- Home
- Entertainment
- పూజా హెగ్డే డేరింగ్ డెసీషన్.. బోల్డ్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్..? బాధ్యత మొత్తం ఆమెదే..
పూజా హెగ్డే డేరింగ్ డెసీషన్.. బోల్డ్ రోల్‌కి గ్రీన్ సిగ్నల్..? బాధ్యత మొత్తం ఆమెదే..
పూజా హెగ్డే కి తెలుగులో ఆఫర్లు లేవు. ఆమెకి ఉన్న సినిమాలు కూడా పోయాయి. దీంతో ఈ ఏడాది ఈ అమ్మడు కనిపించనే లేదు. దీంతో ఓ సంచలన నిర్ణయం తీసుకుందట.

మొన్నటి వరకు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఉంది పూజా హెగ్డే. వరుస హిట్లు, వరుసగా స్టార్ హీరోలతో సినిమాలతో ఆమె కెరీర్ బ్రేకులు లేని బుల్లెట్‌లా దూసుకుపోతుంది. స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్ అనిపించింది. నిర్మాత దిల్‌రాజు ఏకంగా `బీస్ట్` ఈవెంట్‌లోనే ఈ విషయాన్ని ప్రకటించాడు. వరుస హిట్లతో ఉంది. ఆ సినిమా కూడా హిట్ అన్నాడు. కానీ అది పోయింది. ఆ తర్వాత `రాధేశ్యామ్` పోయింది. `ఆచార్య` నిరాశ పరిచింది. హిందీలో సల్మాన్‌తో చేసిన మూవీ పోయింది. రణ్‌వీర్ సింగ్ `సర్కస్` బోల్తా కొట్టింది. ఇలా బ్యాక్ టూ బ్యాక్ ఐదు సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.
ఒక్కసారిగా పూజా హెగ్డే కెరీర్ తల క్రిందులైంది. అప్పటి వరకు తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఉన్న పూజా గ్రాఫ్ ఒక్కసారిగా పడిపోయింది. చిత్ర పరిశ్రమలో సక్సెస్ మాట్లాడుతుంది. సక్సెస్ ఉన్న వాళ్ల వెంటే ఇండస్ట్రీ పరిగెడుతుంది. హీరోలకు వరుసగా ఐదారు సినిమాలు పోయినా పెద్దగా నష్టం ఉండదు. కానీ హీరోయిన్లకి మాత్రం ఇప్పుడు చాలా కీలకంగా మారుతున్నాయి. సక్సెస్‌ని బట్టే ఆఫర్లు వస్తుంటాయి.
పూజా హెగ్డేకి వరుసగా సినిమాలు పరాజయం చెందడంతో మేకర్స్ యూ టర్న్ తీసుకున్నారు. ఆమెకి ఇచ్చిన ఆఫర్లు కూడా కాన్సిల్ చేసుకున్నారు. అలా `గుంటూరు కారం` నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇంకా చెప్పాలంటే తప్పించారని సమాచారం. మరోవైపు పవన్ కళ్యాణ్‌తో చేయాల్సిన `ఉస్తార్ భగత్ సింగ్` నుంచి కూడా ఆమెని తొలగించారు. ఇలా రెండు భారీ సినిమా ఆఫర్లని కోల్పోయింది పూజా హెగ్డే. సాయిధరమ్ తేజ్‌తో `గంజా శంకర్`లో ఎంపికైందన్నారు. దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమా ప్రారంభం కావడానికి ఇంకా టైమ్ ఉంది. హిందీలో షాహిద్ కపూర్‌తో `దేవా` సినిమా చేస్తుంది పూజా.
ఇదిలా ఉంటే తాజాగా ఆమె ఓ డేరింగ్ డెసీషన్ తీసుకుంది. అప్పుడే తన రూట్ మారుస్తుంది. బోల్డ్ సినిమాలు చేసేందుకు, బోల్డ్ రోల్స్ చేసేందుకు రెడీ అవుతుంది. అంతేకాదు లేడీ ఓరియెంటెడ్ మూవీస్ చేసేందుకు రెడీ కావడం విశేషం. తమిళ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో ఈ మూవీ రూపొందుతుంది. గతంలో ఆయన `కోబ్రా`, `డిమాంటే కాలనీ` చిత్రాలను రూపొందించారు. ఇందులో పూజా హెగ్డే పాత్ర చాలా బోల్డ్ గా, రస్టిక్‌గా ఉంటుందట. డైరెక్ట్ ఓటీటీలో ఈ సినిమా రాబోతుందట.
ఇప్పటి వరకు గ్లామర్ పాత్రలే చేసింది పూజా. కమర్షియల్ సినిమాలు చేసింది. అందచెందాలతో ఆకట్టుకుంటుంది. కమర్షియల్ హీరోయిన్‌గా మెప్పించింది. కానీ ఇప్పుడు నటనతో అలరించేందుకు రెడీ అవుతుంది. దీనికితోడు ఇప్పటి వరకు చేయనటువంటి ఓ కొత్త తరహా పాత్రలో కనిపించబోతుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని తెలుస్తుంది. మరి గ్లామరస్ హీరోయిన్‌గా మెప్పించిన పూజా.. లేడీ ఓరియెంటెడ్ కథతో, పైగా బోల్డ్ రోల్‌తో ఎలా మెప్పిస్తుందో చూడాలి. ఓ రకంగా ఇది పూజాకి సవాల్‌తో కూడిన సాహసోపేతమైన విషయమనే చెప్పాలి.