- Home
- Entertainment
- ముంబయిలో పూజాహెగ్డే రచ్చ.. టైట్ అవుట్ ఫిట్, సన్ గ్లాసెస్ లో బుట్టబొమ్మ కిల్లింగ్ లుక్స్.!
ముంబయిలో పూజాహెగ్డే రచ్చ.. టైట్ అవుట్ ఫిట్, సన్ గ్లాసెస్ లో బుట్టబొమ్మ కిల్లింగ్ లుక్స్.!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే (Pooja Hegde) తాజాగా ముంబైలో హాట్ గా దర్శనమిచ్చింది. టైట్ ఫిట్, సన్ గ్లాసెస్ ధరించిన బుట్టబొమ్మ బిగుతైన అందాలను ప్రదర్శిస్తూ ఉక్కిరిబిక్కిరి చేసింది. లేటెస్ట్ పిక్స్ వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ గా, గ్లామర్ పరంగా పూజా హెగ్దేకు యూత్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. బుట్టబొమ్మ అందానికి కుర్రకారు ఎప్పుడో ఫిదా అయ్యారు. పూజా కూడా తన అభిమానులను ఖుషీ చేసేందుకు సినిమాల్లోనే కాకుండా ఇటు సోషల్ మీడియా ద్వారా క్రేజీగా పోస్టులు పెడుతుంటుంది. అదీగాకా ఎయిర్ పోర్ట్స్, పలు మాల్స్ లలో దర్శనమిస్తూ సర్ ప్రైజ్ చేస్తుంది.
తాజాగా పూజా హెగ్దే ముంబైలోని ఓ జిమ్ సెంటర్లో ప్రత్యక్షమైంది. ఈ సందర్భంగా బుట్టబొమ్మ జిమ్ వేర్ ధరించి బిగుతైన అందాలను ప్రదర్శించింది. టైట్ పింక్ డ్రెస్ లో స్లిమ్ ఫిట్ గ్లామర్ ను చూపిస్తూ మతిపోగొట్టింది. సన్ గ్లాసెస్ పెట్టుకొని స్టైలిష్ లుక్ ను సొంతం చేసుకుంది. పలుచటి దుస్తుల్లో బాడీ స్ట్రక్చర్ కనిపించేలా ఫొటోలకు పోజులిచ్చింది.
గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తూ వస్తున్న పూజా తన గ్లామర్ ను, ఫిట్ నెస్ ను మెయిన్ టేన్ చేసేందుకు వర్కౌట్స్ చేస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తాజాగా జిమ్ సెంటర్ కు వెళ్లింది. ఈ సందర్భంగా ఫొటోగ్రాఫర్ల కంట పడి, ఫొటోలకు క్రేజీగా పోజులిచ్చింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
పూజాను ఒక్కసారిగా ఇలా చూసిన అభిమానులు, నెటిజన్లు ఖుషీ అవుతున్నారు. బుట్టబొమ్మ అందాలకు మంత్రముగ్ధులవుతున్నారు. ఈ సందర్భంగా పూజా ఫొటోలను లైక్ చేస్తూ.. క్రేజీగా కామెంట్లు పెడుతూ వైరల్ చేస్తున్నారు. తమ అభిమాన హీరోయిన్ కు ఇంటర్నెట్ లో కావాల్సినంత మద్దతు ఇస్తున్నారు.
స్టార్ హీరోయిన్ పూజా హెగ్డేకు సౌత్ లో ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. నెమ్మదిగా తమిళం, హిందీ భాషల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటోంది. ఇప్పటికే తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ బ్యూటీ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.
బాలీవుడ్ లో గతంలోనే స్టార్ హీరో Hrithik Roshan సరసన ‘మోహంజోదారో’లో నటించిన విషయం తెలిసిందే. ఆ మూవీతోనే నార్త్ ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. ఆ తర్వాత ‘హౌజ్ ఫుల్ 4’తో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ హిందీ మూవీస్ లోనే నటిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ సరసన ‘సర్కస్’లో, బాయ్ జాన్ సల్మాన్ తో ‘కిసీ కా బాయ్ కిసీ కా జాన్’ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాలు శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ఇటీవలనే సల్మాన్ చిత్రంలో ఓషెడ్యూల్ ను కూడా పూర్తి చేసుకుంది పూజా. ఏమాత్రం గ్యాప్ లేకుండా షూటింగ్స్ లలో పాల్గొంటోంది.
మరోవైపు బుట్టబొమ్మ బెంగుళూరులో నిర్వహించిన `సైమా 2022` అవార్డు ఫంక్షన్ లోనూ సందడి చేసింది. వైట్ జబ్బల గౌనులో టాప్ షో చేస్తూ అట్రాక్ట్ చేసింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్`కిగానూ పూజా ఉత్తమ నటిగా సైమా అవార్డు దక్కించుకుంది. ఈ సందర్భంగా ఫుల్ ఖుషీ అవుతోంది.
మరోవైపు పూజా హెగ్దే చేతిలో ఇటు రెండు తెలుగు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ సరసన ‘జన గణ మన’కు ఒకే అయ్యింది. కానీ ఈ మూవీ ఆగిపోయినట్టు తెలుస్తోంది. అలాగే సూపర్ స్టార్ మహేశ్ బాబు - త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ28’లోనూ నటిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ ఇవ్వాళే ప్రారంభమైంది.