- Home
- Entertainment
- పొట్టిదైన ఎల్లో డ్రెస్‌లో బుట్టబొమ్మ ఎంత క్యూట్‌గా ఉందో.. కానీ ఆ థైస్ మాత్రం కేక.. ఫ్యాన్స్ కోసం ఏం చేసిందంటే
పొట్టిదైన ఎల్లో డ్రెస్‌లో బుట్టబొమ్మ ఎంత క్యూట్‌గా ఉందో.. కానీ ఆ థైస్ మాత్రం కేక.. ఫ్యాన్స్ కోసం ఏం చేసిందంటే
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజా హెగ్డే వెకేషన్‌లో ఎంజాయ్ చేస్తుంది. ఆమె తరచూ ఎయిర్ పోర్ట్ ల వద్ద మెరుస్తూ ఆకట్టుకుంటుంది. డిఫరెంట్ స్టయిల్ డ్రెస్సుల్లో కనిపిస్తూ అలరిస్తుంది. కనువిందు చేస్తుంది.

పూజా హెగ్డే తాజాగా ఎల్లో డ్రెస్‌లో మెరిసింది. లెమన్ లను ప్రింట్ చేసినట్టుగా ఉన్న నయా పొట్టి గౌనులో హోయలు పోయింది బుట్టబొమ్మ. మోకాళ్లపైకున్న పొట్టి డ్రెస్‌లో థైస్ చూపిస్తూ కనువిందు చేసింది. ఎయిర్‌పోర్ట్ లో ఆమె వెళ్తున్న క్రమంలో తీసిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇందులో పూజా హెగ్డే ఎంతో క్యూట్‌గా ఉంది. బేసిక్‌గా హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ భామ ఇంత క్యూట్‌గా కనిపించడం ఆశ్చర్యపరుస్తుంది. ఏజ్ తగ్గిపోయినట్టుగా, టీనేజ్ అమ్మాయిలా కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. ప్రస్తుతం ఈ అమ్మడి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటున్నాయి.
పూజా హెగ్డే శ్రీలంక వెకేషన్‌కి వెళ్లింది. ఆ వెకేషన్‌ని కంప్లీట్ చేసుకుని తిరిగి వస్తుంది. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్ లో మెరిసింది పూజా. అయితే ఆమె ఎయిర్ పోర్ట్ నుంచి ఫాస్ట్ గా వెళ్లిపోతుంది. కార్ పార్కింగ్ సమీపంలో కొందరు అభిమానులు ఆమెని చూశారు. సెల్ఫీల కోసం రిక్వెస్ట్ చేశారు. దీంతో పెద్ద మనసు చాటుకున్న పూజా.. వెనక్కి వచ్చి మరీ వారికి సెల్ఫీలిచ్చింది. కారులోకి ఎక్కుతున్న సమయంలోనూ ఓపికగా ఫోటోలిచ్చి వెళ్లిపోయింది. దీంతో ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది హీరోయిన్లు ఫోటోలను కాదని తోసుకుంటూ వెళ్లిపోతారు. అభిమానుల రిక్వెస్ట్ ని లెక్కచేయరు, కానీ పూజా మాత్రం ముందుకెళ్లాక వెనక్కి వచ్చి మరీ సెల్ఫీలివ్వడం విశేషం. ప్రస్తుతం ఆయా పిక్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.
ఇక ఇటీవల పూజా హెగ్డే.. సల్మాన్ ఖాన్‌తో కలిసి నటించిన `కిసి కా భాయ్ కిసి కీ జాన్` చిత్రంతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమా పరాజయం చెందింది. వరుసగా పూజాకిది ఐదో డిజాస్టర్. గతేడాది నాలుగు సినిమాలు పోయాయి. అందులో రెండు తెలుగు చిత్రాలు, ఓ తమిళ సినిమా, ఓ హిందీ చిత్రం ఉంది. ఇప్పుడు మరో హిందీ మూవీ కూడా పరాజయం చెందింది.
గతేడాది పూజా ప్రభాస్‌తో `రాధేశ్యామ్`, విజయ్‌తో `బీస్ట్`, రామ్‌చరణ్‌తో `ఆచార్య`, రణ్‌వీర్ సింగ్‌తో `సర్కస్` చిత్రాల్లో నటించింది. ఈ నాలుగు సినిమాలు డిజప్పాయింట్ చేశాయి. దీంతో అప్పటి వరకు గోల్డెన్ లెగ్‌గా, లక్కీ హీరోయిన్‌గా పేరుతెచ్చుకున్న ఈ భామ ఒక్కసారిగా ఐరన్ లెగ్‌గా మారిపోయే పరిస్థితి తలెత్తింది.
ఇప్పుడు తన ఆశలన్నీ త్రివిక్రమ్‌పైనే పెట్టుకుంది. మహేష్‌బాబుతో ఆయన రూపొందిస్తున్న `ఎస్‌ఎస్‌ఎంబీ28`లో పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా హిట్ అయితే పూజాకి పూర్వ వైభవం వస్తుంది. లేదంటే పరిస్థితి తారుమారవుతుంది. ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్‌తో `ఉస్తాద్ భగత్ సింగ్` చిత్రంలో నటించాల్సి ఉంది. కానీ ఇందులో పూజా ఉంటుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.