- Home
- Entertainment
- ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్‌లలో ఉన్న తేడా అదే.. ప్రేమ, హీరోయిన్ల నెంబర్ గేమ్‌పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్
ఎన్టీఆర్, బన్నీ, ప్రభాస్‌లలో ఉన్న తేడా అదే.. ప్రేమ, హీరోయిన్ల నెంబర్ గేమ్‌పై పూజా హెగ్డే షాకింగ్ కామెంట్
ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్‌లపై బుట్టబొమ్మ పూజా హెగ్డే ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. వీరి ముగ్గురి మధ్య ఉన్న తేడా ఏంటో చెప్పింది. టాప్ స్టార్స్ తో కలిసి నటించడం పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ప్రేమ గురించి ఆసక్తికర విషయాన్ని పంచుకుంది.

పూజా హెగ్డే ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్ లతో కలిసి నటించిన విషయం తెలిసిందే. వీరి ముగ్గురిలో ఉన్న తేడాని పంచుకుంది పూజా. ఈ సందర్భంగా టాప్ స్టార్స్ తో కలిసి నటించే అవకాశం రావడం పట్ల సంతోషాన్ని పంచుకుంది. అందరు హీరోలతో తనకు మంచి కెమిస్ట్రీ కుదిరిందని చెప్పింది. అందరు హీరోలతోనూ జోడి బాగుందనే కామెంట్స్ వచ్చాయని చెప్పింది.
అయితే ఎన్టీఆర్‌పై ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించింది. ఆయన చాలా ఎనర్జిటిక్ అని, సెట్‌లో సందడిలా ఉంటుందన్నారు. కెమెరా ఆన్ అయ్యిందంటే సింగిల్ టేక్‌లో సీన్ చేసేస్తారని చెప్పింది. లాంగ్వేజ్‌పై మంచి పట్టుందని, ఆయనకు డైలాగ్స్ పై కమాండ్ ఉందని, ఏ సీన్ అయినా ఈజీగా చేసేస్తాడని చెప్పింది. అలాగే బన్నీ కూడా ఎన్టీఆర్ లాగే అని పేర్కొంది. మరోవైపు ప్రభాస్ గురించి చెబుతూ ఆయన చాలా షై పర్సన్ అని పేర్కొంది.
ప్రభాస్ కేవలం మీడియా ముందే అని, ఆయనతో ఒక్కసారి క్లోజ్ అయితే చాలా జోవియల్‌గా ఉంటారని, సరదాగా ఉంటారని తెలిపింది. `రాధేశ్యామ్` షూటింగ్ సమయంలో తనతో ఉన్న వారికి కరోనా సోకిందని, దీంతో తనకు కుకింగ్ చేయడం కష్టమైందని, దీంతో ప్రభాస్ తన ఇంట్లో వంట ప్రిపేర్ చేయించి పంపించారని తెలిపారు. చాలా దయగల గుణం ఆయనదని తెలిపింది. అయితే సినిమాలో `మీరు పెళ్లి ఎందుకు ఇంకా చేసుకోలేదనే ప్రశ్నకి ఆయన్నుంచి సమాధానం రాలేదని, రియల్ లైఫ్‌లోనూ చెప్పలేదని పేర్కొంది పూజా.
మరోవైపు తన ప్రేమ గురించి చెబుతూ, `ప్రేమించేంత టైమ్ లేదని పేర్కొంది. వరుసగా తెలుగు, తమిళం, హిందీ సినిమాలు చేస్తున్నానని, సినిమా షూటింగ్‌లతోనే బిజీగా ఉంటున్నానని ప్రేమించేందుకు సమయం దొరకలేదని, ఇంకా ఆలోచన రాలేదని పేర్కొంది. తనకు `రాధేశ్యామ్` లాంటి లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని, వాటిని బాగా ఇష్టపడతానని చెప్పింది. కాకపోతే ఈ చిత్రంలో లవ్ చాలా సీరియస్‌గా, మెచ్యూర్డ్ గా ఉంటుందని చెప్పింది పూజా.
