పాపం పూజా హెగ్డే... అనుకున్నదొక్కటీ.. అయ్యింది మరొక్కటి, ఆలోచనలో పడ్డ బ్యూటీ.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే.. కెరీర్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఫెయిల్యూర్ తో కెరీర్ స్టార్ట్ చేసిన బ్యూటీ.. చిన్నగా స్టార్ హీరోలతో నటిస్తూ.. సక్సెస్ ట్రాక్ ఎక్కింది. సరిగ్గా బాలీవుడ్ లో సెట్ అవుతున్నాం అనుకున్న టైమ్ కు వరుసగా మూడు సినిమాలు నిరాశపరిచాయి.

పూజా హెగ్డే కి స్టార్ డమ్ ఇచ్చింది టాలీవుడ్. ఇటు టాలీవుడ్ లో డెవలప్ అవుతూనే.. అటు బాలీవుడ్ లో కూడా అవకాశాలు అందిపుచ్చుకుంటుంది పూజా. అయితే టాలీవుడ్ నుంచి పాన్ ఇండియా సినిమాలు వరుసగా తెరకెక్కుతుండటం, ఇక్కడి స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు కమిట్ అయ్యి చేస్తుంది. ఈ సినిమాలు తన కెరీర్ గ్రోత్ కు ఉపయోగపడతాయి అనుకుంది.
ముఖ్యంగా ప్రభాస్ తో రాధేశ్యామ్, దళపతి విజయ్ తో బీస్ట్, మెగా పవర్ స్టార్ సరసన ఆచార్యలో మెరిసింది బ్యూటీ. అయితే ఈ మూడు సినిమాలు భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలవే. కాని ఈ సినిమాలు ఆ స్థాయి విజయాలు అందుకోలేదు కదా.. ప్లాప్ టాక్ ను మూటగట్టుకున్నాయి. దాంతో పూజా ఆశలు అడిఆశలే అయ్యయి.
నిజానికి ఈమూడు సినిమాలు అనుకున్న ప్లాన్ ప్రకారం బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటి ఉంటే.. పూజా హెగ్డే రేంజ్ ఓ రేంజ్ లో ఉండేది. ఇప్పటికే స్టార్స్ హీరోలకు ఓన్లీ ఆప్షన్ గా ఉన్న భామకు అటు బాలీవుడ్ లో కూడా ఈ ఇమేజ్ గట్టిగా ఉపయోగపడేంది. మరీ ముఖ్యంగా రాధేశ్యామ్ కనుక ట్రిపుల్ ఆర్ అంతం కాకపోయినా. అందులో కొంతైనా హిట్ టాక్ తెచ్చుకుని ఉంటే పూజాకి ఈ ఇబ్బందులు ఉండేవి కాదు.
ఇటు తమిళ స్టార్ హీరో విజయ్ తో పాటు టాలీవుడ్ మెగా హీరోలు చిరు, చరణ్ కలసి నటించిన ఆచార్య సినిమా కూడా పూజాని నిరాశపరిచాయి. భారీ రేంజ్ లో డీటీఎస్ మోత మోగించాల్సిన సినిమాలు ప్లాప్ టాక్ ను మూటగట్టుకోవడంతో పూజాని ఐరన్ లెగ్ అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
ఈ మూడు ప్లాప్ ల నుంచి బయట పడాలి అంటే పూజాహెగ్డే కు సాలిడ్ హిట్ కావాలి. ప్రస్తుతం ఆమెఖాతాలో ఇప్పట్లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమాలేమీ లేవు. హిందీలో రణ్ వీర్ సింగ్ తో సర్కస్ సినిమాలో చేస్తోంది పూజా తెలుగులో ఎఫ్3 మూవీలో ఐటమ్ సాంగ్ చేసింది. ఈ నెల చివరలో ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన మరో సారి మెరవబోతోంది పూజా హెగ్డే. మహర్షి సినిమాతో సూపర్ సక్సెస్ చూసిన పూజా... త్రివిక్రమ్ డైరెక్షన్ లో మహేష్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయ్యింది. ఇక ఈసినిమా స్టార్ట్ అయ్యి.. రిలీజ్ అయ్యి హిట్ అయితే కాని అమ్మడిమనసు కొంచెం కుదుట పడే అవకాశం ఉండదు.