థళపతి విజయ్ కి ఝలక్ ఇచ్చిన పూజా హెగ్డే.. ఒక్క దెబ్బతో ఇంటర్నెట్ మొత్తం షేకింగ్
పూజా హెగ్దే ప్రస్తుతం విజయ్‌తో కలిసి `జన నాయకుడు` చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదలయ్యింది. ఇందులో పూజా.. విజయ్ ని డామినేట్ చేయడం విశేషం

డాన్స్ తో ఇంటర్నెట్‌ని షేక్ చేస్తోన్న పూజా హెగ్డే
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఈ ఏడాది మూడు సినిమాలతో మెరిసింది. రెండు చిత్రాల్లో(దేవా, రెట్రో) హీరోయిన్‌గా నటించగా, మరో మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది. రజనీకాంత్ `కూలీ`లో ఆమె స్పెషల్ సాంగ్‌లో మెరిసిన విషయం తెలిసిందే. `మోనికా` అంటూ ఉర్రూతలూగించింది. ఆ పాట విపరీతంగా ఆకట్టుకుంది. చాలా రోజులపాటు ఇందులో పూజా స్టెప్పులు, ఆమెతోపాటు సౌబిన్ డాన్స్ వైరల్‌గా మారింది. ఇక ఇప్పుడు మరో పాటతో దుమ్మురేపుతోంది పూజా హెగ్దే. దళపతి విజయ్‌తో కలిసి అదిరిపోయే స్టెప్పులేసింది. తాజాగా ఆమె డాన్స్ క్లిప్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
విజయ్‌తో `జన నాయకుడు`లో పూజా రొమాన్స్
పూజా హెగ్డే తాజాగా దళపతి విజయ్‌తో కలిసి `జన నాయకుడు` చిత్రంలో నటిస్తోంది. మమితా బైజు మరో హీరోయిన్. హెచ్ వినోద్ దర్శకత్వంలో ఈ చిత్ర రూపొందుతుంది. కేవీఎన్ ప్రొడక్షన్ నిర్మిస్తోంది. ప్రస్తుతానికి విజయ్ నటిస్తోన్న చివరి చిత్రమిదే. ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో ఈ సినిమా తర్వాత విజయ్ పూర్తిగా రాజకీయాలపై ఫోకస్ పెట్టబోతున్నారు. దీంతో ఈ సినిమా చేస్తున్నారు. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నారు దర్శకుడు వినోద్. ఇందులో విజయ్‌తో రొమాన్స్ చేస్తోంది పూజా.
దళపతి కచేరిలో పూజా డాన్సుల అరాచకం
ఈ నేపథ్యంలో తాజాగా ఈ మూవీని ఫస్ట్ సాంగ్ వచ్చింది. `దళపతి కచేరి` పేరుతో ఈ పాట సాగింది. తాజాగా శనివారం ఈ పాటని విడుదల చేశారు. ఇది అదిరిపోయే డాన్స్ నెంబర్ కావడం విశేషం. ఇందులో విజయ్ తో కలిసి పూజా హెగ్డే స్టెప్పులేసింది. అదరగొట్టింది. బెసిక్‌గా విజయ్ మంచి డాన్స్. కోలీవుడ్ లోనే బెస్ట్ డాన్సర్ అంటుంటారు. ఈ నేపథ్యంలో ఈ పాటలో మాత్రం విజయ్‌ని పూజా డామినేట్ చేసింది. ఆమె గ్రీన్ శారీ కట్టి వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. ఆయా డాన్స్ వీడియో క్లిప్పులను షేర్ చేస్తూ నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ నెట్టింట రచ్చ చేస్తున్నారు. పూజా గ్లామర్ సైడ్‌ని ఆవిష్కరిస్తూ ఇది ఆరాచకం అని, ఇది సంభవం అని అంటూ కామెంట్లు చేస్తున్నారు. పూజా అందాలకు ఫిదా అయిపోతున్నారు.
మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పూజా
దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో పూజా రచ్చ వేరే లెవల్ అని చెప్పొచ్చు. ఇంటర్నెట్ మొత్తాన్ని ఆమె డామినేట్ చేస్తుంది. అందరి చూపు తనవైపు తిప్పుకుంటోంది. అదే సమయంలో ఒక్కసారిగా వార్తల్లో నిలుస్తోంది. ఒకప్పుడు యాక్టివ్‌గా ఉన్న పూజా, ఇప్పుడు అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. ఉందా లేదా అనేట్టుగానే ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా `దళపతి కచేరి` పాటతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. `మోనిక` తర్వాత మరోసారి ఆమె వైరల్ కంటెంట్‌గా మారడం విశేషం. మరోసారి పూజా హాట్ టాపిక్‌గా మారిపోయింది.
తెలుగుకి దూరమవుతున్న పూజా హెగ్డే
ఇక పూజా తెలుగులో సినిమాలు చేసి చాలా రోజులే అవుతుంది. ఆమె చివరగా `ఆచార్య`లో నటించింది. ఆ తర్వాత తెలుగు సినిమాలు చేయలేదు. ఇప్పుడు ఎక్కువగా తమిళంలోనే మూవీస్ చేయడం విశేషం. ప్రస్తుతం ఆమె విజయ్‌తో `జననాయకుడు`తోపాటు `కాంచన 4`లో నటిస్తోంది. హిందీలో ఓ మూవీ చేస్తోంది. దీంతోపాటు తెలుగు లో దుల్కర్ సల్మాన్‌కి జోడీగా ఓ సినిమా చేస్తూ బిజీగా ఉంది. ఈ సారి విజయ్ మూవీతో బౌన్స్ బ్యాక్ కావాలని చూస్తోంది. మరి అవుతుందా లేదా? అనేది చూడాలి.