MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • దయచేసి ఫ్యామిలీతో చూడకండి, ఈ పాయింట్ తో మూవీ ఎలా తీశాడు బాబోయ్.. కంప్లీట్ అడల్ట్ కామెడీ

దయచేసి ఫ్యామిలీతో చూడకండి, ఈ పాయింట్ తో మూవీ ఎలా తీశాడు బాబోయ్.. కంప్లీట్ అడల్ట్ కామెడీ

Ibomma: ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చూసుంటారు. కానీ ఇది అడల్ట్ కామెడీలో జోనర్ లో సర్ప్రైజ్ చేసే చిత్రం. సినిమా చూశాక ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం కలగక మానదు.

1 Min read
Author : Tirumala Dornala
| Updated : Apr 13 2025, 06:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Perusu Movie

Perusu Movie

Ibomma: ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చూసుంటారు. కానీ ఇది అడల్ట్ కామెడీలో జోనర్ లో సర్ప్రైజ్ చేసే చిత్రం. సినిమా చూశాక ఇలాంటి ఐడియా ఎలా వచ్చింది అనే ఆశ్చర్యం కలగక మానదు. ఈ చిత్రం పేరు పేరుసు. అంటే పెద్దాయన అని అర్థం వస్తుంది. ఈ చిత్రం నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
24

పైరసీ వెబ్ సైట్ ఐబొమ్మలో కూడా ఈ చిత్రం లీక్ అయింది. యువత ఈ చిత్రాన్ని చూసేందుకు ఎగబడుతున్నారు. కంప్లీట్ అడల్ట్ కామెడీ చిత్రంగా ఈ మూవీ నవ్వులు కురిపిస్తోంది. అయితే ఈ చిత్రాన్ని ఫ్యామిలీతో కూర్చుని అసలు చూడలేరు. ఒంటరిగా మాత్రమే చూడాలి. ఈ చిత్రంలో మరో విశేషం ఏంటంటే ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి కుమారుడు వైభవ్ రెడ్డి ఈ చిత్రంలో హీరోగా నటించారు. వైభవ్ సోదరుడు సునీల్ రెడ్డి కూడా ఈ చిత్రంలో నటించడం విశేషం. రామనాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న విడుదలయింది. తాజాగా ఓటిటిలోకి వచ్చింది. 

34

కథ విషయానికి వస్తే..పరంధామయ్య అనే వ్యక్తి ఒక గ్రామంలో పెద్దమనిషిగా చలామణి అవుతుంటారు. ఆయనకి ఇద్దరు కుమారులు ఉంటారు. కుమారులిద్దరికీ పెళ్లిళ్లు జరిగి ఉంటాయి. ఒకరోజు పరంధామయ్య టీవీ చూస్తూ మరణిస్తారు. కానీ ఆయన చావుని బయటకి చెప్పుకోలేని సమస్య కుటుంబ సభ్యులకు తలెత్తుతుంది. చెబితే కుటుంబ పరువు పోతుంది. దీనితో ఊళ్ళో వాళ్ళకి తెలియకుండా అంత్యక్రియలు నిర్వహించాలని భావిస్తారు ఆయన కుమారులు. ఈ క్రమంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి అనేది మిగిలిన కథ. 
 

44

బూతుల అనిపించే పాయింట్ చుట్టూ కథ అల్లడం ఒక సవాల్ అనుకుంటే దానిచుట్టూ కామెడీ పండించడం మరో సవాల్. ఈ రెండు అంశాలు ఈ చిత్రంలో బాగా కుదిరాయి. అడల్ట్ కామెడీ చిత్రాలని ఇష్టపడే వారికి ఈ చిత్రం తెగ నచ్చేస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ ఈ చిత్రానికి దూరంగా ఉండడం బెటర్. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
సినిమా సమీక్షలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Ananya Panday: భరతనాట్యం చేశావా? ఖూనీ చేశావా? అనన్య డ్యాన్స్‌పై నెటిజన్ల ఫైర్
Recommended image2
Sri Satya: యాంకర్‌గా టర్న్ తీసుకున్న బిగ్‌ బాస్‌ నటి.. కాన్స్ లో శ్రీసత్య కొత్త జర్నీ షురూ
Recommended image3
Allu Arjun: ఐకాన్ స్టార్ చేతికి అదిరిపోయే లగ్జరీ వాచ్, కాస్ట్ తెలిస్తే కళ్లు తిరగాల్సిందే, అల్లు అర్జున్ గడియారం రేటెంతంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved