MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • పవన్‌, విజయ్‌ దేవరకొండలకు నో చెప్పిన పూజా హెగ్డే.. కారణం మాత్రం బలమైనదే.. ఆ విషయంలో తగ్గడం లేదుగా!

పవన్‌, విజయ్‌ దేవరకొండలకు నో చెప్పిన పూజా హెగ్డే.. కారణం మాత్రం బలమైనదే.. ఆ విషయంలో తగ్గడం లేదుగా!

పూజా హెగ్డే ఇటీవల రెండు భారీ సినిమాలను వదులుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఆ రెండు సినిమాల నుంచి తప్పుకోవడానికి కారణం ఇప్పుడు చర్చనీయాంశం అవుతుంది. ఒక విషయంలో పూజా తగ్గేదెలే అంటోందట. మరోవైపు తనకు కొంత అన్యాయమూ జరుగుతుందనే ఆవేదన చెందుతుందట. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 17 2023, 09:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

బుట్టబొమ్మ పూజా హెగ్డే.. గతేడాది వరకు టాలీవుడ్‌లో నంబర్‌ వన్‌ స్టార్‌ హీరోయిన్‌. కానీ ఆమె సినిమాలు పోవడంతో ఇప్పుడు క్రేజ్‌ పడిపోయింది. ఆ జోరు తగ్గింది. పూజా కెరీర్‌ పరంగా పెద్ద డిజాప్పాయింట్‌ అని చెప్పాలి. అయితే సినిమాల సక్సెస్‌, ఫెయిల్యూర్‌లో హీరోయిన్ల పాత్ర చాలా తక్కువ. కమర్షియల్‌ సినిమాల్లో వారి పాత్రనే ఉండదని చెప్పొచ్చు. అందుకే చాలా వరకు హీరోయిన్లకి సక్సెస్‌ ఫెయిల్యూర్‌తో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తుంటాయి. కానీ అన్ని సార్లు అది పనిచేయదు, సక్సెస్‌ సెంటిమెంట్‌ని చాలా వరకు ఫాలో అవుతుంటారు. 
 

25

పూజా హెగ్డే తన సినిమాల ఫెయిల్యూర్‌ నుంచి ఓ పాఠాన్ని నేర్చుకుంది. ఏది పడితే అది చేయకూడదని అనుకుందట. కొత్త సినిమాల ఎంపికల తన పంథా మార్చిందని, కంటెంట్‌ ఉన్న సినిమాలకు ప్రయారిటీ ఇస్తుందని సమాచారం. తన పాత్రకి ఎంతటి ప్రయారిటీ ఉంటుందనేది చూస్తుందట. ఆ విషయంలో తగ్గేదెలే అంటోందని సమాచారం. ఈ కారణంగానే ఇప్పుడు రెండు పెద్ద సినిమాలు వదులుకుందని సమాచారం. 
 

35

పవన్‌ కళ్యాణ్‌, హరీష్‌ శంకర్‌ కాంబినేషన్‌లో `ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌` అనే చిత్రం రూపొందుతుంది.ఈ సినిమా ప్రారంభానికి ముందు నుంచి, రెండేళ్ల క్రితమే ఇందులో పూజా హీరోయిన్‌ అని దర్శకుడు హరీష్‌ శంకర్‌ ప్రకటించారు. మొన్నటి వరకు పూజానే హీరోయిన్‌ అనుకున్నారు. కానీ శ్రీలీల మరో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో పూజా ఆశలు గల్లంతయ్యాయి. ఇందులో తన పాత్రకి పెద్దగా స్కోప్‌ లేదని పూజా ఈ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. తనకంటే శ్రీలీల పాత్రకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడంతో తాను `ఉస్తాద్‌ భగత్ సింగ్‌`ని లైట్‌ తీసుకుందని సమాచారం. 
 

45

మరోవైపు మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో వస్తోన్న `గుంటూరు కారం` విషయంలోనూ అదే జరుగుతుందట. ఇందులోనూ శ్రీలీల సెకండ్‌ హీరోయిన్‌. చిత్ర వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ఇందులో పూజా హెగ్డే కంటే శ్రీలీల పాత్ర నడివే ఎక్కువగా ఉంటుందని, ఇంపార్టెన్స్ కూడా ఎక్కువగానే ఉంటుందని అంటున్నారు. ఈ విషయంలోనే పూజా కొంత డిజప్పాయింట్‌గా ఉందట. త్రివిక్రమ్‌ కావడంతో కాదనలేకుండా చేస్తుందని సమాచారం. 
 

55

ఇంకోవైపు విజయ్‌ దేవరకొండ-పరశురామ్‌ కాంబినేషన్‌లో సినిమా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో మొదట పూజా హెగ్డే హీరోయిన్‌ అని, `జనగణమన`లో విజయ్‌తో కలిసి నటించాల్సి ఉండగా, అది క్యాన్సిల్‌ కావడంతో ఇందులో పూజాని ఆఫర్‌ చేశాడట విజయ్‌. కానీ పాత్రకి ప్రయారిటీ లేదట. నిడివి కూడా పెద్దగా లేదని, అందుకే ఈ ప్రాజెక్ట్ కి ఆమె నో చెప్పిందని టాలీవుడ్‌ టాక్‌. దీంతో ఆమె స్థానంలో మృణాల్‌ ఠాకూర్‌ని ఎంపిక చేశారు. మూడు రోజుల క్రితం ఈ సినిమా గ్రాండ్‌గా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం పూజా చేతిలో కేవలం `గుంటూరు కారం` ఒక్కటే ఉంది. కొత్త ప్రాజెక్ట్ లకు చర్చలు జరుగుతున్నాయట. 
 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్
విజయ్ దేవరకొండ

Latest Videos
Recommended Stories
Recommended image1
విజయ్, రష్మిక వెడ్డింగ్ రిసెప్షన్ లో చిరు, కేటీఆర్, నాని, వెంకీ, నాగ్ సందడి.. టాలీవుడ్ మొత్తం తరలివచ్చిందిగా
Recommended image2
Vijay Divorce: భార్యకి విజయ్‌ రూ.250 కోట్ల భరణం.. దళపతి విడాకుల కేసులో ఊహించని ట్విస్ట్
Recommended image3
Ustaad Bhagat Singh vs Dhurandhar 2: ధురంధర్‌ 2 కూడా వాయిదా.. మార్చి 19న పవన్‌ కళ్యాణ్‌ ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved