MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పూజ హెగ్డే జస్ట్ మిస్ అయ్యింది... లేదంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టేది!

పూజ హెగ్డే జస్ట్ మిస్ అయ్యింది... లేదంటే డబుల్ హ్యాట్రిక్ కొట్టేది!

పూజ హెగ్డే వరుస ప్లాప్స్ తో సతమతం అవుతుండగా మరో ప్లాప్ జస్ట్ మిస్ అయ్యింది. లేదంటే డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసేది. ఆ మేటర్ ఏంటో చూద్దాం...  

2 Min read
Author : Sambi Reddy
| Updated : Jan 14 2024, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17


పూజ హెగ్డే కెరీర్ బిగినింగ్ నుండి ఒడిదుడుకులే. అయితే ఓ మూడేళ్లు ఆమెకు గోల్డెన్ పీరియడ్ నడిచింది. ఫేడ్ అవుట్ దశకు చేరుకున్న పూజ హెగ్డేకు దర్శకుడు త్రివిక్రమ్ బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అరవింద సమేత వీరరాఘవ చిత్రంలో హీరోయిన్ గా తీసుకున్నాడు. 
 

27

ఆ టైం లో ఎన్టీఆర్ పక్కన ఛాన్స్ అంటే మామూలు విషయం కాదు. అరవింద సమేత హిట్ కావడంతో మహేష్ పక్కన మహర్షి లో ఛాన్స్ పట్టేసింది. అది కూడా హిట్. ఇక అల వైకుంఠపురంలో చిత్రంతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చింది. పూజ హెగ్డే పట్టిందల్లా బంగారం అయ్యింది. 

 

37

అయితే 2022 నుండి ఆమెకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది. రాధే శ్యామ్ మూవీతో మొదలైన పరాజయాల పరంపర కొనసాగుతుంది. పూజ హెగ్డే నటించిన ఆచార్య, బీస్ట్, సర్కస్, కిసీ కా భాయ్ కిసీ కీ జాన్ వరుస ప్లాప్ అయ్యాయి. 

47

ఈ క్రమంలో మహేష్ బాబుకు జంటగా త్రివిక్రమ్ మరోసారి ఛాన్స్ ఇచ్చాడు. ఇది ఆమెకు కమ్ బ్యాక్ మూవీ అవుతుంది . త్రివిక్రమ్ మరోసారి ఆమెను హిట్ ట్రాక్ ఎక్కిస్తాడని భావించారు. అనూహ్యంగా ఈ ప్రాజెక్ట్ నుండి పూజ హెగ్డే తప్పుకుంది. 

57

అందుకు చాలా కారణాలు వినిపించాయి. మెయిన్ హీరోయిన్ గా తీసుని సెకండ్ హీరోయిన్ చేశారని ప్రధానంగా వినిపించిన కారణం. అయితే డేట్స్ అడ్జెస్ట్ కాకే ప్రాజెక్ట్ వదిలేసిందని ఓ సందర్భంలో నిర్మాత సూర్యదేవర నాగ వంశీ చెప్పారు. 

67

అయితే గుంటూరు కారం మూవీ నుండి తప్పుకుని ఆమె మంచి పని చేసింది. లేదంటే మరో ప్లాప్ ఆమె ఖాతాలో పడేది. జనవరి 12న విడుదలైన గుంటూరు కారం ప్లాప్ టాక్ తెచ్చుకుంది. రెండో రోజే ఈ చిత్ర వసూళ్లు తగ్గాయి. గుంటూరు కారంలో పూజ హెగ్డే నటించి ఉంటే ఆమెకు వరుసగా ఆరో ప్లాప్ అయ్యేది. 

 

77

ప్రస్తుతం పూజ హెగ్డే హిందీలో ఒక చిత్రం చేస్తుంది. షాహిద్ కపూర్ కి జంటగా నటిస్తుంది. ఈ చిత్ర టైటిల్ దేవ. చిత్రీకరణ దశలో ఉంది. తెలుగులో పూజ హెగ్డే అధికారికంగా ఒక్క చిత్రం కూడా ప్రకటించలేదు. 

About the Author

SR
Sambi Reddy
పది సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పలు ప్రముఖ సంస్థల్లో పని చేసిన అనుభవం ఉంది. గత మూడేళ్లుగా ఏషియా నెట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ విభాగంలో సబ్ ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
అక్కను మించిపోయిన `ఊ అంటావా` సింగర్‌.. ఒక్క సాంగ్‌తో పాన్ ఇండియా సింగర్‌ అయిన మంగ్లీ చెల్లి తెరవెనుక స్టోరీ
Recommended image2
Chiranjeevi: చిరంజీవి కంటే ఆ హీరోకే హిట్లు ఎక్కువ.. కట్ చేస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ పరిమితం
Recommended image3
నల్లగా ఉందని రెండు నెలలు పసుపు రాశారు.. కట్‌ చేస్తే ఇండస్ట్రీని దున్నేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved