MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • ఏడాదిపాటు నన్ను అలానే చూశాడు.. ఫస్ట్ లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన పూర్ణ.. ఎలా బ్రేక్‌ అయ్యిందంటే?

ఏడాదిపాటు నన్ను అలానే చూశాడు.. ఫస్ట్ లవ్‌ స్టోరీ రివీల్‌ చేసిన పూర్ణ.. ఎలా బ్రేక్‌ అయ్యిందంటే?

నటి పూర్ణ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. `ఢీ` జడ్జ్ గానూ మెరిసి ఆకట్టుకుంది. ఇప్పుడు ఫ్యామిలీలైఫ్‌కి పరిమితమై పూర్ణ ఫస్ట్ లవ్‌ స్టోరీ బయటకు వచ్చింది.   

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 23 2024, 02:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

పూర్ణ.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంది. ఆమె పెళ్లి చేసుకుని తల్లి కూడా అయ్యింది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్‌కే పరిమితమయ్యింది. మొన్నటి వరకు డాన్స్ షో `ఢీ` షోకి జడ్జ్ గా చేసింది. ఇప్పుడు దాన్ని కూడా వదిలేసింది. ఇటీవల ఆమె `భీమా`, `గుంటూరు కారం` చిత్రాల్లో మెరిసింది. ప్రస్తుతం ఆమె చేతిలో అయితే సినిమాలు లేవు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

తాజాగా పూర్ణకి చెందిన ఓ విషయం ట్రెండింగ్‌లోకి వచ్చింది. ఆమె తన ఫస్ట్ లవ్‌ స్టోరీ బయటపెట్టింది. అందరి జీవితంలోనూ లవ్‌ స్టోరీలుంటాయి. ఫస్ట్ క్రష్‌ కచ్చితంగా ఉంటుంది. అలా తన జీవితంలోనూ ఉందని చెప్పింది పూర్ణ. స్కూల్‌ డేస్‌లోనే ఆ ప్రేమ కథ జరిగిందని, సినిమా స్థాయిలో ఉందని వెల్లడించింది పూర్ణ.
 

37

 ఈ సందర్భంగా లవ్‌ స్టోరీని వెల్లడించింది. ఏడాదిపాటు చూపులతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ. స్కూల్‌ డేస్‌లోనే తన మొదటి ప్రేమ స్టార్ట్ అయ్యిందని చెప్పింది. తాను గర్ల్స్ స్కూల్‌లో చదువుకుందట. అందులో అబ్బాయిలు ఉండేవారు కాదు. కానీ తమ స్కూల్‌కి కిలో మీటర్ లోపు పరిధిలోనే బాయ్స్ స్కూల్‌ ఉండేదట. 

47

తమ స్కూల్‌ బస్‌ బాయ్స్ స్కూల్‌ దగ్గర్నుంచే వెళ్లేదట. కొందరు చిన్నపిల్లలను దించడం కోసం ఆ స్కూల్‌ వద్ద కాసేపు ఆగేదట. అలా ఓ రోజు ఓ కుర్రాడు స్కూల్‌ వద్ద నిల్చోని తనని చూస్తున్నాడట. సడెన్‌గా తమ ఇద్దరు చూపులు కలిశాయని తెలిపింది పూర్ణ. ఆ తర్వాత రోజు నుంచి ప్రతి రోజూ అతను అదే ప్లేస్‌లో ఉండి తననే చూసేవాడట. 
 

57

సుమారు ఏడాదిపాటు అలానే జరిగింది. తమ బస్‌ వెళ్లడం, అతను అక్కడే నిలబడి తనని చూడటం జరిగిందట. ఏడాదిపాటు కళ్లతోనే ప్రేమించుకున్నామని చెప్పింది పూర్ణ. ఇక వాలెంటైన్స్ డే రోజు ఏకంగా తనకు చాక్లెట్లు, రోజా పువ్వుని కూడా పంపించాడట. కానీ తమ ప్రేమ అలా చూసుకోవడంతోనే ఆగిపోయిందని చెప్పింది పూర్ణ. ఎంతో ఫ్యూర్‌గా, క్యూట్‌గా సాగిన ఈ లవ్‌ స్టోరీ ఇప్పుడు వైరల్‌ అవుతుంది. ఐడ్రీమ్‌ ఓల్డ్ ఇంటర్వ్యూలో పూర్ణ ఈ విషయాన్ని వెల్లడించింది. 
 

67

కేరళాకి చెందిన పూర్ణ మలయాళ చిత్రంతో నటిగా కెరీర్‌ని ప్రారంభించింది. ఆమె చిన్ననాటి నుంచే క్లాసికల్‌ డాన్సర్‌. అదే ఆమెని సినిమాల వైపు నడిపించింది. 2004లో `మంజు పోలోరు పెంకుట్టీ` చిత్రంతో హీరోయిన్‌గా పరిచయం అయ్యింది. ప్రారంభంలో కీలక పాత్రల్లో నటించి ఆ తర్వాత హీరోయిన్‌గా టర్న్ తీసుకుంది. 2007లో `శ్రీ మహాలక్ష్మి` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో శ్రీహరి సరసన నటించింది. కొంత గ్యాప్‌తో 2011లో `సీమటపాకాయ్‌` చిత్రంతో రీఎంట్రీ ఇచ్చింది. ఇది బాగానే ఆడింది. 

 

77

ఆ తర్వాత రవిబాబు `అవును` సినిమాలో హీరోయిన్‌గా ఆఫర్ అందుకుంది. హర్రర్‌ మూవీ పెద్ద హిట్‌ కావడంతో పూర్ణ లైఫ్‌ టర్న్ తీసుకుంది. ఓ వైపు మలయాళం, తమిళం, కన్నడ చిత్రాలు చేస్తూనే తెలుగులోనూ మెరిసింది. ప్రారంభంలో హీరోయిన్‌గా చేసి ఆ తర్వాత క్యారెక్టర్స్ గా టర్న్ తీసుకుంది. ఇటీవల `గుంటూరు కారం`లో కూర్చీ డాన్స్ లో మెరిసిన విషయం తెలిసిందే.
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 10: నాకు అన్యాయం చేశావ్‌.. ముఖేష్‌ గౌడపై దేబ్జానీ ఫైర్‌.. నరేష్‌కి ఝలక్‌
Recommended image2
Surya teja: శంభో శివ శంభో నటుడి కొత్త అవతారం.. ఆ పనిచేసిన ప్రపంచంలోనే తొలి రైటర్‌
Recommended image3
Missing Meghana: హీరోయిన్‌తో గొడవపై క్లారిటీ ఇచ్చిన మిస్సింగ్‌ మేఘన దర్శకుడు.. అసలేం జరిగిందంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved