- Home
- Entertainment
- మహేష్, జూ.ఎన్టీఆర్ ముందు ఆ స్టార్ హీరో బచ్చా..ఎవరా హీరో, పోసాని ఎందుకు అలా అన్నారో తెలుసా ?
మహేష్, జూ.ఎన్టీఆర్ ముందు ఆ స్టార్ హీరో బచ్చా..ఎవరా హీరో, పోసాని ఎందుకు అలా అన్నారో తెలుసా ?
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబుతో పోల్చితే ఓ స్టార్ హీరో బచ్చా అని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. పోసాని చేసిన వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి, ఎందుకు అలా అన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవండి.

ఆ స్టార్ హీరో బచ్చా అంటూ పోసాని కామెంట్స్
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, చిరంజీవి లాంటి ఎందరో నటులు తెలుగు సినిమా ఖ్యాతిని నిలబెట్టారు. లెజెండ్రీ నటులుగా వీళ్లంతా ప్రశంసలు అందుకున్నారు. తమిళ చిత్ర పరిశ్రమ, తెలుగు చిత్ర పరిశ్రమ మధ్య తరచుగా వివాదాలు జరుగుతూనే ఉంటాయి. ముఖ్యంగా కోలీవుడ్ ఫ్యాన్స్, టాలీవుడ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ట్రోలింగ్ చేసుకుంటూ ఉంటారు. తమిళ నటులు, తెలుగు నటులలో ఎవరు గొప్ప అనే విషయంలో ఈ వివాదం జరుగుతూ ఉంటుంది. గతంలో ఓ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణ మురళి ఓ తమిళ స్టార్ హీరోని ఉద్దేశించి మాట్లాడుతూ.. జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు మూవీ అతడు బచ్చా అని కామెంట్స్ చేశారు. ఇంతకీ పోసాని ఎవరిని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశారు ? ఎందుకు చేశారు ? అనేది ఇప్పుడు చూద్దాం.
రాంచరణ్ వ్యాఖ్యలతో వివాదం
2011లో విడుదలైన సూర్య 7th సెన్స్ మూవీ వల్ల ఈ వివాదం మొదలైంది. ఈ చిత్ర తెలుగు ఆడియో లాంచ్ ఈవెంట్ కి మెగా పవర్ స్టార్ రాంచరణ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆ ఈవెంట్ లో రాంచరణ్ మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో సూర్యని మించిన నటుడు లేడని.. ఇలాంటి పాత్ర చేయాలంటే సూర్యకి మాత్రమే సాధ్యం అని పేర్కొన్నాడు. రాంచరణ్ చేసిన వ్యాఖ్యలని అప్పట్లో బాలకృష్ణ లాంటి వారు తీవ్రంగా తప్పుబట్టారు. ఒక తమిళ హీరో ముందు అలా మాట్లాడడం తెలుగు సినిమాని అవమానించడమే అని బాలయ్య ఓపెన్ గా ఫైర్ అయ్యారు. ఏం మనదగ్గర గొప్ప నటులు లేరా.. మనం చేయలేమా అలాంటి సినిమాలు అంటూ బాలయ్య రాంచరణ్ కి వార్నింగ్ ఇస్తూ కామెంట్స్ చేశారు.
మహేష్, జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటులు
ఈ వివాదంపై పోసాని కృష్ణ మురళి కూడా రియాక్ట్ అయ్యారు. పోసాని కూడా సూర్య బెస్ట్ యాక్టర్ అని రాంచరణ్ చేసిన కామెంట్స్ ని తప్పుపట్టారు. పోసాని మాట్లాడుతూ.. మహేష్ బాబు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ లో 10 శాతం కూడా సూర్య ఇవ్వలేడు. జూనియర్ ఎన్టీఆర్ నవరసాలని అద్భుతంగా పండించగలడు. తారక్ కామెడీ చేయగలడు, సీరియస్ గా నటిస్తాడు, ఎమోషనల్ గా చేస్తాడు, పౌరాణిక డైలాగులని అద్భుతంగా చెప్పగలిగే దమ్మున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లతో పోల్చితే సూర్య బచ్చా.
సూర్యకి లిమిట్స్ ఉన్నాయి
సూర్యకి నటనలో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కి ఎలాంటి లిమిట్స్ లేవు, మహేష్ కి కూడా లేవు. వాళ్లిద్దరూ ఎలాంటి పాత్రలో అయినా నటించగలరు. ఇంత గొప్ప నటులు తెలుగులో ఉంటే.. సూర్యకి ఎవరూ సాటి రారు అని అనడం తప్పు అంటూ పోసాని కామెంట్స్ చేశారు. ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ ఇవ్వడంలో మహేష్ బాబుకి తిరుగు లేదు. ఎలాంటి డైలాగ్ అయినా అనర్గళంగా చెప్పడంలో జూనియర్ ఎన్టీఆర్ కి ఎవరూ సాటి రారు.
జాతీయ అవార్డు అందుకున్న సూర్య
అదే సమయంలో సూర్య కూడా గొప్ప నటుడే అని చెప్పాలి. సూర్య ఆకాశం నీ హద్దురా అనే చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. సూర్య ప్రస్తుతం తెలుగు డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.