ని , అతని దందాని ఎలా మట్టుపెట్టి తన కుటుంబాన్ని ఎలా సేవ్ చేసుకున్నాడనేది కథ అంటున్నారు. 

34
Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu

Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu


అయితే లీకైనట్లు చెప్పబడుతున్న ఈ కథ చదువుతూంటే విజయ్ హీరోగా అట్లీ దర్సకత్వంలో వచ్చిన థేరీ గుర్తుకు వస్తోంది. దాన్నే రీసెంట్ గా హిందీలో బేబీ జాన్ అని రీమేక్ చేసి తీసారు. సినిమా డిజాస్టర్ అయ్యింది.

అయితే కేవలం ప్రిమైజ్ వరకూ ఇలా ఉన్నా , పూర్తి కథ, కథనం వేరుగా ఉంటుందంటున్నారు. ముఖ్యంగా ఎమోషన్స్ పీక్స్ లో తన గత చిత్రాలు అర్జున్ రెడ్డి, యానిమల్ ని దాటి ఉంటాయంటున్నారు. ముఖ్యంగా సెకండాఫ్ పూర్తిగా యాక్షన్ తో నిండిపోయి ఉంటుందిట. 

44
Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu

Prabhas and Sandeep Reddy Vanga Spirit Story Leak? in telugu


ఈ చిత్రంలో పాత్ర  లుక్స్, ఫిజిక్‌ పరంగా స్పెషల్‌గా ప్రభాస్  మేకోవర్‌ కానున్నారట. ‘స్పిరిట్‌’షూటింగ్  అనుకున్న సమయానికన్నా కాస్త ఆలస్యం కావడానికి ఇదొక కారణమని ఫిల్మ్‌నగర్‌ భోగట్టా.

ఇక ఈ సినిమాలో హీరోయిన్‌గా మృణాల్‌ ఠాకూర్, ఆలియా భట్, రష్మికా మందన్నా... ఇలా పలువురు తారల పేర్లు తెరపైకి వచ్చాయి.కానీ ఇంకా ఎవరూ ఫైనలేజ్‌ కాలేదట. టీ సిరీస్‌ భూషణ్‌ కుమార్, ప్రణయ్‌రెడ్డి వంగా (సందీప్‌రెడ్డి వంగా సోదరుడు) భద్రకాళి పిక్చర్స్‌ నిర్మించనున్న ‘స్పిరిట్‌’ చిత్రం 2026 చివర్లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌.

About the Author

SP
Surya Prakash
తెలుగు సినిమా జర్నలిజం లో గత ఇరవై ఏళ్లుగా ఉన్నారు. కొన్ని వందల రివ్యూలు, విశ్లేషణాత్మక ఆర్టికల్స్ రాశారు. ఈయన ప్రముఖ సినీ విమర్శకుడు కూడా.
ప్రభాస్
సందీప్ రెడ్డి వంగా
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Anasuya: అనసూయ ఏం చేసిన వైరల్ అయిపోద్ది.. షార్ట్ హెయిర్ తో గ్లామరస్ లుక్ చూశారా
Recommended image2
Shooting Secrets: బాబోయ్.. ఇంటిమేట్ సీన్స్ ఇలా చేస్తారా? హాలీవుడ్ నటి షాకింగ్ కామెంట్స్
Recommended image3
Udayabhanu: ఆమెది మలయాళీ బిజినెస్ బ్లడ్, ఆ తెలివితేటలు అందరికీ ఉండవు.. సుమపై ఉదయభాను కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved