- Home
- Entertainment
- NBK with PSPK: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ స్పెషల్ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ డిలే!
NBK with PSPK: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి నిరాశ.. ఆ స్పెషల్ ఎపిసోడ్ తో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ డిలే!
నందమూరి నటసింహం బాలయ్య హోస్ట్ చేస్తున్న ‘అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే 2’లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎపిసోడ్ కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. షో తాలుకా తాజా అప్డేట్ తో ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు బాలయ్య అభిమానులు Unstoppable with NBK 2లోని బాలయ్య - పవన్ ఎపిసోడ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. గత నెలలోనే షూటింగ్ పూర్తి చేసుకోవడం అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు.
ఈ ఎపిసోడ్ లో బాలయ్య పవన్ కళ్యాణ్ మధ్య సాగిన సంభాష.. బాలయ్య ఎలాంటి ప్రశ్నలు సంధించారు.. వాటికి పవర్ స్టార్ ఎలా సమాధానాలు ఇచ్చి ఉంటారని అభిమానులతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురుచూస్తున్నారు.
అయితే ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతోందనేది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా ఆహా విడుదల చేసిన జనవరి షెడ్యూల్ లో మాత్రం పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ కనిపించడం లేదు. దీంతో సంక్రాంతి కానుకగా ఎపిసోడ్ వస్తుందని భావించిన ఫ్యాన్స్ కు నిరాశే మిగిలింది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సంక్రాంతికి స్పెషల్ ఎపిసోడ్ ను ప్లాన్ చేయడంతో పవన్ ఎపిసోడ్ ఇంకాస్తా ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం హీరోయిన్స్ జయప్రద, జయసుద, రాశీ ఖన్నా ఎపిసోడ్ తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గెస్ట్ గా వచ్చిన ‘బాహుబలి 1’ ఎపిసోడ్ కూడా స్ట్రీమింగ్ అవుతోంది.
జనవరి 6న ‘బాహుబలి ఎపిసోడ్ 2’ను విడుదల చేయనున్నారు. ఆ తర్వాత సంక్రాంతి కానుకగా బాలయ్య నటించిన ‘వీరసింహారెడ్డి స్పెషల్ ఎపిసోడ్’ స్ట్రీమింగ్ కాబోతుందని అప్డేట్ ఇచ్చారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ - బాలయ్య ఎపిసోడ్ ను విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.
జనవరి ఎండింగ్ లో లేదంటే ఫిబ్రవరిలో పవన్ కళ్యాణ్ ఎపిసోడ్ రాబోతుందని అర్థమవుతోంది. సంక్రాంతి స్పెషల్ గా ఈ ఎపిసోడ్ వస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది. అయితే ఈ ఎపిసోడ్‌లో పవన్‌తో కలిసి డైరెక్టర్ క్రిష్ హాజరు అయిన్నట్లు తెలుస్తుంది. త్రివిక్రమ్ వచ్చారా లేదా అన్నది ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ ఎపిసోడ్ ను థియేటర్లలోనూ విడుదల చేయబోతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.