పవన్ కళ్యాణ్ తో బాలయ్య భామ రొమాన్స్... పవర్ స్టార్ జోడీగా హనీరోజ్..?
బాలయ్య భామతో రొమాన్స్ చేయబోతున్నాడట పవన్ కళ్యాణ్.. మలయాళ బ్యూటీ... హనీరోజ్ పవర్ స్టార్ జోడీగా సందడి చేయబోతున్నట్టు సమాచారం.
honey rose
రీసెంట్ గా వీర సింహరెడ్డి సినిమాతో టాలీవుడ్ లో రచ్చ చేసింది హనీరోజ్(Honey Rose). బాలయ్య మరదలిగా నటిచి మెప్పించింది. సీనియర్ స్టార్ అయినా.. కుర్రాళ్ల గుండెళ్ళో గ్లామర్ బాంబులు పేల్చింది బ్యూటీ. ఈసినిమా తరువాత ఆమె మళ్ళీ టాలీవుడ్ లో బిజీ అవుతుంది అనుకున్నారంతా..? కాని ఈ ఒక్క సినిమాతో ఆమె ప్రవాహం ఆగిపోయింది.
నిజానికి తెలుగుగో ఆమె ఓ సినిమా చేసింది గతంలో.. అప్పుడెప్పుడో శివాజీ సరసన ఆలయం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన హనీరోజ్. అసలు ఆ సినిమా వచ్చింది పోయింది కూడా ఎవరికీ తెలియదు. దీంతో అమ్మడంటే అప్పట్లో ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ నందమూరి బాలకృష్ణతో ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలో నటించి సూపర్ హిట్ అందుకుంది. మా మనోభావాలు దెబ్బతిన్నాయే అంటూ బాలయ్యతో ఆడిపాడి ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.
Honey Rose
అయితే సోషల్ మీడియాలో మాత్రం హనీరోజ్ మ్యానియా గట్టిగా నడుస్తోంది. ఆమె ఫాలోయింగ్.. ఇన్ స్టాలో ఆమె అందాల ఆరబోతకు.. ఫిదా అవ్వని వారు ఉండరు. ఆ ఫాలోయింగ్ షాప్ ఓపెనింగ్ లకు మాత్రమే కలిసి వస్తోంది. వాటి కోసం గట్టిగానే వసూలు చేస్తుందట బ్యూటీ. ఇక తాజాగా హనీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ క్రమంలోనే హనీరోజ్ బంపర్ ఆఫర్ కొట్టేసినట్లు తెలుస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హనీ రోజ్ నటిస్తోందట. ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం. ఈసినిమాలో ఆమెది మేజర్ రోల్ అసి తెలుస్తోంది. ఈ సినిమాలో పవన్ కు జోడీగా శ్రీలీల ఎంపికైంది.ఇక మరో కీలక పాత్రకు హనీ రోజ్ ను దర్శకుడు హరీశంకర్ ఎంపిక చేశారని టాక్.
హనీ రోజ్ అనగానే అందాలు ఆరబోసే పాత్ర అని అనుకుంటుంటారు అంతా బోల్డ్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంది అనుకుంటారు.. కానీ పవన్ కళ్యాణ్ సినిమాలో మాత్రం ఆమె చాలా సీరియస్ రోల్ చేస్తుందట. పవన్ పక్కన హనీ రోజ్ ఛాన్స్ వచ్చిందంటే అమ్మడి దశ తిరిగినట్లే అని అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కాని.. నెట్టింట మాత్రం న్యూస్ వైరల్ అవుతోంది.