MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • గూస్ బంప్స్ గ్యారెంటీ.. బాలయ్య కోసం పవన్ ఆ పని చేయబోతున్నారా, అది కూడా అక్కడ ?

గూస్ బంప్స్ గ్యారెంటీ.. బాలయ్య కోసం పవన్ ఆ పని చేయబోతున్నారా, అది కూడా అక్కడ ?

త్వరలో పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నారు.  మెగా నందమూరి అభిమానుల్లో ఈ న్యూస్ చాలా ఆసక్తికరంగా మారింది. పవన్, బాలయ్య ఇద్దరూ భిన్నమైన శైలి కలిగిన బిగ్ స్టార్స్. గతంలో వీరిద్దరికి అంతగా పరిచయం కూడా లేదు.

2 Min read
Author : Sreeharsha Gopagani
Published : Dec 25 2022, 04:27 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హరిహర వీరమల్లు చిత్రంతో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే ఈ చిత్రం భారీ బడ్జెట్ లో తెరకెక్కుతోంది. దర్శకుడు క్రిష్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా తీర్చిదిద్దుతున్నారు. అలాగే హరీష్ శంకర్ దర్శకత్వంలో కూడా ఉస్తాద్  భగత్ సింగ్ చిత్రం ప్రారంభం ఐంది. 

 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో పవన్ కళ్యాణ్ బాలయ్య హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ షోకి హాజరు కాబోతున్నారు.  మెగా నందమూరి అభిమానుల్లో ఈ న్యూస్ చాలా ఆసక్తికరంగా మారింది. పవన్, బాలయ్య ఇద్దరూ భిన్నమైన శైలి కలిగిన బిగ్ స్టార్స్. గతంలో వీరిద్దరికి అంతగా పరిచయం కూడా లేదు. దీనితో అన్ స్టాపబుల్ షో లో బాలయ్య, పవన్ మధ్య సంభాషణ ఎలా ఉండబోతోంది అనే ఉత్కంఠ నెలకొంది. 

 

36

కానీ ఇంతలోనే వీరిద్దరూ సర్ప్రైజ్ ల మీద సర్ప్రైజ్ లు ఇస్తున్నారు. ఇటీవల పవన్ కళ్యాణ్.. బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి చిత్ర సెట్స్ కి హాజరయ్యారు. ఆ దృశ్యాలు ఇంటర్నెట్ లో అభిమానులని ఊపేశాయి. 

 

46

పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ షోకి హాజరవుతుండడం, వీరసింహారెడ్డి సెట్స్ కి హాజరు కావడం ఇలాంటి సర్ప్రైజ్ ల నుంచి ఫ్యాన్స్ ఇంకా తేరుకోలేదు. కానీ ఇంతలో షాకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరు కాబోతున్నట్లు జోరుగా ప్రచారం మొదలయింది. 

 

56

ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు గమనిస్తుంటే ఇది జరిగినా ఆశ్చర్యపోనవసరం లేదు. బాలయ్య, పవన్ పబ్లిక్ గా ఒకే వేదిక కనిపిస్తే ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అని చెప్పొచ్చు. వీరసింహారెడ్డి ప్రీ రిలీజ్ వేడుక జనవరి 6న నిర్వహించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. ప్రీరిలీజ్ వేడుక కోసం ఒక ప్రత్యేక వెన్యూ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. వీరసింహారెడ్డి దర్శకుడు గోపీచంద్ మలినేని సొంత ఊరు ఒంగోలులో ప్రీరిలీజ్ వేడుకని నిర్వహించబోతున్నారట. 

 

66

పవన్ కళ్యాణ్ ఒంగోలుకి వెళ్లి వీరిసింహారెడ్డి ప్రీరిలీజ్ వేడుకలో పాల్గొంటారట. అయితే జరుగుతున్న ఈ ప్రచారంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. పొలిటికల్ గా కూడా మైలేజ్ పెంచుకునే ప్లాన్ లో భాగమే ఇదంతా అనే ప్రచారం కూడా జరుగుతోంది. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి, జనసేన పొత్తు పెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.  

 

About the Author

SG
Sreeharsha Gopagani
నందమూరి బాలకృష్ణ
పవన్ కళ్యాణ్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Balakrishna: ట్రంప్ కు బాలకృష్ణ మాస్ వార్నింగ్, ఇరాన్ ఇంతపని చేసిందేంటి? వైరల్ అవుతున్న వీడియో
Recommended image2
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image3
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved