- Home
- Entertainment
- బ్లాక్ అండ్ వైట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న పూజా హెగ్దే.. క్లోజప్ ఫొటోలతో కవ్విస్తున్న బుట్టబొమ్మ..
బ్లాక్ అండ్ వైట్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న పూజా హెగ్దే.. క్లోజప్ ఫొటోలతో కవ్విస్తున్న బుట్టబొమ్మ..
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే (Pooja Hegde) లేటెస్ట్ లుక్ లో ఆకట్టుకుంటోంది. తాజాగా బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో కుర్రాళ్ల మైండ్ ను బ్లాక్ చేస్తోంది. పూజా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే తమిళ చిత్రం ‘ముగమూడి’తో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత నేరుగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో తొలిచిత్రం ‘ఒక లైలా కోసం’లో అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య సరసన నటించి ఆడియెన్స్ ను ఆకట్టుకుంది.
ఆ తర్వాత వచ్చిన ‘ముగుంద’లోనూ పూజా ట్రెడిషనల్ గానే అలరించింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో ‘డీజే’లో నటించిన పూజా ఎంతలా గ్లామర్ ఒలకబోసిందో అందరికీ తెలిసిందే. ఈ చిత్రం తర్వాత బుట్టబొమ్మ గ్లామర్ షోలో తెగ రెచ్చిపోయింది.
ఇటు సినిమాల్లోనే కాకుండా అటు పలు మ్యాగిజైన్ల కోసం హాట్ ఫొటోషూట్లు చేసి షాక్ ఇచ్చింది. ఏకంగా బికినీలో దర్శనమిస్తూ యువతను చిత్తు చేసింది. అప్పటి నుంచి వరుస ఫొటోషూట్లతో పూజా హెగ్దే నెట్టింట హల్ చల్ చేస్తూనే ఉంది.
తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో గ్లామర్ పిక్స్ ను షేర్ చేసుకుంది. స్లీవ్ లెస్ టాప్ లో బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో అట్రాక్ట్ చేస్తోంది. కెమెరాకు క్లోజ్ గా తన అందాలను చూపిస్తూ హాట్ బీట్ పెంచుతోంది. లేటెస్ట్ గా పోస్ట్ చేసిన ఈ పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి.
ముఖ్యంగా పూజా హెగ్దే ఫ్యాషన్ సెన్స్ తో నెటిజన్లను, తన అభిమానులను కట్టిపడేస్తోంది. అట్రాక్టివ్ వేర్స్ లో అదిరిపోయే ఫొటోషూట్లు చేస్తుంటుంది. అటు సినిమాల్లోనే కాకుండా.. ఇటు ఫొటోషూట్లతోనూ తన పాపులారిటీని పెంచుకుంటూ వరుస ఆఫర్లను దక్కించుకుంది.
ఇటీవల పూజాకు సరైన హిట్ పడలేదనే చెప్పాలి. ‘అలా వైకుంఠపురం, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’తో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ ‘రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య’తో ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోవడం లేదు. దీంతో తన తదుపరి చిత్రం ‘జన గన మణ’ (JGM)పై ఆశలు పెట్టుకుంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన నటిస్తోంది.