- Home
- Entertainment
- శోభన్ బాబు ఈ నటుడిని తలచుకుని ఇంటర్వ్యూలో కన్నీళ్లు.. కఠినమైన సోగ్గాడు కూడా కరిగేది ఎవరికి
శోభన్ బాబు ఈ నటుడిని తలచుకుని ఇంటర్వ్యూలో కన్నీళ్లు.. కఠినమైన సోగ్గాడు కూడా కరిగేది ఎవరికి
శోభన్ బాబు ఓ అరుదైన ఇంటర్వ్యూలో కన్నీళ్లు పెట్టుకున్నారు. తన అభిమాన హీరోని గుర్తు చేసుకుని ఏడ్చారు. ఆయన వల్ల ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నట్టు తెలిపారు. మరి ఆయన ఎవరు?

సిస్టమాటిక్ లైఫ్‌కి కేరాఫ్ శోభన్ బాబు
సోగ్గాడు శోభన్ బాబు సిస్టమాటిక్ లైఫ్‌కి కేరాఫ్. సినిమాని, పర్సనల్ లైఫ్‌ని ఎప్పుడూ మిక్స్ చేయలేదు. ఆయన ఫ్యామిలీ ఎవరో కూడా ఇప్పటి వరకు బయటకు రాలేదు. చాలా ఏళ్ల తర్వాత ఆడపాదడపా ఆయన కొడుకు బయటకు వచ్చారు. ఇప్పుడు ఆయన మనవడు కనిపిస్తున్నారు. అయితే శోభన్ బాబు ఇంతటి సిస్టమాటిక్‌గా మారడానికి, వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ విషయాలకు సంబంధించి కఠినంగా, నిబద్ధతతో, క్రమశిక్షణగా ఉండటానికి కారణం మరో నటుడు కావడం విశేషం. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే సోగ్గాడు నటుడిగా ఎదిగారు. సినిమాల్లో రాణించారు.
ఎన్టీఆర్‌ని గురువుగా భావించారు సోగ్గాడు
శోభన్ బాబుని ప్రభావితం చేసిన నటుడు ఎవరో కాదు లెజెండరీ యాక్టర్ ఎన్టీఆర్. నట సార్వభౌముడిగా రాణించిన ఆయన తెలుగు సినిమాని ప్రభావితం చేశారు. తెలుగు సినిమాకి ఒక గుర్తింపుని తీసుకొచ్చారు. తెలుగు సినిమా హైదరాబాద్‌కి రావడంలో కీలక పాత్ర పోషించారు. తెలుగు వారికి ఒక గౌరవాన్ని తీసుకోవడంలో ఆయన పాత్ర ఎంతో ఉందని చెప్పొచ్చు. ఆయన్ని ఆదర్శంగా తీసుకునే సినిమాల్లోకి వచ్చారు శోభన్ బాబు. ఎన్టీఆర్ కూడా ప్రారంభంలో సోగ్గాడిని ఎంకరేజ్ చేశారు. అవకాశాలు కల్పించారు. ధైర్యాన్నిచ్చారు. అనేక విధాలుగా ప్రోత్సహించారు. దీంతో రామారావుని ఎప్పుడూ గురువుగా భావిస్తారు శోభన్ బాబు.
శోభన్ బాబు ఇంట్లో ఎన్టీఆర్ ఫోటో
సినిమాల్లోకి వచ్చిన ప్రారంభం నుంచి తనని ప్రోత్సహించిన నటుడిగా ఎన్టీఆర్‌పై ప్రత్యేకమైన ఆరాధన భావం ఉంటుంది సోగ్గాడిలో. అంతేకాదు తన ఇంట్లో ఎన్టీఆర్ ఫోటోని పెట్టుకుని కొలుస్తుంటారు. ఆయన ఫోటో చూసిన తర్వాతనే ఏ పని అయినా చేస్తానని తెలిపారు. ఓ సందర్భంలో ఎన్టీఆర్ గురించి సోగ్గాడు స్పందించారు. ఆయన గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. ఇంటర్వ్యూలోనే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈటీవీకి అప్పట్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో సోగ్గాడు కన్నీళ్లు పెట్టుకోవడం విశేషం. ఎంతో కఠినంగా ఉండే శోభన్ బాబు కూడా ఎన్టీఆర్ విషయంలో ఎమోషనల్ కావడం ఆశ్చర్యపరుస్తోంది.
