MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • రీఎంట్రీ ఇస్తూనే డాన్సర్‌ బుగ్గకొరికిన పూర్ణ.. `ఢీ` భామలోని కసిని చూసి షో మొత్తం షాక్‌..

రీఎంట్రీ ఇస్తూనే డాన్సర్‌ బుగ్గకొరికిన పూర్ణ.. `ఢీ` భామలోని కసిని చూసి షో మొత్తం షాక్‌..

పూర్ణ `ఢీ` షోతో బుల్లితెరపై పాపులర్‌ అయిన విషయం తెలిసిందే. కొంత గ్యాప్‌ ఇచ్చిన ఆమె మళ్లీ రీఎంట్రి ఇచ్చింది. అది అదిరిపోయేలా ఉండటం విశేషం. పూర్ణ ఈజ్‌ బ్యాక్‌ ఓ జోష్‌ని తీసుకొచ్చింది.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Aug 11 2022, 05:07 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

బుల్లితెరపై `ఢీ`(Dhee) షో ద్వారా విశేష గుర్తింపు పొందింది పూర్ణ(Poorna). ఈ షో ఆమెకి మంచి క్రేజ్‌తోపాటు ఫాలోయింగ్‌ని పెంచింది. ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గర చేసింది. మరోవైపు ఇది పరోక్షంగా సినిమా అవకాశాలను కూడా తెచ్చిపెట్టిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది పూర్ణ. 
 

27

`ఢీ`13 సీజన్‌లో జడ్జ్ గా వ్యవహరించింది పూర్ణ. ప్రియమణి, గణేష్‌ మాస్టర్లతో కలిసి జడ్జ్ గా చేసి ఆద్యంతం ఆకట్టుకుంది. తన ముద్దుముద్దు మాటలతో, మరోవైపు తన గ్లామర్‌తో కట్టిపడేసింది. అయితే 14వ సీజన్‌ నుంచి ఆమెని తొలగించారు. ఆమె వైదొలిగిందా? లేక తీసేశారా? అనేది క్లారిటీ లేకపోయినా, ఆమె లేని లోటు స్పష్టంగా కనిపించింది. మళ్లీ ఇన్నాళ్లు రీఎంట్రీ ఇచ్చింది పూర్ణ. 
 

37

తాజాగా `ఢీ14` లేటెస్ట్ ప్రోమో విడుదలైంది. ఇందులో బ్యాక్‌ అనే విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు గణేష్‌ మాస్టర్‌ స్థానంలో జానీ మాస్టర్‌, నందితా స్వేత స్థానంలో పూర్ణ వచ్చారు. ఇది టెంపరరీగా చేసిన అరెంజ్‌ మెంటా? లేక మళ్లీ కమ్‌ బ్యాక్‌ అవుతుందా? అనేది ఆసక్తికరంగా, సస్పెన్స్ గా మారింది. 
 

47

ఇందులో పూర్ణ చేసిన పని మాత్రం హైలైట్‌గా నిలిచింది. అద్భుతంగా డాన్సు చేసిన ఓ మేల్‌ డాన్సర్‌తో ముద్దు పెట్టించుకోవడం హైలైట్‌గా నిలిచింది. పూర్ణ అతని డాన్సు కి ఫిదా కావడంతో తన వద్దకు రప్పించుకుని మరీ ముద్దు పెట్టించుకుంది. ఇది చూసిన హైపర్‌ ఆది, అఖిల్‌ షాక్‌ అయ్యారు. ఇతర డాన్సర్లు, జడ్జ్ లు కూడా ఆశ్చర్యపోవడం విశేషం. 

57

అంతటితో ఆగలేదు.. తర్వాత మరో లేడీ డాన్సర్‌ సైతం ఊరమాస్‌ డాన్సుతో స్టేజ్‌ని షేక్‌ చేసింది. ఆమె డాన్సుకి శ్రద్ధా దాస్‌ కూడా మైమరచిపోయారు. ఇదే డాన్సు ఊర్లో వేస్తే సీటీమార్‌ పక్కా అంటూ ప్రశంసలు కురిపించింది. ఇక పూర్ణ అయితే ఏకంగా తన వద్దకు పిలిపించుకుని ఆమె డాన్సర్‌ బుగ్గని కొరకడం విశేషం. అది మామూలుగా కొరకడం కాదు, కసిగా కొరకడంతో ఆ డాన్సరు సైతం ఆశ్చర్యపోయేలా కావడం విశేషం.

67

పూర్ణ ఈ ముద్దుల గోల ఇప్పుడు సోషల్‌ మీడియాలో, యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ టాపిక్‌ అవుతుంది. పూర్ణ రీఎంట్రీ ఈ రేంజ్‌లో ఉంటుందా? అని ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి కమ్‌ బ్యాక్‌ తోనే పూర్ణ రచ్చ లేపిందని చెప్పొచ్చు. ప్రస్తుతం `ఢీ` లేటెస్ట్ ప్రోమో విడుదలై యూట్యూబ్‌లో ట్రెండింగ్‌ అవుతుంది. పూర్ణ ఫ్యాన్స్ ని మరింతగా ఆకట్టుకుంటుంది. 

77

ఇదిలా ఉంటే పూర్ణ ఆ మధ్య పెళ్లి చేసుకోబోతున్నట్టు ప్రకటించిన విసయం తెలిసిందే. ఎంగేజ్‌మెంట్‌ కూడా అయ్యిందని కాబోయే వాడితో కలిసి దిగిన ఫోటోని అభిమానులతో షేర్‌ చేసింది. యూఏఈకి చెందిన వ్యాపారవేత్త షానిద్‌ అసిఫ్‌ అలీతో పూర్ణ వివాహం జరగబోతుందని తెలిపిన విషయం తెలిసింది. కానీ ఎంగేమ్‌ంట్‌ క్యాన్సిల్ అయ్యిందని, మ్యారేజ్‌ చేసుకోవడం లేదనే రూమర్స్ ఇటీవల చక్కర్లు కొడుతున్నాయి. వీటికి ఫుల్‌స్టాప్‌ పెడుతూ కాబోయే వాడి కౌగిలిలో ఉన్న ఓ ఫోటోని పంచుకుంది పూర్ణ. దీంతో అవన్నీ ఉట్టి రూమర్సే అని తేలిపోయింది. వీరి మ్యారేజ్‌ నవంబర్‌లో ఉండబోతుందని సమాచారం. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
వినోదం
Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi ముందు బ్రహ్మానందం కనిపించరు.. ఆయన కామెడీ టైమింగ్ వేరే లెవెల్..
Recommended image2
పవన్ కళ్యాణ్ చివరి 10 సినిమాల్లో అసలైన హిట్లు ఎన్ని..అభిమానులు త్వరగా మరచిపోవాలి అని కోరుకునే మూవీ అదే
Recommended image3
Love Failure Movies: ప్రేమలో ఓడిపోయినా బ్లాక్‌బస్టర్ అయిన సినిమాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved