Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Entertainment
  • ఈ టైంలో పవన్ ని కెలకొద్దు.. వాళ్ళిద్దరిని వేడుకుంటున్న ఫ్యాన్స్, టీంతో వీరమల్లు హంగామా

ఈ టైంలో పవన్ ని కెలకొద్దు.. వాళ్ళిద్దరిని వేడుకుంటున్న ఫ్యాన్స్, టీంతో వీరమల్లు హంగామా

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేస్తున్న అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ఇదే. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

team telugu | Published : Sep 30 2022, 07:00 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రిష్ జాగర్లమూడి కాంబినేషన్ లో హరిహర వీరమల్లు చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం మొదలైనప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు.. అంతకు మించిన రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ చిత్రానికి ఆర్థిక సమస్యలు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది. రూమర్స్ అన్నీ పటాపంచలు చేస్తూ చిత్ర యూనిట్ కీలకమైన కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోంది. 

26
Asianet Image

పవన్ కళ్యాణ్ తన కెరీర్ లో చేస్తున్న అత్యంత భారీ బడ్జెట్ యాక్షన్ మూవీ ఇదే. ఏఎం రత్నం ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకుడు క్రిష్ పక్కా ప్రణాళికతో ఈ చిత్ర అవుట్ ఫుట్ రాబడుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల పవర్ గ్లాన్స్ పేరుతో విడుదలైన టీజర్ కి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. 

 

36
Asianet Image

ఇక నేడు సరస్వతి పంచమి సందర్భంగా.. సరస్వతి దేవి పూజ నిర్వహించి కొత్త షెడ్యూల్ కి సంబంధించిన వర్క్ షాప్ ప్రారంభించారు. చిత్రానికి హైలైట్ గా నిలిచే సన్నివేశాలని క్రిష్ ఈ షెడ్యూల్ లో షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. దీనితో నటీనటులు ఎలా వ్యవహరించాలి.. వారి పాత్రలకు సంబంధించిన ఇన్ పుట్స్ లాంటి అంశాలపై చర్చించారు. 

 

46
Asianet Image

ఈ వర్క్ షాప్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరికొత్త లుక్ లో సూపర్ స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చారు. రీసెంట్ టైమ్స్ లో పవన్ కళ్యాణ్ బెస్ట్ లుక్ ఇదే అని చెప్పొచ్చు. రెడ్ టీ షర్ట్, జీన్స్ లో పవన్ అల్ట్రా స్టైలిష్ గా కనిపిస్తున్నారు. పవన్ లుక్ తో ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీరమల్లు హంగామా మొదలు పెట్టారు. లెజెండ్రీ సంగీత దర్శకులు కీరవాణి, దర్శకుడు క్రిష్, పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం, నటుడు సుబ్బరాజు. రఘు బాబు, నిధి అగర్వాల్, ఇతర టెక్నికల్ టీం పాల్గొన్నారు. 

56
Asianet Image

వీరమల్లు హంగామా చూస్తుంటే పవన్ ఫ్యాన్స్ లో అంచనాలు పెరిగిపోతున్నాయి. వీరమల్లు చిత్రం భారీ స్థాయిలో ఉండబోతోందని అర్థం అవుతోంది. దీనితో పీకే ఫ్యాన్స్ ఇద్దరు దర్శకులని వేడుకుంటున్నారు. ఈ టైం లో పవన్ కళ్యాణ్ వద్దకు రీమేక్ సబ్జెక్ట్స్ తో రావద్దని త్రివిక్రమ్ శ్రీనివాస్, సముద్ర ఖని లని రిక్వస్ట్ చేస్తున్నారు. 

66
Asianet Image

పవన్ కళ్యాణ్ తో సముద్ర ఖని.. వినోదయ సిత్తం రీమేక్ చేయాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ ఈ ప్రపోజల్ ని పవన్ ముందు పెట్టారు. సినిమా కూడా ప్రారంభమైనట్లు ప్రచారం జరిగింది. కానీ ఊహించని విధంగా పవన్ ఈ చిత్రాన్ని పక్కన పెట్టేశాడు. ప్రస్తుతం పవర్ స్టార్ ఫోకస్ మొత్తం హరిహర వీరమల్లు చిత్రంపైనే ఉంది. ఇకపై పవన్ రీమేక్ కథలు చేయవద్దని స్వయంగా అభిమానులే కోరుకుంటున్నారు. 

Sreeharsha Gopagani
About the Author
Sreeharsha Gopagani
పవన్ కళ్యాణ్
 
Recommended Stories
Top Stories