ఎన్టీఆర్‌ని తలుచుకుని కన్నీళ్లు పెట్టుకున్న శోభన్ బాబు
ఎన్టీఆర్ మహానుభావుడు అని, తనని ప్రారంభంలో ఎంతో ప్రోత్సహించారని, ఆయన సినిమాల్లో చాలా పాత్రలను తనకు ఇచ్చారని తెలిపారు. ఆయన సినిమాల్లోనే కాదు, ఇతర సినిమాల్లోనూ రికమండ్ చేశారని తెలిపారు శోభన్ బాబు. ఓ మూవీలో ఆయనకు ఒక పాట ఉంటే, తనకు రెండు డ్యూయెట్లు ఇచ్చారట. బేసిక్‌గా మెయిన్ హీరో ఉన్నప్పుడు ఆయనకు కాకుండా ఇతర హీరోలకు పాటలు, ఫోకస్ అయ్యేలాంటి పాత్రలు ఇవ్వడం జరగదు. ఎవరూ అలాంటిది చేయరు. కానీ ఎన్టీఆర్ చేశారు. ఇలా ఆయన ఎవరినైనా ప్రోత్సహిస్తుంటారు. అందులో తనని బాగా చూసుకునేవారని తెలిపారు శోభన్ బాబు. ఈ క్రమంలో అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం బాధాకరం అంటూ శోభన్ బాబు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇంటర్వ్యూలో ఆయన ఏడుపు ఆపుకోలేకపోయారు. ఈ అరుదైన వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. అయితే ఇది ఏ సందర్భంలోనిది అనేది క్లారిటీ లేదు. ఎన్టీఆర్ మరణం సమయంలో స్పందించిందా అనేది స్పష్టత లేదు.
సోగ్గాడిగా మహిళా అభిమానుల హృదయాలను గెలుచుకున్న శోభన్ బాబు
శోభన్ బాబు ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చారు. హీరోగా ఎదిగారు. ప్రారంభంలో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఎన్నో అవమానాలు ఫేస్ చేశారు. చిన్న చిన్న వేషాలు వేస్తూ రాణించారు. నెమ్మదిగా నటుడిగా నిరూపించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు వంటి వారి సినిమాల్లో నటిస్తూ వచ్చారు. సోలో హీరోగా, అట్నుంచి స్టార్ హీరోగా ఎదిగారు. కుటుంబ కథా చిత్రాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి దగ్గరయ్యారు. `బంగారు పంజరం`, `సీతారామ కళ్యాణం`, `మహామంత్రి తిమ్మరుసు`, `లవకుశ`, `నర్తనశాల`, `దేశమంటే మనుషులోయ్`, `వీరాభిమాన్యు`, `మనుషులు మారాలి`, `కళ్యాణమండపం`, `చెల్లెలి కాపురం`, `సంపూర్ణ రామాయణం`, `శారద`, `మంచి మనుషులు`, `జీవన జ్యోతి`, `సోగ్గాడు`, `కురుక్షేత్రం`, `మల్లెపువ్వు`, `గోరింటాకు`, `కార్తీకదీపం`, `మోసగాడు`, `దేవత`, `ముందడుగు` తెలుగు ఆడియెన్స్ ని అలరించారు. వారికి దగ్గరయ్యారు. సోగ్గాడిగా అభిమానుల హృదయాల్లో నిలిచిపోయారు.