100 కోట్లు ఇచ్చినా నయనతార నటించనన్న హీరోకి జోడీగా తెలుగు హీరోయిన్ ?
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ లేడీ సూపర్ స్టార్ నయనతార 100 కోట్లు ఇచ్చిన నటించను అని రిజెక్ట్ చేసిన ఓ హీరోకి జోడీగా తెలుగు హీరోయిన్ నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరా హీరో, ఎవరా హీరోయిన్.

నయనతార రిజెక్ట్ చేసిన హీరో
గతంలో నయనతార ఒక హీరోను రిజెక్ట్ చేశారన్న వార్త సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది. 100 కోట్లు ఇచ్చినా కాని ఆ హీరో సరసన నటించను అని నయనతార అన్నట్టు, తమిళ సినిమా విశ్లేషకుడు వెల్లడించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఈక్రమంలో ఆ హీరో సరసన నటించడానికి టాలీవుడ్ హీరోయిన్ రెడీ అయినట్టు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు లెజెండ్ శరవణన్.
సినిమాల మీద ప్రేమతో
సినిమాలపై ప్రేమతో తో వ్యాపార రంగం నుండి సినీరంగంలోకి అడుగుపెట్టిన లెజెండ్ శరవణన్, మళ్లీ మరోసారి ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేయడానికి సిద్ధమయ్యారు. వయసు యాభై దాటి హీరోగా తెరంగేట్రం చేసిన ఆయన, 'లెజెండ్' అనే భారీ బడ్జెట్ పాన్-ఇండియా సినిమాతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించారు. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా విమర్శలు, ట్రోల్స్ తట్టుకొని కూడా తన లక్ష్యంపై నిలబడిన శరవణన్, ఇప్పుడు రెండో సినిమాకు రెడీ అవుతున్నారు. ఈసినిమాలో హీరోయిన్ గా నయనతార రిజెక్ట్ చేయడంతో బాలీవుడ్ నుంచి హీరోయిన్ ను తీసుకున్నారు.
రెండో సినిమాకు రెడీ అవుతున్న శరవణన్
తాజా సమాచారం ప్రకారం, శరవణన్ తన రెండో సినిమాకు యాక్షన్-రొమాంటిక్ జానర్‌లో రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై కొంత కాలంగా కొనసాగుతున్నట్టు తెలిసింది. ఈ సినిమాలో శరవణన్ కంప్లీట్ గా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం భారీ బడ్జెట్ కేటాయించారని సమాచారం.
శరవణన్ జోడీగా పాయల్ రాజ్ పుత్
ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేసినట్టు ఇండస్ట్రీ వర్గాల నుంచి సమాచారం. అలాగే టాలీవుడ్ నుంచి హాట్ బ్యూటీగా గుర్తింపు పొందిన పాయల్ రాజ్‌పుత్ ఈ సినిమాలో శరవణన్‌కు జోడిగా నటించనుంది. 'ఆర్ఎక్స్ 100' సినిమా ద్వారా తెలుగులో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న పాయల్, ఆ సినిమాతో తన రొమాంటిక్ యాక్టింగ్ తో యువతను ఆకట్టుకుంది. అయితే ఆ తరువాత కొన్ని సినిమాలు చేసినా.. ఆమెకు స్టార్ డమ్ రాలేదు. రీసెంట్ గా మళ్లీ ‘మంగళవారం’ సినిమాతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది పాయల్ రాజ్‌పుత్.
ఎలా ఉండబోతోంది?
ఇక శరవణన్ సినిమాలో నటించి, మరోసారి ప్రేక్షకుల చూపు తనవైపు తీప్పుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ మూవీ ద్వారా పాయల్ బిగ్ స్క్రీన్‌పై ఎలాంటి గ్లామర్ పాత్రలో కనిపించబోతుందా అని అంతా ఎదురు చూస్తున్నారు. ఇక ఆమె సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతోంది. శరవణన్ స్టోర్స్ అధినేతగా పేరుగాంచిన శరవణన్, తన బ్రాండ్ యాడ్స్‌లో స్టార్ హీరోయిన్స్‌తో కలిసి నటిస్తూ పాపులర్ అయ్యారు. ఆ సమయంలోనూ ట్రోల్స్ ఎదుర్కొన్న ఆయన, వాటిని పట్టించుకోకుండా తన సినిమా ప్యాషన్‌ను కొనసాగిస్తున్నారు.