- Home
- Entertainment
- క్రిస్మస్ వేడుకలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే .. సిగ్గులొలికిస్తూ కట్టిపడేస్తున్న ప్రభాస్ హీరోయిన్
క్రిస్మస్ వేడుకలో హాట్ బ్యూటీ పూజా హెగ్డే .. సిగ్గులొలికిస్తూ కట్టిపడేస్తున్న ప్రభాస్ హీరోయిన్
బుట్టబొమ్మ పూజా హెగ్డే కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్. ఎంతో మంది అభిమానులు పూజా అందాలకు ఫిదా అయిపోయారు. బన్నీ చెప్పిన డైలాగ్‌లతో ఒక్కసారిగా సెన్సేషనల్ హీరోయిన్‌గా మారిన పూజా హెగ్డే క్రిస్మస్ పండుగని సెలబ్రేట్ చేసుకునింది. ఆయా ఫోటోలను అభిమానులతో పంచుకుంది.

పూజా హెగ్డే(Pooja Hegde) క్రిస్మస్‌సందర్భంగా తన ఇంట్లో క్రిస్మస్ చెట్టుని డెకరేట్ చేసుకుంది. చెట్టు దగ్గర కూర్చొని తాను దిగిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది పూజా. ప్రస్తుతం ఆ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముసి ముసి నవ్వులతో ఆకట్టుకుంటుంది పూజా హెగ్డే. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తుంది.
Pooja Hegde ప్రస్తుతం టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. ఇంకా చెప్పాలంటే నెంబర్ వన్ హీరోయిన్. ఆమె పొజిషీయన్ టాప్‌లో ఉండటం విశేషం. గతేడాది `అల వైకుంఠపురములో` సక్సెస్‌తో ఆమె తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
ఇందులో అల్లు అర్జున్ ఆమెని కాళ్లపై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. `నీ కాళ్లని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్లు ` అంటూ ఏకంగా ఓ డ్యూయెట్ కూడా పాడుకున్నారు. ఇది సినిమాలోనే హైలైట్‌గా నిలిచింది.
దీంతో ఆ తర్వాత నుంచి పూజా కాళ్లు చాలా ఫేమస్ అయిపోయాయి. కొన్ని సినిమాల్లో ఆమె కాళ్లపై దర్శకులు సెటైర్లు వేసిన సందర్బాలు కూడా ఉండటం విశేషం. మొత్తంగా తన థైస్ హాట్ సెన్సేషనల్‌గా మారడం విశేషం.
పూజా హెగ్డే ప్రస్తుతం `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది. ఇటీవల రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ప్రీ రిలీజ్‌లో శారీలో స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది పూజా హెగ్డే. ప్రభాస్ ఫ్యాన్స్ ని కనువిందు చేసింది.
మరోవైపు బ్యాక్ టూ బ్యాక్ పలు భారీ చిత్రాల్లో భాగమవుతుంది పూజా హెగ్డే. మహేష్‌తో మరోసారి సినిమా చేస్తుంది. `మహర్షి` చిత్రంలో ఇద్దరు జోడీ కట్టారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ ఓసినిమా చేస్తున్నారు. ఇది త్వరలోనే పట్టాలెక్కబోతుంది. ఇందులో కథానాయికగా పూజా ఎంపికైంది.
దీంతోపాటు పవన్ కళ్యాణ్‌తో `భవదీయుడు భగత్‌సింగ్` చిత్రంలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యిందని టాక్. చిత్ర దర్శకుడే ఈ విషయాలను ఓ ఈవెంట్‌లో వెల్లడించారు. మరోవైపు బన్నీతోనూ మరో సినిమా చేయబోతుంది. ఇప్పటికే ఆమె `డీజే`, `అల వైకుంఠపురములో` చిత్రంలో నటించింది. త్వరలో హ్యాట్రిక్ హిట్ కొట్టబోతుంది.
also read: పైట చాటు నుండి నెలవంకలా తొంగి చూస్తున్న నడుము.. లంగా ఓణీలో అసలైన అందాలు చూపిస్తున్న దీపికా పిల్లి