MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • డాక్టర్, సైకాలజిస్ట్, మోడల్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఒక్క సినిమాతోనే మాయం

డాక్టర్, సైకాలజిస్ట్, మోడల్ ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న పవన్ హీరోయిన్ ఎవరో తెలుసా ? ఒక్క సినిమాతోనే మాయం

పవన్ కళ్యాణ్ సినిమాలో నటించిన ఓ హీరోయిన్ డాక్టర్ గా, సైకాలజిస్ట్ గా, మోడల్ గా రాణించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న ఆ హీరోయిన్ ఎవరో ఈ కథనంలో తెలుసుకుందాం. 

1 Min read
Author : Tirumala Dornala
Published : Sep 07 2025, 12:41 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : Asianet News

చిత్ర పరిశ్రమలో మల్టీ ట్యాలెంటెడ్ అయిన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. వివిధ రంగాలలో రాణించే అమ్మాయిలు కూడా హీరోయిన్లుగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. సాఫ్ట్ వేర్లుగా, డాక్టర్లుగా రాణించే అమ్మాయిలు హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్న సందర్భాలు ఉన్నాయి. శ్రీలీల, సాయి పల్లవి లాంటి హీరోయిన్లు మెడిసిన్ చదివి హీరోయిన్లుగా అవకాశాలు అందుకున్నారు. 

25
Image Credit : Asianet News

దాదాపు 26 ఏళ్ళ క్రితమే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రంలో ఓ డాక్టర్ హీరోయిన్ గా నటించింది. పవన్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన తమ్ముడు చిత్రం అది. ఈ మూవీలో ప్రీతీ జింగ్యానీతో పాటు మరో హీరోయిన్ కూడా నటించింది. ఆమె పేరు అదితి గోవిత్రికర్. వృత్తిరీత్యా ఆమె డాక్టర్. అదితి గోవిత్రికర్ కేవలం డాక్టర్ మాత్రమే కాదు సైకాలజిస్ట్ కూడా. 

Related Articles

Related image1
రాజశేఖర్ ప్రభంజనంతో చిత్తైపోయిన మహేష్ సినిమా ఏదో తెలుసా.. జీవితంలో అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పిన నటి
Related image2
మహేష్, కృష్ణ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ? అల్లు అరవింద్ పంట పండింది, అది కూడా చిరు ఖాతాలోనే
35
Image Credit : Asianet News

డాక్టర్ చదివినప్పటికీ ఆమె మోడలింగ్ పై ఆసక్తితో ఆ రంగాన్ని ఎంచుకున్నారు. మోడలింగ్ లో ఆమె అద్భుతంగా రాణించారు. మిస్సెస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న తొలి ఇండియన్ మహిళగా అదితి గోవిత్రికర్ రికార్డ్ సృష్టించారు.మోడలింగ్ లో ఉన్నప్పుడు ఆమె పలు కార్పొరేట్ సంస్థల యాడ్స్ లో నటించారు. పాండ్స్, కోకోకోలా లాంటి సంస్థల యాడ్స్ లో ఆమె నటించడం విశేషం. 

45
Image Credit : Asianet News

అయితే నటిగా రాణించాలనే ఆమె కోరిక పాక్షికంగా మాత్రమే నెరవేరింది. పవన్ కళ్యాణ్ తమ్ముడు చిత్రంతో అదితి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఆ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ అదితికి తెలుగులో అవకాశాలు రాలేదు. తెలుగులో ఆమె నటించిన ఏకైక చిత్రం తమ్ముడు మాత్రమే. ఆ తర్వాత బాలీవుడ్ లో కొన్ని చిత్రాల్లో నటించింది. అక్కడ కూడా ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. 

55
Image Credit : Asianet News

ఈ క్రమంలో వ్యక్తిగత జీవితంలో కూడా అదితి కొన్ని సవాళ్లు ఎదుర్కొంది. 2007లో ఆమె తన భర్త ముఫజల్ నుంచి విడాకులు తీసుకుంది. వీరికి ఇద్దరు పిల్లలు సంతానం. భర్త నుంచి విడిపోయాక పిల్లల పోషణ కోసం అదితి తిరిగి డాక్టర్ వృత్తిలో చేరారు. ప్రస్తుతం ఆమె డాక్టర్ గా రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 51 ఏళ్ళు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
పవన్ కళ్యాణ్
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Meghana Raj: అబ్బాయి పుట్టాడని డాక్టర్ చెప్పినప్పుడే డిసైడ్ అయ్యా.. భర్త మరణంపై మేఘనా రాజ్ ఎమోషనల్
Recommended image2
Dhanush Rejects Film: స్టార్‌ డైరెక్టర్‌ ఆఫర్‌ ని రిజెక్ట్‌ చేసిన ధనుష్‌.. అసలు కారణం ఇదే
Recommended image3
Shanmukh Jaswanth: ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్..కుందనపు బొమ్మలా వైష్ణవి
Related Stories
Recommended image1
రాజశేఖర్ ప్రభంజనంతో చిత్తైపోయిన మహేష్ సినిమా ఏదో తెలుసా.. జీవితంలో అలాంటి క్యారెక్టర్ చేయనని చెప్పిన నటి
Recommended image2
మహేష్, కృష్ణ కాంబోలో మిస్ అయిన ఇండస్ట్రీ హిట్ మూవీ ? అల్లు అరవింద్ పంట పండింది, అది కూడా చిరు ఖాతాలోనే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved