- Home
- Entertainment
- Pooja Hegde: దళపతి విజయ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. పూజా హెగ్డేకి చెప్పకుండా ఏం చేశాడంటే..
Pooja Hegde: దళపతి విజయ్ లో ఈ యాంగిల్ కూడా ఉందా.. పూజా హెగ్డేకి చెప్పకుండా ఏం చేశాడంటే..
ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి.

beast
ఇలయ తలపతి విజయ్ నటించిన బీస్ట్ చిత్రం ఏప్రిల్ 13న గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసింది. ట్రైలర్ యాక్షన్స్ సీన్స్ అదిరిపోయేలా ఉన్నాయి. విజయ్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ అండ్ స్టైలిష్ పెర్ఫామెన్స్ తో ఆకట్టుకుంటున్నాడు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి.
beast
సాధారణంగా విజయ్ మీడియా ముందు కనిపించేది తక్కువ. ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడారు. ఈ విషయంలో విజయ్, పవన్ కళ్యాణ్ దాదాపుగా ఒకేలా ఉంటారని చాలా మంది అభిమానులు అభిప్రాయ పడుతుంటారు. కానీ విజయ్ ప్రస్తుతం బీస్ట్ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.
beast
పార్టీలు, ఫంక్షన్స్ లాంటి కార్యక్రమాలకు కూడా విజయ్ దూరంగా ఉంటారు. సెట్స్ లో తన పని తాను చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతారని వినికిడి. కానీ తన విషయంలో విజయ్ ప్రవర్తించిన విధానం ఆశ్చర్యంలో ముంచెత్తిందని పూజా హెగ్డే అంటోంది.
beast
నా బర్త్ డే రోజున విజయ్ సర్ సర్ ప్రైజ్ చేశారు. నాకు తెలియకుండానే బర్త్ డే పార్టీ ఏర్పాటు చేశారు. విజయ్ సర్ జరిపించిన ఆ బర్త్ డే నా కెరీర్ లోనే చాలా స్పెషల్ అంటూ పూజా హెగ్డే తెలిపింది.
Beast
విజయ్ సర్ తో నటించడం నా కల. ఆ కల బీస్ట్ మూవీతో నెరవేరింది అని పేర్కొంది. ఇక అరబిక్ కుతు సాంగ్ తో తనకు వరల్డ్ వైడ్ గా పాపులారిటీ దక్కింది అంటూ పూజా హెగ్డే సంబరపడిపోతుంది.
beast
టెర్రరిస్ట్ హైజాక్ నేపథ్యంలో బీస్ట్ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రంలో విజయ్ ఆర్మీ కమాండర్ గా నటిస్తున్నారు. నెల్సన్ దిలీప్ కుమార్ తనదైన శైలిలో అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో బీస్ట్ మూవీ తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పాన్ ఇండియా మూవీగా హిందీలో కూడా రిలీజ్ అవుతోంది.