ప్రభాస్‌తో కలిసి నటిస్తున్న `రాధేశ్యామ్` చిత్రం గురించి చెబుతూ ఇదొక డిఫరెంట్ పీరియాడికల్ లవ్ స్టోరీ అని చెప్పింది. ఇందులో ప్రేరణ పాత్ర కోసం చాలా రీసెర్చ్ చేసిందట. బుక్స్ చదివినట్టు చెప్పింది. తన పాత్రలో చాలా వేరియేషన్స్, లేయర్స్ ఉంటాయని, కెరీర్‌లోనే ఛాలెంజింగ్ రోల్ అని తెలిపింది. తన పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుందని చెప్పింది. అయితే ఈ చిత్రంతో ఓ కొత్త పూజాని చూస్తారని పేర్కొంది. ఈ సినిమా తనపై చాలా ప్రభావాన్ని చూపించిందని, మరింత స్ట్రాంగ్‌గా మార్చిందని తెలిపింది. అయితే ఇందులో పాత్ర చాలా నాటీ అని, రియల్ లైఫ్‌లో తాను నాటీ కాదని తెలిపింది.
ఆస్ట్రాలజీ గురించి చెబుతూ, తాను జ్యోతిష్యాన్ని నమ్ముతానని పేర్కొంది. రియల్ లైఫ్‌లో చాలా సార్లు జ్యోతిష్యుల వద్దకి వెళ్లానని పేర్కొంది. సినిమా ట్రైలర్‌లో షిప్ మునిగిపోయిన సీన్‌ని చూసి అంతా టైటానిక్ ఫ్లేవర్‌లో ఉంటుందని అనడం పెద్ద కాంప్లిమెంట్‌గా భావిస్తానని చెప్పింది. కానీ దానికి దీనికి సంబంధం లేదని ఓ కొత్త రకమైన కథ ఇదని తెలిపింది పూజా. ఇటీవల తనకు `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్` నుంచి కొత్తగా వస్తున్న పాత్రలన్నీ బలమైనవని, ఇలాంటి పాత్రలు రావడం అదృష్టంగా భావిస్తుందట.
టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్ గా రాణించడంపై స్పందిస్తూ, తాను నెంబర్ గేమ్ నమ్మనని, అది తాత్కాలికమని పేర్కొంది. ఎంత మంచి పాత్రలు, ఎంత మంచి సినిమాలు చేశామనేది ముఖ్యమని పేర్కొంది. ఇంతగా తనని ఆదరించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేసింది పూజా. తనపై నమ్మకంతోనే తనని పెద్ద హీరోలు, దర్శకులు, నిర్మాతలు మళ్లీ మళ్లీ తమ సినిమాకి తీసుకుంటున్నారని మహేష్, బన్నీ, త్రివిక్రమ్, దిల్ రాజు వంటి వారి ప్రొడక్షన్‌లో పనిచేయడం పట్ల వెల్లడించింది పూజా. తాను పోయెట్‌ని ఇష్టపడతానని, తెలుగు సినిమాలంటే ఇష్టమని పేర్కొంది. తెలుగులో సినిమాల కోసం బాలీవుడ్ ఆఫర్స్ ని కూడా వదులుకున్నట్టు తెలిపింది.
ఉమెన్స్ డే గురించి చెబుతూ, సినిమాల్లో మహిళా పాత్రలకు ప్రాధాన్యం పెరగాలని చెప్పింది. అదే సమయంలో ప్రతి అమ్మాయి తనని తాను ప్రేమించాలని పేర్కొంది. నటిగా తానూ తెలుగు, తమిళం, హిందీలో రాణించాలని భావిస్తున్నానని, పాన్ ఇండియా హీరోయిన్ అనే ప్రశ్నకి స్పందించింది. ప్రబాస్, పూజా జంటగా రాధాకృష్ణ దర్శకత్వం వహించిన `రాధేశ్యామ్` చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్ పతాకాలపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. కృష్ణంరాజు సమర్పణతోపాటు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర