MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • తేడా జరిగుంటే వరుసగా 7 ఫ్లాపులు, 2 సార్లు బాలయ్యతో పోటీ, కట్ చేస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ సింహాసనం అతడిదే 

తేడా జరిగుంటే వరుసగా 7 ఫ్లాపులు, 2 సార్లు బాలయ్యతో పోటీ, కట్ చేస్తే పాన్ ఇండియా బాక్సాఫీస్ సింహాసనం అతడిదే 

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రానికి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. బాలయ్య, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అప్పట్లో కుర్ర హీరోలు తమ చిత్రాలని రిలీజ్ చేసేందుకు సాహసించే వారు కాదు. కానీ అప్పటి కుర్ర హీరో రెండుసార్లు బాలయ్యతో పోటీకి దిగాడు.

2 Min read
Author : Tirumala Dornala
Published : Mar 19 2025, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Balakrishna

Balakrishna

నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రానికి హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ వర్షం కురుస్తుంది. బాలయ్య, చిరంజీవి లాంటి హీరోల సినిమాలు రిలీజ్ అవుతుంటే అప్పట్లో కుర్ర హీరోలు తమ చిత్రాలని రిలీజ్ చేసేందుకు సాహసించే వారు కాదు. కానీ అప్పటి కుర్ర హీరో రెండుసార్లు బాలయ్యతో పోటీకి దిగాడు. అది కూడా బాలయ్య మంచి జోరు మీద ఉన్న టైంలో. ఆ హీరో ఎవరు, ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
Nandamuri Balakrishna

Nandamuri Balakrishna

ప్రభాస్ కెరీర్ లో తొలి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన చిత్రం వర్షం. ప్రభాస్ ని యువతకి మాస్ ఆడియన్స్ కి వర్షం చేరువ చేసింది. వర్షం రిలీజ్ అయ్యే టైంఓ చిరంజీవి అంజి, బాలయ్య లక్ష్మి నరసింహా రెండు చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. ప్రభాస్ తన వర్షం చిత్రాన్ని భయపడుతూనే రిలీజ్ చేశాడు. కానీ సంచలన విజయం సాధించింది. 

35

ఛత్రపతి చిత్రం తర్వాత ప్రభాస్ కి అగ్ని పరీక్ష ఎదురైంది. ఛత్రపతి తర్వాత ప్రభాస్ ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదు. పౌర్ణమి, యోగి, మున్నా, బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ ఇలా అన్ని చిత్రాలు డిజాస్టర్ అవుతున్నాయి. మధ్యలో బిల్లా మాత్రం మాస్ యాక్షన్ అంశాలతో పర్వాలేదనిపించింది కానీ హిట్ లిస్టులో చేరలేదు. ఆ టైంలో ప్రభాస్ గేరు మార్చి ఫ్యామిలీ లవ్ స్టోరీ కథని ఎంచుకున్నారు. ఆ చిత్రమే డార్లింగ్. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. 

45
Prabhas

Prabhas

సాంగ్స్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 2010 సమ్మర్ లో డార్లింగ్ చిత్రం విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే డార్లింగ్ రిలీజ్ అయిన వారం రోజులకి బాలయ్య సింహా చిత్రం రిలీజ్ అయింది. సింహా చిత్రానికి కూడా సూపర్ హిట్ టాక్ వచ్చింది. చాలా కాలంగా హిట్ లేకపోవడంతో బాలయ్య ఫ్యాన్స్ ఆకలితో ఉన్నారు. సింహా మాస్ ప్రేక్షకుల ఆదరణతో భారీ వసూళ్లు సాధించింది. సింహా వల్ల డార్లింగ్ చిత్రానికి నష్టం జరిగినప్పటికీ ఫ్యామిలీ, యూత్ ఆడియన్స్ ఆదరణతో సూపర్ హిట్ గా నిలిచింది. 

55
Prabhas

Prabhas

డార్లింగ్ ఫస్ట్ హాఫ్ ట్విస్ట్ కొంత గందరగోళంగా అనిపిస్తుంది. ఆ ట్విస్ట్ కి కనుక ఆడియన్స్ కనెక్ట్ కాకపోయి ఉంటే ఫలితం వేరేలా ఉండేది. ప్రభాస్ కి వరుసగా ఏడవ ఫ్లాప్ పడేది. మొత్తంగా డార్లింగ్ చిత్రం ప్రభాస్ ని తిరిగి ఫామ్ లోకి తీసుకు వచ్చింది. ఈ మూవీ తర్వాత ప్రభాస్ వెనుదిరిగి చూసుకోలేదు. కట్ చేస్తే బాహుబలి తర్వాత తన పేరుపై వేల కోట్ల బిజినెస్ జరిగే పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ అవతరించారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
ప్రభాస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Kiara Advani: నా కూతురి ఎంతమందితో అయినా తిరగొచ్చు.. డేటింగ్ పై కియారా బోల్డ్ కామెంట్
Recommended image2
Ravi Mohan: అప్పటి వరకు సినిమాల్లో నటించను, జయం రవి సంచలన నిర్ణయం.. నటిపై ఫైర్
Recommended image3
Anasuya Bikini Photos: అనసూయ బర్త్ డే సెలబ్రేషన్‌.. ప్యాంట్‌ లేని, బికినీ ఫోటోలతో రంగమ్మత్త అరాచకం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved