MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • `నేను బతికే ఉన్నా, నాకు ఆఫర్లు ఇవ్వండి`.. `పోకిరి` నటుడు కామెంట్స్ వైరల్‌.. విషయం ఏంటంటే?

`నేను బతికే ఉన్నా, నాకు ఆఫర్లు ఇవ్వండి`.. `పోకిరి` నటుడు కామెంట్స్ వైరల్‌.. విషయం ఏంటంటే?

`పోకిరి` నటుడు ఆశిష్‌ విద్యార్థి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు సినిమా అవకాశాల విషయంలో ఆయన హాట్‌ కామెంట్‌ చేశారు.  

2 Min read
Author : Aithagoni Raju
| Updated : Mar 24 2024, 04:52 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

`పోకిరి` సినిమాతో పాపులర్‌ అయ్యాడు ఆశిష్‌ విద్యార్థి. అంతకు ముందు తెలుగులో సినిమాలు చేసినా, ఈ మూవీ ఆయనకు బ్రేక్‌ ఇచ్చింది. తెలుగులో ఆయనకు రాచబాట వేసింది. ఆ తర్వాత బిజీ అర్టిస్ట్ అయ్యారు. హిందీతోపాటు తెలుగులోనూ ఎక్కువగా సినిమా చేస్తూ రాణించారు. ఇటీవల ఆయన తెలుగులకి దూరమయ్యారు. చాలా రేర్‌గా సినిమాలు చేస్తున్నారు. 

Survey:వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

అయితే ఆయన ఇతర భాషల్లో బిజీగా ఉన్నాడని అనుకుంటున్నారు. కానీ ఇతర భాషల్లో కూడా అడపాదడపానే మెరుస్తున్నారు. ఆయన రేంజ్‌ పాత్రలో రావడం లేదు. కాసేపు అలా మెరిస్తున్నారు తప్ప, బలమైన పాత్రలు దక్కడం లేదు. తెలుగులో అయితే ఆశిష్‌ విద్యార్థిని మర్చిపోయారా అనే పరిస్థితి. చివరగా ఆయన `రైటర్‌ పద్మభూషణ్‌` చిత్రంలో నటించారు. కొత్తగా మరే సినిమా లేదు. 
 

37

ఈ నేపథ్యంలో ఆశిష్‌ విద్యార్థి కామెంట్స్ ఇప్పుడు వైరల్‌ అవుతున్నాయి. ఆయన ఆ మధ్య ఓ ఇంటర్వ్వూలో మాట్లాడుతూ, తాను బతికే ఉన్నాను. తనని కూడా గుర్తించండి, ఆఫర్లు ఇవ్వండి అంటూ కామెంట్లు చేశారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. హాట్‌ టాపిక్ అయ్యాయి. ఒకప్పుడు మంచి పాత్రలు చేసి మెప్పించిన ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనేది ఆశ్చర్యపరిచింది. 
 

47

అందరిని ఈ వ్యాఖ్యలు ఆలోచింప చేశాయి. అనంతరం మరో ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలపై ఆశిష్‌ విద్యార్థి స్పందించారు. తాను ఎన్నో సినిమాల్లో ఎన్నో మంచి పాత్రలు చేశాను. బలమైన రోల్స్ చేశాను, తనని అలానే చూస్తున్నారు. అలాంటి పాత్రలే ఆఫర్‌ చేస్తున్నారు. కానీ నేను వేరే పాత్రలు కూడా చేయగలను. డిఫరెంట్‌గా ఏదైనా చేయగలను. తనని ఆ కోణంలో కూడా చూడాలి, అలాంటి పాత్రలు కూడా రాయాలనే అనే ఉద్యేశ్యంలో ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. 

57

తనకు కొత్తగా చాలా పాత్రలు చేయాలని ఉంటుందని, అలాంటివి ఆఫర్‌ చేయడం లేదని, అందుకు వారికి గుర్తు చేయాలనే ఉద్దేశ్యంలో ఈ కామెంట్స్ చేసినట్టు తెలిపారు. రెగ్యూలర్‌ పాత్రలు చేయడం ఇష్టం లేదని, తనలోని మరో కోణాన్ని చూపించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఆ దిశగా మేకర్స్ ప్లాన్‌ చేయాలని, పాత్రలు రాస్తారనే ఉద్దేశ్యంలో ఆ వ్యాఖ్యలు చేసినట్టు తెలిపారు. ప్రతి నటుడు ఎప్పటికప్పుడు అడుక్కుంటూనే ఉండాలని, అలా చేయకపోతే అక్కడే ఆగిపోతారని తెలిపారు ఆశిష్‌ విద్యార్థి. 
 

67

ఆశిష్‌ విద్యార్థి హిందీ నటుడు. అక్కడ అనేక సినిమాలు చేశాడు. విలన్‌గా పాపులర్‌ అయ్యాడు. తెలుగులో `పాపే నా ప్రాణం` చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. `శ్రీరామ్‌`, `మాధురి`, `గిల్లీ`, `గుడుంబాశంకర్‌`, `ఛత్రపతి`, `అతనొక్కడే`, `నరసింహుడు` వంటి సినిమాలు చేశాడు. ఈ క్రమంలో `పోకిరి` పెద్ద బ్రేక్‌ ఇచ్చింది. విలన్‌గా మెప్పించాడు. ఆ తర్వాత మరింత బిజీ అయ్యాడు.
 

77

అరవై ఏళ్లు దాటిని ఆశిష్‌ విద్యార్థి ఇటీవల మరో పెళ్లి చేసుకున్నారు. అస్సాంకి చెందిన రూపాలి అనే ఫ్యాషన్‌ డిజైనర్‌ని ఆశిష్‌ విదార్థి మ్యారేజ్‌ చేసుకోవడం విశేషం. ఇప్పుడు తెలుగులో సినిమాలు లేవు, కానీ ఇతర భాషల్లో ఒకటి అర మూవీస్‌ చేస్తున్నాడు ఆశిష్‌ విద్యార్థి. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: చిరంజీవి, బాలకృష్ణతో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోయిన్ ఎవరు? కారణం ఏంటి?
Recommended image2
Ramya Krishnan: లవ్‌ లో ఫెయిల్యూర్‌ అయిన వాళ్ల కోసం పార్టనర్‌ని సెట్‌ చేస్తున్న రమ్యకృష్ణ.. క్రేజీ షో
Recommended image3
Vijay-Samantha: ఆయన ధైర్యం నాకు స్ఫూర్తి.. సీఎం విజయ్‌పై సమంత ఎమోషనల్ కామెంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved