MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Entertainment
  • Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌

Peddi 13 Days Collections: మూడో వారంలో పెద్ది ఊహించని డ్రాప్‌, అయినా బాక్సాఫీసు వద్ద రామ్‌ చరణ్‌ ర్యాంపేజ్‌

రామ్‌ చరణ్‌ నటించిన `పెద్ది` సినిమా బాక్సాఫీసు వద్ద తన సత్తాని చాటుతోంది. మిశ్రమ స్పందనతోనూ ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లని రాబడుతుంది. ఇప్పటి వరకు ఎంత రాబట్టింది? హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలనేది చూస్తే. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Jun 17 2026, 07:32 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మూడో వారంలో సత్తా చాటుతున్న పెద్ది
Image Credit : Asianet News

మూడో వారంలో సత్తా చాటుతున్న పెద్ది

ఇటీవల కాలంలో ఓ సినిమాకి మిశ్రమ స్పందన లభించినా, కొద్దిగా నెగటివ్‌ టాక్‌ వచ్చినా, అది థియేటర్లో నిలబడటం కష్టం. ఆ ప్రభావం వసూళ్లపై  ఉంటుంది. మొదటి వీకెండ్‌ వరకు సత్తా చాటి, ఆ తర్వాత వీక్‌ డేస్‌లో భారీగా పడిపోతుంటాయి. రెండో వారం ఏమాత్రం ప్రభావం చూపించవు. కానీ పెద్ది విషయంలో రివర్స్ అవుతుంది. ఈ చిత్రం టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతోంది. మూడో వారంలోనూ అదిరిపోయే వసూళ్లని రాబడుతుంది. గత వారంతో పోల్చితే భారీగా డ్రాప్‌ ఉన్నా, వసూళ్లు డీసెంట్‌గా ఉండటం విశేషం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
భారీ బడ్జెట్‌తో రూపొందిన పెద్ది సినిమా
Image Credit : Asianet News

భారీ బడ్జెట్‌తో రూపొందిన పెద్ది సినిమా

రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో `పెద్ది` సినిమా రూపొందిన విషయం తెలిసిందే. ఇందులో బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటించింది. జగపతిబాబు, కన్నడ స్టార్‌ శివరాజ్‌ కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించారు. ఇంకా చాలా భారీ కాస్టింగ్‌ ఉంది. భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా మూవీగా దీన్ని తెరకెక్కించారు నిర్మాత వెంకట్ సతీష్‌ కిలారు. వృద్ధి మూవీస్‌ పతాకంపై ఆయన ఈ చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. ఇందులో సుకుమార్‌ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ కూడా భాగస్వామ్యమయ్యారు.

35
రామ్‌ చరణ్‌ నటనకు ప్రశంసలు
Image Credit : Asianet News

రామ్‌ చరణ్‌ నటనకు ప్రశంసలు

భారీ అంచనాల మధ్య జూన్‌ 4న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ప్రీమియర్స్ నుంచే ఈ చిత్రానికి కొంత మిక్స్డ్‌ టాక్‌ వచ్చింది. కథగా బాగుంది. కానీ కథనం స్లోగా ఉందని, ఎమోషన్స్ అంతగా క్యారీ కాలేదనే టాక్‌ వచ్చింది. కానీ రామ్‌ చరణ్‌ మాత్రం తన నటనతో సినిమాని తీసుకెళ్లిపోయారు. అద్భుతమైన నటనతో అదరగొట్టారు. సినిమా కోసం ఆయన ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేములోనూ కనిపిస్తుంది. పైగా  పెద్ది ఇన్‌స్పైరింగ్‌ జర్నీ అందరిని కదిలించింది. అందుకే ఈ మూవీ టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లని రాబడుతుంది. అయితే ఇప్పటికే రెండు వారాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు మూడో వారం రన్నింగ్‌లో ఉంది. గత వీకెండ్‌లో సత్తా చాటిన ఈ చిత్రం  కలెక్షన్లు వీక్‌ డేస్‌లో భారీగా తగ్గాయి.

