- Home
- Entertainment
- బెడ్ పైన పూజాహెగ్డేని ముద్దులతో ముంచెత్తిన ఫ్రెండ్... అచ్చం కుక్క లాగానే అంటూ.. బుట్టబొమ్మ ఏంటీపని?
బెడ్ పైన పూజాహెగ్డేని ముద్దులతో ముంచెత్తిన ఫ్రెండ్... అచ్చం కుక్క లాగానే అంటూ.. బుట్టబొమ్మ ఏంటీపని?
బుట్టబొమ్మ పూజా హెగ్గే వరల్డ్ టూర్‌లో బిజీగా గడుపుతుంది. వెకేషన్ ఎంజాయ్‌చేస్తూనే చిలిపి పనులు చేస్తుంది. తాజాగా ఆమె పంచుకున్న బెడ్ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది.

పూజా హెగ్డే(Pooja Hegde)కి చాలా రోజుల తర్వాత బ్రేక్ దొరికింది. వరుస షూటింగ్‌లతో బిజీగా ఉన్న ఆమె ఇటీవల అన్ని సినిమాల నుంచి బ్రేక్ దొరకడంతో వెకేషన్‌కి చెక్కేసింది. గత కొన్ని రోజులుగా ఆమె ఫారెన్(Pooja Hegde Vacation) టూర్‌లోనే ఉండటం విశేషం. తాజాగా అక్కడ నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. మొన్నటి వరకు లండన్ టూర్ ఎంజాయ్ చేసిన ఈబ్యూటీ, ఇప్పుడు అమెరికా వెళ్లింది.
తాను లండన్ వెకేషన్ పూర్తి చేసుకుని అమెరికా వెళ్తున్నట్టు పేర్కొంది పూజా హెగ్డే. ఈ సందర్భంగా ఫ్లైట్‌లో దిగిన ఓ ఫోటోని పంచుకుంది. చిలిపి నవ్వులతో కొంటెగా హంట్ చేస్తుంది పూజా. ప్రస్తుతం ఈ పిక్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ఇన్‌స్టా రీల్‌లో ఓ షాకింగ్ వీడియో షేర్‌చేసింది పూజా హెగ్డే. బెడ్‌పై ఆమె పడుకున్న ఉన్న వీడియో అది. అందులో దుప్పటి కప్పుకుని వెచ్చదనాన్ని ఆస్వాధిస్తుంది. ఈ వీడియో ఇప్పుడు హాట్ టాపిక్ అవుతుంది. కానీ అందులో పూజా తన ఫ్రెండ్‌తో కలిసి ఉండటం.
ఈ వీడియోలో బుట్టబొమ్మ పడుకుని ఉండగా, ఆమె ఫ్రెండ్ మాత్రం ముద్దులతో రెచ్చిపోయింది. అయితే అవి రొమాంటిక్ ముద్దుల్లా ఉండటంతో నెటిజన్లు, ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. కానీ పూజా మాత్రం తన ఫ్రెండ్‌ని కుక్కతో పోల్చడం గమనార్హం. కుక్కలా తనకు ముద్దులు పెడుతుందంటూ హాట్ కామెంట్ చేసింది. దీంతో ఇప్పుడిది రచ్చ రచ్చ చేస్తుంది.
పూజా హెగ్డే ఇలా ఫ్రెండ్‌తో కలిసి బెడ్ షేర్ చేసుకుని ఇలా ముద్దులతో రెచ్చిపోవడంతో అభిమానులను కలవరానికి గురి చేస్తుంది. ఏదేదో ఊహించుకుంటూ నెట్టింట పోస్ట్ లతో రెచ్చిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఇస్టా వీడియోని వైరల్ చేస్తున్నారు. దీంతో నెట్టింట పూజా హంగామా నడుస్తుందని చెప్పొచ్చు.
పూజా హెగ్డే ప్రస్తుతం టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉంది. దీనిపై అభిమానులు, నెటిజన్లు స్పందిస్తూ, పూజా ఏంటీ పని అంటున్నారు. ఇలాంటి స్థితిలో నిన్ను చూస్తామనుకోలేదని, హార్ట్ బ్రేక్ అయినంత పనైందంటున్నారు. బెడ్‌పై రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్ అని రకరకాల కామెంట్లతో రచ్చ చేస్తున్నారు.
టాలీవుడ్‌లో గోల్డెన్ లెగ్‌గా పాపులర్ అయిన పూజా హెగ్డే ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉంది. అన్నీ పాన్ ఇండియా రేంజ్ స్టార్ హీరోల సినిమాలే కావడం విశేషం. తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్ సినిమా చేస్తుంది. ఈ సినిమా ఆగస్ట్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. `మహర్షి` తర్వాత మహేష్‌తో, `అరవింద సమేత`, `అలవైకుంఠపురములో` తర్వాత త్రివిక్రమ్ డైరెక్షన్‌లో పూజా నటిస్తున్న చిత్రమిది.
దీంతోపాటు విజయ్ దేవరకొండతో `జనగణమన` చిత్రంలో నటిస్తుంది. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలున్నాయి. మరోవైపు పవన్‌తోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. ఇది ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియదు. అలాగే హిందీలో సల్మాన్ ఖాన్‌తో జోడీ కట్టింది బుట్టబొమ్మ. `కభీ ఈద్ కభీ దివాళీ` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమాలన్ని గ్యాప్ తీసుకున్నాయి.
దీంతో పూజాకి ఫ్రీ టైమ్ దొరికింది. దీన్ని ఇలా వెకేషన్ కోసం వాడుకుంటోంది. నాన్ స్టాప్‌గా ఎంజాయ్ చేస్తుంది. పూజా ఫారెన్ టూర్ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. చివరగా పూజా `ఆచార్య`, `బీస్ట్`, `రాధేశ్యామ్` చిత్రాల్లో మెరిసింది. అయితే ఈ మూడు సినిమాలు పరాజయం చెందడం గమనార్హం.