45
పెద్ది 13రోజుల కలెక్షన్లు.. స్టేట్‌ వైజ్‌
Image Credit : Asianet News

పెద్ది 13రోజుల కలెక్షన్లు.. స్టేట్‌ వైజ్‌

ఆదివారం పది కోట్లకుపైగా వసూళ్లని రాబడితే, సోమవారం నాలున్నర(రూ.4.73) కోట్లు, మంగళవారం సుమారు నాలుగు(రూ.3.97) కోట్లు వసూలు చేసింది. సోమవారంతో పోల్చితే మంగళవారం కలెక్షన్లు డ్రాప్‌ అయ్యాయి. అయినా మూడో వారంలో కూడా ఈ స్థాయి కలెక్షన్లని రాబట్టడం విశేషం. ఇక  sacnilk.com ప్రకారం 13 రోజుల్లో ఈ చిత్రానికి ప్రపంచ వ్యాప్తంగా రూ.317.12కోట్లు వచ్చాయి. ఇండియాలో   రూ.265కోట్లు, ఓవర్సీస్‌ సుమారు రూ.52కోట్లు రాబట్టింది. స్టేట్‌ వైడ్‌గా `పెద్ది` కలెక్షన్లు చూస్తే తెలుగు రాష్ట్రాల్లో   రూ.201.45కోట్లు, తమిళనాడులో రూ.6.25కోట్లు, కర్నాటకలో రూ.28.48కోట్లు, కేరళలో రూ.72లక్షలు, నార్త్ లో రూ.28కోట్లు వచ్చాయి.

55
పెద్ది హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?
Image Credit : Asianet News

పెద్ది హిట్‌ కావాలంటే ఇంకా ఎంత రావాలంటే?

అయితే ఈ మూవీ హిందీలో గట్టిగా వసూలు చేస్తుందని భావించారు. కానీ అక్కడ గట్టి దెబ్బ పడింది. అలాగే ఓవర్సీస్‌లోనూ ఇంకా బాగా చేస్తుందనుకున్నారు. అక్కడ కూడా కలెక్షన్లు పడిపోయాయి. ఈ విషయాన్ని స్వయంగా చిత్ర నిర్మాతలే ఒప్పుకున్నారు. ఈవెన్ కర్నాటకలో కూడా అనుకున్నదానికంటే తక్కువే వచ్చాయి. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ మూవీ గట్టిగా వసూలు చేసిందని చెప్పొచ్చు. ఈ సినిమా థియేట్రికల్‌గా హిట్‌ కావాలంటే రూ.220కోట్ల షేర్‌ రావాలి. ఇప్పటి వరకు దాదాపుగా రూ.180కోట్ల వరకు వచ్చింది. ఇంకా నాలభై కోట్ల వరకు రాబట్టాల్సి ఉంది. లాంగ్‌ రన్‌లో ఇది మరో ఇరవై కోట్ల షేర్‌ సాధించే ఛాన్స్ ఉంది. కాకపోతే మరో 20-30కోట్ల వరకు నష్టాలు తెచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే చిత్ర బృందం ఇప్పటికే ఇది రూ.405కోట్లు రాబట్టినట్టు  వెల్లడించింది. వారి లెక్కల ప్రకారమైనా ఈ మూవీ ఇంకా నలభై కోట్లు రాబట్టాలి. మరి అది ఎంత వరకు సాధ్యమనేది చూడాలి. కానీ మిశ్రమ స్పందనతోనూ ఈ మూవీ ఈ స్థాయి వసూళ్లని రాబట్టడం విశేషమనే చెప్పాలి. అందుకు రామ్‌ చరణే కారణమని చెప్పొచ్చు. 

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
రామ్ చరణ్ కొణిదెల
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఎన్టీఆర్, ఏఎన్నార్ మధ్య పోటీ వల్ల ఆర్టిస్టులు ఎలా నష్టపోయేవారో తెలుసా? సీనియర్ నటుడు చంద్రమోహన్ సంచలన కామెంట్స్..
Recommended image2
Chaitra Rai: వర్షిణి, సుధీర్ హైడ్రామా అట్టర్ ఫ్లాప్.. బిగ్ బాస్ హౌస్ నుంచి చైత్ర రాయ్ అవుట్, మరో ఎలిమినేషన్
Recommended image3
Shrimad Bhagavatam: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు ఏడు భాగాలుగా విష్ణువు కథ.. భారీ స్కేల్‌లో సినిమాలు
Related Stories
Recommended image1
Save The Tigers 3 First Review: సేవ్‌ ది టైగర్స్ సీజన్‌ 3 ఫస్ట్ రివ్యూ.. హైలైట్స్ ఇవే, మైనస్‌ ఏంటంటే?
Recommended image2
Mahesh Next Film: మహేష్‌ బాబు నెక్ట్స్ మూవీ ఫిక్స్, బాక్సాఫీసు వద్ద అరాచకమే.. `పెద్ది` డైరెక్టర్‌ కాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved